పెట్టుబడిదారీ మూలధన సంచిత ప్రక్రియ..
ఇప్పుడు, పెట్టుబడిదారీ మూలధన సంచిత ప్రక్రియపై మార్క్స్ విశ్లేషణపై మన వివరణను ప్రారంభిస్తాము. సరైన విశ్లేషణకు వెళ్ళే ముందు, పెట్టుబడిదారీ మూలధన సంచిత ప్రక్రియపై విశ్లేషణ జరుగుతున్న పరిస్థితులను క్లుప్తంగా గుర్తు చేసుకుందాము.
సర్క్యూట్ మూలధన ఉత్పత్తి దశ C-P-Cనే మనం పరిగణనలోకి తీసుకుంటాము. M-C, M’-C’ దశలు(circulation) పంపిణీకి చెందినవి, సర్క్యులేషన్ రంగంలోని సమస్యల నుంచి లేదా సరుకుల మార్పిడీ రంగంలోని సమస్యల నుంచి మనం ప్రస్తుతం సంగ్రహిస్తున్నాము. ప్రత్యేకంగా, సర్క్యులేషన్ దశలు అంటే డబ్బులను సరుకులుగానూ, సరుకులను డబ్బులుగా మార్చుకొనే సరుకులు వాటి విలువ వద్ద మారకం జరుగుతున్న దశలని మనం ఊహిస్తున్నాము. తద్వారా మనం ఉత్పత్తి దశపైన మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఈ దశ నిర్వహణను నియంత్రించే నియమాలను పరిశీలించాలని అనుకుంటున్నాము.
పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియపై మన విశ్లేషణలో C-P-C’ దశను మనం పరిశీలించాము. అంతేకాకుండా ఈ దశలోనే అదనపు విలువ ఉద్భవించిందని కనుగొన్నాము. ఇప్పుడు మనం C-P-C’ దశను ఒంటరి శ్రమ ప్రక్రియ(ఒక పెట్టుబడిదారుడినీ, అతను నియమించుకున్న కార్మికులతో కూడిన) సర్క్యూట్ పరంగా కాకుండా మొత్తం సామాజిక మూలధనం పరంగా పరిశీలిస్తాము. ఏ విధంగా మూలధనం నుంచి అదనపు విలువను సృష్టించే ప్రక్రియ ప్రతి సంవత్సరం సమాజంలో పునరావృతం అవుతున్నదో పరిశీలించడం ఉత్తమ మార్గం. మనం అప్పుడు అధ్యయనం చెయ్యవలసింది సామాజిక పునరుత్పత్తిని.
ఇక్కడ మనం రెండు అవకాశాలను స్పష్టంగా చూడవచ్చు. మొత్తం సమాజంలోని కార్మిక వర్గం ఒక నిర్దిష్ట మొత్తంలో అదనపు విలువను ఉత్పత్తి చేస్తుంది. ఈ అదనపు విలువను పెట్టుబడిదారీ వర్గం స్వంతం చేసుకుంటుంది. ఇప్పుడు ఈ అదనపు విలువను పెట్టుబడిదారులు తమలో తాము వెంటనే వినియోగించుకోవచ్చు. ఈ సందర్భంలో సమాజానికి అందుబాటులో ఉన్న మొత్తం ఉత్పత్తి సాధనాల నిల్వలు ఉత్పత్తి ప్రారంభంలో ఏ స్థాయిలో ఉన్నాయో అంతే ఉంటాయి. అంతేకాకుండా సామజిక ఉత్పత్తిని (కొన్ని ఇతర షరతులను తరువాత పరిశీలించాలి) ఇంతకూ ముందు ఉన్న స్థాయిలోనే కొనసాగించవచ్చు.
మరొక మాటలో, ఆర్ధిక వ్యవస్థ విస్తరణ(లేదా కుంచించుకు పోవడం)లేదు. సాధారణ పునరుత్పత్తి అని మార్క్స్ పిలిచినదే మనకున్నది. మరొక వైపున పెట్టుబడిదారీ వర్గం మొత్తం అదనపు విలువను వెంటనే ఖర్చుపెట్టకపోవచ్చు. అందులో కొంత భాగాన్నే ఖర్చుపెట్టవచ్చు. పెట్టుబడిదారీ వర్గం మరింత అదనపు విలువను పొందడానికి మిగిలినదానిని ఉత్పత్తిని విస్తరించడానికి వెచ్చించవచ్చు. ఈ సందర్భంలో వ్యక్తిగతంగా పెట్టుబడిదారీ వర్గం ఖర్చు పెట్టుకున్న దానిని పక్కన పెట్టి, ఉత్పత్తి సాధనాలుగా కొంత భాగాన్నీ, పనిలో పెట్టుకుంటున్న కొత్త కార్మికుల జీవనభృతికి కొంత భాగాన్నీ కలిగి ఉన్న మిగిలిన వాటిని ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టారు. అంటే అదనపు విలువలో కొంత భాగం(కొత్త) మూలధనంగా మారింది. ఇక్కడ మనకు విస్తరించిన ఉత్పత్తి లేదా ‘అదనపు విలువను మూలధనంగా మార్చడం ఉన్నది.’
