జనగణన 2027కి ముందు ఎన్ఆర్సీని డిమాండ్ చేస్తూ జస్ట్ అండ్ ఫెయిర్ డిలిమిటేషన్ క్యాంపెయిన్ చేస్తున్న ప్రచారం దృష్ట్యా, ప్రస్తుతం నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి నేపథ్యంలో విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
న్యూఢిల్లీ: మణిపూర్‌లో పౌర సమాజం, ప్రజా ఉద్యమం చేస్తున్న సరిహద్దుల పునఃరూపకల్పన(క్యాంపెయిన్ ఫర్ జస్ట్ అండ్ ఫెయిర్ డిలిమిటేషన్ – జేఎఫ్‌డీ) ప్రచారంలో భాగంగా కొనసాగిస్తున్న 48 గంటల సుదీర్ఘ మూసివేత కారణంగా “ప్రస్తుతం నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితుల” దృష్ట్యా ఆగస్టు 20 నుంచి 23వ తేదీ వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ఆగస్టు 19న ప్రభుత్వం ప్రకటించింది.
పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, కళాశాలలు, రాష్ట్ర విద్యా బోర్డుల అనుబంధ సంస్థలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
జనగణనపై ప్రభావం..
జాతీయ పౌరుల నమోదు(ఎన్ఆర్సీ)ని అమలు చేసిన తర్వాతనే జనగణనను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జేఎఫ్‌డీ మూసివేతను పాటించడంతో జనగణన 2027 కోసం కొనసాగిస్తున్న ఏర్పాట్లలో అవరోధాలు కలుగుతున్నాయి.
జనగణనతో సంబంధం ఉన్న నియామకాలు, సూపర్వైజర్లు, క్షేత్రస్థాయి శిక్షకులు, ఇంటింటికి వెళ్లే వారిపై ప్రభావం పడుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలియజేసింది.
ఈ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది శిక్షణా కార్యక్రమాలకు రాష్ట్రంలో గతంలో జరిగిన నిరసనలు కూడా అవరోధాలను సృష్టించాయి.
బిష్ణుపూర్ జిల్లాలో జనగణన శిక్షణా కార్యక్రమానికి నిరసనకారులు ఆగస్టు 14న అంతరాయం కలిగించినట్లు పీటీఐ కథనం పేర్కొంది.
అక్రమ వలసలపై ఆందోళన..
పత్రాలు లేని వలసలు, జనాభాలో మార్పుల గురించి ఆరోపణల పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్న కారణంగా ఎన్ఆర్సీ ప్రక్రియతో జనగణనకు జేఎఫ్‌డీ ముడిపెట్టింది.
రాష్ట్రంలో విశాలమైన సామాజిక రాజకీయ వివాదంలో భాగంగా ఈ ఆందోళనలకు ప్రాముఖ్యత ఏర్పడింది.
కుకీ సంఘాల వ్యతిరేకత..
తమ వర్గం వారిని “పత్రాలు లేని వలసవాదులుగా” చిత్రీకరించడాన్ని కుకీ సంఘాలు తిరస్కరిస్తూ జేఎఫ్‌డీ డిమాండ్‌ను వ్యతిరేకించాయి.
కాబట్టి మణిపూర్‌లో గడచిన మూడు సంవత్సరాలుగా గిరిజన వర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ఉద్రిక్తతలతో సంక్లిష్టంగా ఈ మూసివేతకు సంబంధం ఉంది.
నాలుగు రోజుల పాటు విద్యా సంస్థల మూసివేత..
తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటున్న కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఈ చర్యకు పాల్పడుతూ వివిధ యాజమాన్యాల కేటగిరీలు విద్యా బోర్డుల కింద ఉన్న కళాశాలలు, పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది.
ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనతో తాత్కాలిక మూసివేత ఆదేశాలు విద్యా సంవత్సరం షెడ్యూళ్లపై, రోజువారీగా జరిగే తరగతులపై విస్తృత ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి.
జనగణన 2027తో ముడిపడి ఉన్న పరిపాలనాపరమైన ఏర్పాట్లపై ప్రభావాన్ని చూపేలా ఈ నిరసనలు దాటిపోయాయి.
విద్యా సంస్థలను తిరిగి తెరిచే విషయంలో తదుపరి చర్యలు తీసుకునే ముందు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
