Reading Time: < 1 minute
ఓహో.. రియా..
నీ తెగింపే ఢిల్లీ పోలీస్ వ్యాన్ను
నీ ఒంటి చేత్తో ఆపిన తీరు..
అరచేత్తో
సూర్యకాంతిని ఎట్లా ఆపలేవో
లక్షలాది బిగి పిడికిళ్లూ
మీ పీఠాన్ని అట్లానే కూల్చక మానవు.
అదిగో..
ప్రశ్నను అంతం చేశానన్న
నీ గర్వాన్ని అణచి
నీదనుకుంటున్న నీ ఇలాకాలో
మళ్ళీ కొత్త పుంతై
దేశాన్ని తనవైపుకు తిప్పుకుంది.
అదిగో…
సూర్యుడు అస్తమించినట్లు
అనిపించినా..
అది రేపటి ఉక్కు పిడికిళ్ళై
పిడుగుద్దులు గుద్దక మానదు.
ఇక.. కాచుకో నల్లత్రాచు..
కాలం మార్చితే ఆగదు..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