దీని తరువాత, మనం మొదటగా సాధారణ పునరుత్పత్తినీ ఆ తరువాత అదనపు విలువను మూలధనంగా మార్చడాన్నీ చర్చిస్తాము.
సాధారణ పునరుత్పత్తి..
సామాజిక పునరుత్పత్తి నిరంతరం పునరావృతమౌతున్న సామాజిక ఉత్పత్తి తప్ప మరొకటి కాదు. మొదట పునరుత్పత్తిని భౌతిక పరంగా అంటే వస్తువులు, సేవల పునరుత్పత్తి పరంగా చూద్దాము.
ప్రతి సంవత్సరం సామాజిక ఉత్పత్తి క్రమంలో కొంత మొత్తం ఉత్పత్తి సాధనాలు ఉపయోగించబడతాయి. అందువల్ల కొంత వరకు యంత్రాల అరుగుదల ఉంటుంది. ఇంధనం వంటి ముడి సరుకులు వినియోగించబడతాయి. అదనంగా, సామాజిక ఉత్పత్తి దేని ద్వారా జరుగుతున్నదో ఆ శ్రమను చేసే కార్మికులు కూడా ఈ ప్రక్రియలో తమ శ్రమ శక్తిని ఖర్చు చేస్తారు. ఇంతకూ ముందులానే భౌతిక పునరుత్పత్తి జరగడానికి వారు ఇప్పటికే ఉపయోగించిన మేరకు ఉత్పత్తి సాధనాలనూ, మొత్తం కార్మికుల శ్రమ శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన వస్తువులూ, సేవలనూ తిరిగి కొత్తగా ఉత్పత్తి చెయ్యాలి.
ఉపయోగించిన ఉత్పత్తి సాధనాలను, కార్మికుల జీవనాధార ఉత్పత్తుల ఉత్పత్తినీ భర్తీ చేయడాన్ని మాత్రమే సాధారణ భౌతిక పునరుత్పత్తి సూచిస్తుండగా సామాజిక పునరుత్పత్తి మరింత సూచిస్తుంది. సామాజిక పునరుత్పత్తి దృక్కోణంలో పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియను చూడడం, ముందే చెల్లించిన విలువను పునరుత్పత్తి చేయడమే కాదు. అదనపు విలువను కూడా పునరుత్పత్తి చేయడమే. పెట్టుబడి దారీ పునరుత్పత్తి అదనపు విలువ పునరుత్పత్తిని సూచిస్తుంది. అదనపు విలువ పెట్టుబడిదారీ వర్గం రాబడిని(ఆదాయాన్ని) కలిగి ఉంటుంది. సాధారణ పునరుత్పత్తితో కార్మికుల నుంచి కొల్లగొట్టిన మొత్తం అదనపు విలువను అంతటినీ వ్యక్తిగత, అనుత్పాదక వినియోగంలో పెట్టుబడిదారీ వర్గం ఖర్చు చేస్తుంది.
సాధారణ పునరుత్పత్తి, పునరుత్పత్తిగా వంటరి, ఏకాకి అయిన ఉత్పత్తి పాత్ర నుంచి చాలా భిన్నమైన బహుళ ఉత్పాత్తుల పాత్రను పొందుతుంది. ప్రతి సంవత్సరమూ(సంవత్సరం తరువాత సంవత్సరం) కార్మికులు తాము తిరిగి వేతనంగా పొందుతున్న ఉత్పత్తినే కాక, కార్మికులకంటే చాలా ఎక్కువ జీవన స్థాయిలో పెట్టుబడిదారీ వర్గానికి ఆహారం, పునరుత్పత్తికి సరిపడా అదనపు విలువను కూడా ఉత్పత్తి చేస్తారు. పెట్టుబడిదారులు కార్మికునికి తన శ్రమకు తగ్గ విధంగా వేతనం చెల్లిస్తున్నట్లుగా కనపడే ధన రూపంలో వేతనాలను చెల్లించడం ద్వారా ఈ వాస్తవ పరిస్థితిని దాచిపెట్టారు. మార్క్స్ ఈ విషయాన్ని ఇలా చెప్పాడు.
