తెలంగాణలో 20% ఉర్ధూ భాష మాట్లాడే ప్రజల కోసం ఉర్దూలో “సర్” ఫారాలను సరఫరా చేసే విషయం పరిశీలించాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. గణన ఫారాలను బహు భాషల్లో ముద్రించడం ఏమైనా కష్టమైన పనా, అని కూడా ఎన్నికల సంఘాన్ని కోర్టు ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సర్ కింద 20% కి మించి ఉర్దూ భాష మాట్లాడే ప్రజలు ఉన్న నియోజిక వర్గాలలో ఉర్దూ భాషలో గణన ఫారాలను సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు సూచించింది. గణన ఫారాలను బహు భాషల్లో ముద్రించడం ఏమైన కష్టమైన పనా,అని కూడా ఈసిని మౌఖికంగా వ్యాఖ్యానిస్తూ కోర్టు ప్రశ్నించింది.
డెక్కన్ క్రానికల్ కధనం ప్రకారం హైదరాబాద్ జిల్లా బయట అన్ని ఫారాలను ఎన్నికల సంఘం ముద్రిస్తుందని ఈసి కౌన్సల్ అవినాశ్ దేశాయి కోర్టుకు తెలియజేశారు. తెలుగు చదవలేని ఓటర్ల కోసం బూత్ స్థాయి అధికారుల వద్ద డమ్మీ ఇంగ్లీష్, ఉర్దూ గణన ఫారాలను ఉంచామని కూడా కోర్టు దృష్టికి దేశాయి తీసుకెళ్లారు.
గణన ఫారాలను బహు భాషల్లో ముద్రించడం కష్టమైన పని అని దేశాయి అన్నారు. దానిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి స్పంధిస్తూ సిమ్ కార్డు ప్యాకేజిలు, ఫోన్ వినియోగదారుల మ్యానువల్స్, ఉత్పత్తుల వివరాలను తెలియచేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం ” అపారమైన ప్రజాస్వామ్య ప్రముఖ్యత” గల ప్రక్రీయను చేపట్టినప్పుడు బహు భాషల్లో ఫారాలను ఎందుకు సరఫరా చేయలేక పోతుందని న్యాయస్థానం ప్రశ్నించినట్లు క్రానికల్ కథనం తెలియజేసింది.
హైదరాబాద్ జిల్లాలో బిఎల్ఒలు వారి వెంట ఉన్న వారికి ఇంగ్లీష్, ఉర్దూలో డమ్మీ ఫారాలు ఇవ్వాలని ఈసి నిర్ణయించిన నేపధ్యంలో చివరికి 20 %కి మించి ఉర్దూ మాట్లాడే ప్రజలు ఉన్న నియోజికవర్గాలలో ఉర్దూ భాషలో గణన ఫారాలను ముద్రించడాన్ని పరిశీలించాలని మాత్రం సంఘాన్ని కోరగలనని, న్యాయమూర్తి చెప్పారు. ఈ అంశం పై తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేశారు.
గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సామాజిక- ఆర్ధిక అలాగే కుల సర్వే నియోజికవర్గ-స్థాయి డాటా ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 20%కి మించి ఉర్దూ మాతృభాష మాట్లాడే జనాభా ఉన్నారు, మరెక్కడ కూడా ఈ 20%కి మించి లేరు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ శాతంలో 18%తో నిజామాబాద్ జిల్లా ఉన్నట్లు ఆ డేటా సూచిస్తున్నది.
తెలంగాణలో తెలుగులోనే గణన ఫారాలను ఈసి పంపిణి చేయడాన్ని సవాల్ చేస్తూ ఎం.ఏ ముజిబ్ అనే వ్యక్తి హైకోర్ట్ లో పిటీషన్‌ను దాఖలు చేశారు. భాషా పరమైన మైనారిటీలను ఓటర్ల జాబితా నుంచి మినహాయించ డానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పిటీషనర్ ఆరోపించారు.
రాజకీయ పార్టీలు ఈసిని కలిసి హైదరాబాద్ నగర విశ్వజనీనమైన స్వభావం పై తీవ్ర ఆవేదనను వ్యక్త పర్చిన తర్వాత హైదరాబాద్ జిల్లాలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో గణన ఫారాలను సరఫరా చేయాలని ఈసి అంగీకరించింది. ఇక్కడ 2011 జనగణ లెక్కల ప్రకారం 43% జనాభా వారి మాతృభాష ఉర్దూలోనే మాట్లాడుతారు. అయితే మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల కింద ఉన్న ఎక్కువ నగర భాగాలకు ఈ మినహయింపు వర్తించదు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
