ప్రాథమిక/ఆదిమ మూలధన సంచితం..
అంతకు ముందు, మూలధన ప్రారంభ వ్యయం నుంచి అదనపు విలువ సృష్టించబడే ప్రక్రియను మనం పరిశీలించాము. సర్క్యూట్ మూలధనం ఉత్పత్తి దశ C-P-C’ ఉత్పత్తి ప్రక్రియలో అదనపు విలువ ఉద్భవించడం పరిశీలించాము.
ఇప్పుడు రెండు ప్రశ్నలు వస్తాయి, ఒకటి అదనపు విలువ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభస్థానానికి సంబంధించినది. మరొకటి దాని పరాకాష్టకు సంబంధించినది. ఈ భాగంలో మనం మొదటి ప్రశ్నను తీసుకుందాము.
మొదటి ప్రశ్నను లేవనెత్తడానికి, మనం సర్క్యూట్ మూలధనం M-C-M’కు వెళదాం. C ఒక భాగాన్ని ఏర్పర్చడంలో శ్రమశక్తి ఒక సరుకుగా ఉండడం వలన మాత్రమే, C-P-C’ దశ అదనపు విలువ ఉత్పత్తికి దారితీసుంది. ఎందుకంటే పనిదినంలో శ్రమ శక్తిని ఉపయోగించి సృష్టించిన విలువకూ, అదనపు విలువను కలిగి ఉన్న శ్రమ శక్తి రోజువారీ విలువల మధ్య వ్యత్యాసమే అది అయినందున. ఇప్పుడు అడగగలిగిన ప్రశ్న: సామాజిక-చారిత్రక పరిస్థితులు, వాటి మూలాలు ఏవి, దేనివలన శ్రమ శక్తి సరుకుగా మారుతుంది. అదనపు విలువ ఉత్పత్తిని అనుమతిస్తుంది.
M↗LP↘MP..
ఎక్కడ M(డబ్బు), LP అంటే శ్రమ శక్తి, MP అంటే ఉత్పత్తి సాధనాలు అవుతాయో ఆక్కడ లావాదేవి: (i) శ్రమ శక్తి సరుకుగా మారింది. (ii)ఉత్పత్తి సాధనాలన్నీ సరుకులుగా మారాయి. (iii) సమాజంలోని కొందరు వ్యక్తిల చేతిలో డబ్బులు పోగు పడినవారు ఉన్నారు. వారు ఆ ధనంతో కొన్న ఉత్పత్తి పరికరాల ద్వారా పనిలో పెట్టుకున్న కార్మికులతో ఆ ధన ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. అంతేకాకుండా (iv) సమాజంలో తమ శ్రమ శక్తిని అమ్ముకుని జీవించే వారి వర్గం కూడా ఉనికిలో ఉంది. కావున పైన అడిగిన ప్రశ్న ఈ నాలుగు లక్షణాల ఉనికి మూలం, పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటుంది.
సారంలో ఇది ఎలా ప్రశ్నిస్తుందంటే, ఇతరులను పనిలో పెట్టుకునేలా కొందరు ధనాన్ని సంపాదించారు. ఇతరులు తమ శ్రమశక్తిని తప్ప మరేమీ లేకుండా ఉన్నారా? పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రారంభదశలోని ధన రూపంలోని పెట్టబడి మూలధన సంచితానికి సంబంధించినది కావున, దీనిని ‘ప్రాథమిక’ లేదా ‘మొదటి’ మూలధన సంచితం సమస్యగా పిలుస్తారు.
అసలు పాపం అనే భావన ఆర్ధిక రూపంపై ఆధారపడటం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి అసభ్య లేదా క్షమాపణ కోరే పెట్టుబడిదారీ ఆర్ధశాస్త్రం ప్రయత్నించింది: ‘వేదాంతంలో మొదటి పాపం పోషించిన భాగాన్నే రాజకీయ అర్ధశాస్త్రంలో ప్రాథమిక/మొదటి మూలధన సంచితం పోషిస్తుంది.’