కార్మికునికి వేతన రూపంలో వెనక్కి వెళుతున్నది అతను నిరంతరం పునరుత్పత్తి చేసే ఉత్పత్తిలో ఒక భాగం. ఒక్క పెట్టుబదిదారుడినీ ఒక్క కార్మికుడినీ తీసుకునే బదులు కార్మికవర్గాన్ని మొత్తంగా తీసుకుంటే డబ్బు జోక్యం ద్వారా పుట్టిన భ్రమ వెంటనే మాయమౌతుంది. పెట్టుబడిదారీ వర్గం నిరంతరం తరువాతి వారు(కార్మికులు) ఉత్పత్తి చేసిన మొదటివారు తమ స్వంతం చేసుకున్న సరుకులలో కొంత భాగాన్ని కార్మికవర్గానికి అధికారిక నోట్లను(order-notes) డబ్బుల రూపంలో ఇస్తున్నది. కార్మికులు నిరంతరం ఈ అధికారిక నోట్లను(order-notes) పెట్టుబడిదారీ వర్గానికి తిరిగి వెనుకకు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ విధంగా తమ స్వంత ఉత్పత్తిలో వారి వాటాను పొందుతారు. లావాదేవీ, ఉత్పత్తిపై సరుకు రూపంలో, సరుకుపై డబ్బు రూపంలో కప్పబడింది.
పెట్టుబడిదారులకోసం పని చేసి, ఉత్పత్తి చేసి కార్మిక వర్గం సరుకులను మాత్రమె ఉత్పత్తి చేయడం లేదు. సరుకులను మూలధనంగా కూడా ఉత్పత్తి చేస్తున్నది. చెప్పాలంటే, కార్మికులు ఉత్పత్తి చేసే వస్తువులు(i) సరుకులు, (ii) మొత్తం సమాజంలోని స్థిర- అస్థిర మూలధనం భౌతిక అంశాలు. ఈ విధంగా: ‘కార్మికుడు నిరంతరం వస్తువులను, వస్తుగత సంపదను ఉత్పత్తి చేస్తాడు. కానీ అతనిపై ఆధిపత్యం వహించి దోపిడీ చేసే, పరాయి శక్తి మూలధన రూపంలో ఉత్పత్తి చేస్తాడు.
పెట్టుబడిదారీ వర్గ దృక్కోణం నుంచి, కార్మికవర్గ పునరుత్పత్తికి అవసరమైన కార్మికులు వినియోగం భాగం మాత్రమే ఉత్పాదకమైనది. ఎందుకంటే ఇదొక్కటే కార్మికులను దోపిడీ చేయడాన్ని, పెట్టుబడిదారుల ఉనికిని సాధ్యం చేసే పరిస్థితులను సృష్టిస్తుంది. అదే లాంఛనంగా కార్మికుని దృక్కోణంలో అతనికి సంబంధించినంత వరకు తన వ్యక్తిగత వినిమయం అనుత్పాదకమైనది. ఎందుకంటే ‘అది పేద వ్యక్తిని తప్ప మరేమీ పునరుత్పత్తి చేయనందున; ఎందుకంటే అది వారి సంపదను సృష్టించే శక్తి ఉత్పత్తి అయినందున పెట్టుబడిదారుడికీ, రాజ్యానికీ అది ఉత్పాదకమైనది.
కార్మికునికి, అతని వ్యక్తిగత వినిమయం ద్వంద్వ పాత్ర పోషిస్తుంది: (i) అది తనను తాను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. (ii) ఈ ప్రక్రియలో అతను తన వేతనాలను వినియోగిస్తున్నందున, ఇది నిరంతరం కార్మిక మార్కెట్కు వెళ్ళమని అతన్ని బలవంతం చేస్తుంది. సంక్షిప్తీకరిస్తే ‘పెట్టుబడిదారీ ఉత్పత్తి, నిరంతర అనుసంధాన ప్రక్రియ అంశం కింద, పునరుత్పత్తి ప్రక్రియ కింద సరుకులనూ, అదనపు విలువనే కాదు ఒక వైపున ఇది పెట్టుబడిదారీ సంబంధాలను మరొక వైపున కార్మికుని వేతనాన్ని , ఉత్పత్తి చేస్తుంది, పునరుత్పత్తి చేస్తుంది.’
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 34వ భాగం, 33వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
