ప్రస్తుతం తమిళ నాడు శాసన సభలో టివికే బలం 107. ప్రభుత్వానికి లోపల లేదా బయట నుంచి వివిధ పార్టీలకు చెందిన 13 మంది సభ్యుల మద్దత్తుతో ఆ ప్రభుత్వం కోన సాగుతున్నది..
న్యూఢిల్లీ:తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కగజం (డిఎంకే) కూటమి మాజి భాగస్వామ్య పక్షాలన్నిటిని కలుపుకొని ” కొత్త సెక్యూలర్” కూటమి ఏర్పాటుకు అధికార తమిళగ వెట్రి కళగం(టివికే) పిలుపునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి టివికే అధినేత విజయ్ ఈ కూటమి భాగస్వామ్య పక్షాల నాయకుల సమావేశాన్ని జులై 1న నగరంలో ఏర్పాటు చేసినట్లు, డక్కెన్ హెరాల్ఢ్ కథనం తెలియచేసింది.
కాంగ్రేస్, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), భారత కమ్యూనిస్టు పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్, విథుతలై చిరుతైగల్ కట్చి(విసికే), మారుమలార్చి ద్రావిడ మున్నేట్ర కగజం (ఎండిఎంకే) పార్టీలను సమావేశానికి ఆహ్వానించారు. డిఎంకే నేతృత్వంలో ఉన్న లౌకిక ప్రగతిశీల కూటమిలో ఈ పార్టీలన్ని భాగస్వాముల కావడం విశేషం.
డిఎంకే గుర్తు పై గెలిచిన కారణంగా రాజినామా చేయడానికి తిరస్కరించిన ఇద్దరు ఎండిఎంకే శాసనసభ్యులు మినహ ప్రస్తుతం మిగితా పార్టీలన్నీ ఇప్పటికే టివికే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో భాగమయ్యాయని, డిహెచ్ కథనం పేర్కొంది.
” ఈ సమావేశం చాలా కాలంగా పెండింగ్లో ఉంది. కీలక మైన కాలంలో టివికేకు మద్దతున్నిచ్చిన పార్టీల నాయకులకు కృతజ్ఙతలు తెలియజేయడానికే ఈ సమావేశం ప్రాధమిక ఉద్దేశ్యం అని,” ఒక వర్గం ఈ వార్తా పత్రికకు చెప్పారు. సీనియర్ టివికే నాయకులు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున్ ఈ రాజకీయ పార్టీల నాయకులను వ్యక్తిగతంగా కలుసుకొని సమావేశానికి ఆహ్వానించారు. శాసనసభ్యులుగా రాజీనామ చేసిన తర్వాత అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేత్ర కాగజం నాయకులను పార్టీలోకి టిఎంకే ఆహ్వానిస్తున్న తరుణంలో ఈ సమావేశం జరుగుతుంది.
234 మంది సభ్యులు గల తమిళనాడు శాసనసభలో సొంతంగా మెజారిటీని సాధించుకోవడానికి ” బేర సారాలకు’‘ పాల్పడు తుందన్న ఆరోపణలతొ టివికే విమర్శలను ఎదుర్కుంటుంది. ప్రస్తుతం టివికే వ్యక్తిగత బలం 107. వివిధ పార్టీలకు చెందిన 13 మంది సభ్యులు ప్రభుత్వానికి లోపల లేదా బయట నుంచి ఇస్తున్న మద్దతుతో ఆ ప్రభుత్వం కోన సాగుతున్నది.
కాగా కాంగ్రేస్,విసికే, ఐయుఎంఎల్, ఎండిఎంకేలు తక్షణమే ఈ కూటమిలో చేరడానికి ఎలాంటి సమస్యలు ఉండక పోవచ్చు. ఈ పరిణామాలపై వామపక్ష పార్టీలు ఏ విధంగా స్పంధిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
అనువాదం; గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