పెట్టుబడిదారీవాదనను ముతకగా చెప్పాలంటే, మెజారిటీ వారి వస్తువులను వృధా జీవనంలో నాశనం చేసుకుంటే, కొంతమంది వారి తెలివితేటలు, శ్రద్ధ– పొడుపు ద్వారా మూలధన సంచితాన్నిచేశారు. ఆ విధంగా మూలధన సంచితం చేసిన వారు పెట్టుబడిదారులుగానూ అలా చేయని వారు కార్మికులుగానూ మారారు.
మార్క్స్ ఈ భావనను అద్భుతమైన రీతిలో వ్యంగ్యంగా చిత్రించాడు. చారిత్రకంగా ఆదిమ మూలధన సంచితంలో పాల్గొన్న వాస్తవ ప్రక్రియలను కూడా స్పష్టంగా ‘పెట్టుబడి, సంపుటి 1లోని 8వ భాగంలో వివరించాడు. బ్రిటిష్ పెట్టుబడిదారీ విధానం విషయంలో ఆదిమ మూలధన సంచితం రెండు ప్రధాన వనరులు, ప్రత్యక్ష ఉత్పత్తిదారుడి నుంచి ఉత్పత్తులను లాగివేసుకోవడం, ఆ విధంగా ఉత్పత్తి సాధనాల నుంచి వారిని వేరు చేయడం, వలసలను దోపిడీ చేయడమని చెప్పడం తప్ప దీనిపై మనం ఇక్కడ పెద్దగా దృష్టి పెట్టకూడదు. తమ శ్రమను అమ్ముకునే ఆస్తిలేని ప్రజా బాహుళ్యాన్ని సృష్టించడానికి, ఉత్పత్తి సాధనాలను మూలధన భౌతిక అంశాలుగా మార్చడానికి వీటిలోని మొదటిది ఖచ్చితంగా కీలకమైనది.
వీటిలో రెండవది తక్కువ సంఖ్యలోని వ్యాపారులు, వర్ధమాన తయారీదారుల చేతులలో డబ్బుల రూపంలో కేంద్రీకరణను ప్రారంభించింది. అయితే, ప్రాథమిక మూలధన సంచిత ప్రక్రియలు చాలా క్లిష్టమైనవీ, చారిత్రకంగా వైవిధ్యభరితమైనవీను, ఇక్కడ వాటిని విస్తారంగా వివరించలేము.
(i) సమాజంలో ఉత్పత్తి సాధనాలపై పెట్టుబడిదారీ వర్గం గుత్తాధిపత్యం కలిగి ఉండడం, తమ శ్రమ శక్తిని సరుకుగా అమ్ముకునే, ఆస్తులేవీ లేని కార్మికవర్గం రెండూ కూడా చారిత్రకమైనవే కాని సహజ సృష్టి కాదనేది స్పష్టం. అంతేకాకుండా (ii) వర్తమాన అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఉదయిస్తున్న సమయంలో ఈ వర్గాలు సృష్టించబడినాయి.
ఇప్పటికీ ప్రపంచమంతటా వివిధ రకాల పద్దతుల ద్వారా సృష్టించడం కొనసాగుతున్నది: వ్యాపారంలో గుత్తాధిపత్యం ద్వారానూ, రాజ్య మద్దతు మొదలైన వాటి ద్వారా, ఒక చిన్న మైనారిటీ డబ్బులనూ, సంపదనూ సంచితం చేసి, తన గుప్పిటలో ఉంచుకున్నప్పటికీ, భూమిని రైతుల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, ఆర్థికేతర శక్తిని వినియోగించి చేతి వృత్తులవారిని, చిన్నచిన్న పారిశ్రామికవేత్తలను ధ్వంసం చేసి , ఆర్ధికంగా పెద్ద పరిశ్రమల పోటీ– ఇతర పద్ధతుల ద్వారానూ పెద్ద సంఖ్యలోని స్వంత్ర ఉత్పత్తి దారుల సమూహాలనూ చిన్న వ్యాపారులనూ ధ్వంసం చేసి కార్మికులుగా మార్చారు.
