పోర్చుగీసు ప్రభుత్వం కార్మికుల పని గంటల పెంపు, సర్వీస్ కండిషన్లలో మార్పు చేస్తూ ఒక బిల్లును తీసుకొచ్చింది. ప్రమాదకరమైన ఆ బిల్లుకు వ్యతిరేకంగా పోర్చుగీస్ దేశంలోని రెండు ప్రధాన కార్మిక సంఘాల నేతృత్వంలో దేశ కార్మిక వర్గం యావత్తూ 2025 డిసెంబర్ 9న సమ్మె చేసింది. ఈ దెబ్బతో ప్రభుత్వం కొంత వెనకడుగు వేసినట్టుగా నటించింది. మళ్లీ ఇప్పుడు అదే బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నది.
ప్రస్తుత సంస్కరణలు “పుండు మీద కారం చల్లిన” చందంగా కార్మికుల పరిస్థితులు మరింత అధ్వాన్నం కానున్నాయి.
భారతదేశంలో లేబర్ కోడ్ల అమలు..
మనదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన విజయోత్సాహంతో లేబర్ కోడ్ల అమలుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
మిలిటెంట్ పోరాటాలు..
అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో సహా పలు దేశాలలో ప్రభుత్వాలు కార్మికులపై దమనకాండను తీవ్రం చేస్తున్నాయి. దీనికి ప్రతిగా ఆ దేశాలన్నింటిలో కూడా మిలిటెంట్ పోరాటాలు జరుగుతున్నాయి.
పెట్టుబడి స్వాభావిక లక్షణమే కార్మిక వర్గం రక్తాన్ని పిండి లాభాలుగా మార్చుకోవడం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాలన్నింటిలో ప్రభుత్వాల తీరు ఇదే.
కార్మిక వర్గ ఐక్యత..
దాదాపు 150 సంవత్సరాల క్రితం కార్ల్ మార్క్స్ “ప్రపంచ కార్మికులారా ఏకం కండి” అని ఇచ్చిన నినాదం నేటి తక్షణ ఆవశ్యకతగా మారింది.
పోర్చుగీస్ కార్మికులు జరుపుతున్న సమ్మెకు భారత కార్మిక వర్గం కూడా సంఘీభావం తెలియజేయడం అవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
