అతడొక హిమశిఖరం
సముద్ర అలల నుంచి ఎగసి పడిన పోరు కెరటం
వర్షించిన వసంత మేఘం
మానవత్వం పరిమళించిన సోయగం..
భారతావని తనువుల్లో నడయాడిన విప్లవజ్యోతి
ఆధునిక భారత ఆశల సౌధం
నీతివంతమైన రాజకీయాలకు వన్నె తెచ్చిన కీర్తి పతాక..
ప్రజాసేవలో పల్లవించిన ఆణిముత్యం
అతడొక మరణంలేని మహాకావ్యం
రవివర్మ కుంచెకు అందని సౌందర్యం
నిష్కల్మషమైన చిరునవ్వు.. చెరగని దరహాసం..
మంచు పూల పల్లకిలో పవళించిన జీవితం కాదు..
ముళ్లబాట.. పలుగురాళ్లలో పయనించిన బహుదూరపు బాటసారి..
అణచబడ్డ గొంతుకల హక్కులను ఎక్కుపెట్టిన మార్క్సిస్టు బాణం
ఫాసిస్టు మతమౌఢ్యపు శక్తుల దుశ్చర్యలను చీల్చి చెండాడిన కలం యోధుడు
నిఖిల లోకం హర్షించిన స్వేచ్ఛాగీతం..
చెదురుతున్న హృదయాల శోకానికి
దోపిడీ పీడన, మానవాళి విముక్తికి
మార్క్సిజమే శరణమన్న కర్మశాలి
ఎల్లలు దాటిన దౌత్యం, బహుముఖ ప్రజ్ఞాపాటవం
ఆధునిక రాజకీయ ఔన్నత్యానికి ప్రతీక
కలికాలానికి తృణప్రాయంగా ప్రాణాలర్పించిన ధరణి పుత్రుడు
నవభారత భాగ్యవిధాత కామ్రేడ్ ఏచూరికి కన్నీటి నివాళులు..
(మార్క్సిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
