కొత్త చట్టం కింద ఈ పథకాన్ని ప్రకటించని రాష్ట్రాలు 100 రోజులకు బదులుగా 125 రోజుల పనితో పాటు బిల్లులోంచి 40% భరించే విధంగా మూడు సవరణలు చేస్తూ పాత చట్టాన్ని కొనసాగించ వచ్చు.
న్యూ ఢిల్లీ; కొత్త వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ ఆజీవిక మిషన్(గ్రామీన్)(విబి-జి రామ్జి) చట్టం కింద గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని ప్రకటించని రాష్ట్రాలు కొన్ని సవరణలతో పాత మహత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టం,2005,(ఎంజిఎన్ఆర్ఈజిఏ) నికోనసాగించవచ్చు. ఈ తాత్కాలిక ఏర్పాటు కేవలం ఆరు మాసాల వరకే వర్తిస్తుంది. విబి-జి రామ్ జి చట్టంలోని 3వ నింబంధన కింద ఈ చట్టాన్ని ప్రకటించని రాష్ట్రాల కోసం విబి-జి రామ్ జి చట్టంలోని 36 నిబంధన కింద కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారి చేసింది.
కొత్త చట్టం కింద ఈ పథకాన్ని ప్రకటించని(నోటిఫైడ్) చేయని రాష్ట్రాలు మూడు సవరణలతో 1) 100కు బదులుగా 125 రోజుల పని, 2) నిధుల వాటాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 60: 40 నిష్పత్తి , 3) ఈ పథకం కింద చేపట్టిన పనులు కొత్త చట్టం విబి-జి రామ్ జి లోని సెక్షన్ 1లోని షెడ్యూల్ 1లో పొందుపరచిన ముఖ్య ఉద్దేశాలకు ఖచ్చితంగా లోబడి ఉండాలి.
ఈ తాత్కాలిక ఏర్పాటు కేవలం ఆరు మాసాల వరకే వర్తిస్తుంది, విబి-జి రామ్జి పథకాన్ని ప్రకటించే సమయం వరకు, రాష్ట్రాలు గత పథకంలో కొన్ని సవరణలు చేసి అమలు చేయవచ్చు. అంతరాయం లేకుండా ప్రజలకు ఉపాధి లభించే విధంగా చూసేందుకు ఇలా చేశారు.
మహత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టం స్థానంలో కొత్తగా తీసుకు వచ్చిన వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ (గ్రామీణ్) లేదా విబి-జి రామ్ జి కింద తమ పై ఆర్ధిక బారం పెరగడం గురించి కనీసం మూడు రాష్ట్రాలు, అందులోంచి రెండు భారతీయ జనతా పార్ఠీ పాలిత (బిజేపి- పాలిత) రాష్ట్రాలు తీవ్ర ఆంధోళనను లేవనెత్తినట్లు, ది హిందు కథనం తెలియచేసింది. కొత్త పథకం జులై 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది.
విబి-జి రామ్ జి కింద అనేక రాష్ట్రాలు మొత్తం ఖర్చులోంచి 40% ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఇది (ఎంజిఎన్ఆర్ఈజిఏ) లో గణనీయమైన మార్పు. అక్కడ వేతనాల బిల్లులను 100% కేంద్ర ప్రభుత్వమే భరించగా, రాష్ట్రాలు మాత్రం మొత్తం బడ్జెట్లోంచి పనిముట్ల ఖర్చు సుమారు 10% మాత్రమే భరించేవి. కొత్త చట్టాన్ని ఇంకా ప్రకటించని రాష్ట్రాలు తాత్కాలిక కాలంలో ఎంజిఎన్ఆర్ఈజిఏను కొనసాగించాలంటే 40% వాటా ఖర్చును భరించడానికి అంగీకరించాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారి వేతనాన్ని రూ.300 నుంచి రూ. 409 మధ్య ఉండెలా కేంద్రం నిర్ణయించింది. అయితే సిక్కిమ్ లోని మూడు గ్రామ పంచాయితీలు, గుణతంగ్, లచుంగ్,లాచెన్లకు ప్రత్యేక రేటు రూ.450గా నిర్ణయించినట్లు కేంద్ర గ్రామీణాభి వృద్ది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారి చేసింది. మెజారిటీ రాష్ట్రాలకు రూ.300లే వేతన రేటు ఉంటుంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