అదనపు విలువ నుంచి మొలధనానికి..
ప్రారంభ మూలధనం Mను పెట్టుబడిదారులు ఎలా కలిగి ఉన్నారనేది పక్కన బెట్టి, M’కు ఏమి జరుగుతుందన్న ప్రశ్నకు, ఆవిధంగా అదనపు విలువ (M’–M)మనం ఇప్పుడు వచ్చాము. M ఎలా M’గా అవుతుందో, అంటే మూలధనం అదనపు విలువకు ఎలా దారితీస్తుందో ఇంతకు ముందు గమనించాము. ఇప్పుడు మన కర్తవ్యం అదనపు విలువను మూలధంగా ఎలా మార్చవచ్చో చూడడం. అంటే మూలధన సంచితం ఎలా జరుగుతుందో మనం పరిశీలించాలని అనుకుంటున్నామని చెప్పడం.
అదనపు విలువలోని కొంత భాగాన్ని పెట్టుబదిదారులు అనుత్పాదకంగా వినియోగించుకోవచ్చు. ఇక్కడ మనం మిగిలిన దానిని గురించి ఆలోచిస్తున్నాము. అదనపు విలువను పెట్టుబడిదారీ వర్గం మొదట్లో దానం రూపంలో పొందుతుంది. అదనపు విలువను పెట్టుబడిగా మార్చడానికి ధన రూపంలోని అదనపు విలువను పెట్టుబడి భౌతిక రూపం అంశాలుగా మార్చాలి. అంటే, ఉత్పత్తి సాధనాలుగానూ (స్థిర పెట్టుబడి), పనిలో నియమించుకునే కార్మికుల శ్రమ శక్తిని పునరుత్పత్తి చేయడానికి అవసరమైన వినిమయ వస్తువులుగానూ(అస్థిర పెట్టుబడి) మార్చాలి.
మరొక మాటలో చెప్పాలంటే, అదనపు విలువను మరింత అదనపు విలువను ఉత్పత్తి చేసే మూలధనంగా మార్చడానికి ముందస్తు షరతు అది తగిన ఉత్పత్తి సాధనాలలోనూ, కార్మికుల వినిమయ వస్తువులలోనూ కలిసిపోయి ఉండాలి. పెట్టుబడిదారీ విధానంలోని సామాజిక ఉత్పత్తి ప్రణాళికారహిత, అరాచక లక్షణం వలన ఉత్పత్తి సాధనాలకూ, వినిమయ వస్తువులకూ మధ్య సరైన నిష్పత్తి (ఉత్పత్తి ప్రస్తుత సాంకేతిక, సామాజిక పరిస్థితులు నిర్ణయించినట్లు) ఎల్లప్పుడూ స్వయం చాలితంగా నిర్వహించబడవు. ఇది పునరుత్పత్తి ప్రక్రియలో సంక్షోభానికి అవకాశం కల్పించే మూలం. మనం ఈ విషయాన్ని తరువాత పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభాలను పరిశీలించేటప్పుడు పరిశీలిస్తాము. ఇప్పటికి ఈ ముందస్తు షరతు ఉనికిని మాత్రమే మనం గుర్తిస్తాము. ఇది ఎల్లప్పుడూ ఉంటుందని భావించి, మనం మూలధన సంచిత ప్రక్రియను పరిశీలిద్దాము.
పెట్టుబడిదారీ మూలధన సంచితం..
అదనపు విలువను మూలధనంగా మార్చే పరిస్థితులు సంతృప్తి చెందినప్పుడు పెట్టుబడిదారీ మూలధన సంచితం జరుగుతుంది. అటువంటి విస్తరణ సజీవ శ్రమ ఉపయోగం కన్నా నెమ్మదిగా జరిగినప్పటికీ , ఇది సాధారణంగా శ్రమ శక్తిని విస్తరింప జేస్తుంది. విస్తరించిన శ్రమ శక్తి సరఫరాను అందించడానికి అనువైన పద్దతిలో శ్రమ శక్తి విలువ నిర్ణయించబడుతుందనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 35వ భాగం, 34వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
