అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఇరాన్ యుద్ధానికి అయిన ఖర్చును 37.5 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
2026 ఫిబ్రవరి 28 నుంచి జరిగిన యుద్ధంలో అమెరికాకు అయిన యుద్ధ ఖర్చు.
ఇది గతంలో రక్షణ శాఖ తెలిపిన గణాంకాల కంటే దాదాపు 9 బిలియన్ డాలర్లు ఎక్కువ.
సెనెట్ కమిటీకి వివరాల వెల్లడి..
జూలై 21న జరిగిన సెనెట్ అప్రోప్రియేషన్స్ కమిటీ విచారణలో హెగ్సెత్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు అయిన కొన్ని వ్యయాలతో పాటు, సెప్టెంబర్ ప్రారంభం వరకు కాగల ఇతర అంచనా వ్యయాలను కూడా ఈ లెక్కలో చేర్చినట్లు తెలిపారు.
ఈ మొత్తంలో సైనిక నిర్వహణ, రక్షణ వ్యయాలతో పాటు సైనిక వేతనాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
యుద్ధ వ్యయం, దాని వ్యూహానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించాల్సిందిగా గడిచిన కొన్ని నెలలుగా రిపబ్లికన్, డెమొక్రాటిక్ ఉభయ పక్షాల చట్టసభ సభ్యులు హెగ్సెత్ను కోరుతున్నారు.
తీవ్రమైన పోరాటం – సైనికుల ప్రాణనష్టం..
ఇటీవలి రోజుల్లో అమెరికా, ఇరాన్ మధ్య పోరాటం మరింత తీవ్రమైంది. ఇరాన్ దాడుల కారణంగా ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు జోర్డాన్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో (సైనికులు నివసించే ప్రీఫ్యాబ్రికేటెడ్ నివాసాలపై దాడి జరగడంతో) మరణించగా, మరొక సైనికుడు ఇరాక్‌లో కూల్చివేసిన ఇరాన్ దాడి డ్రోన్‌ను సురక్షితంగా పేల్చివేస్తున్న సమయంలో మరణించాడు.
గత అంచనాలకు కట్టుబడి ఉన్న పెంటగాన్ అధికారి..
గత వారం, పెంటగాన్ కాంప్ట్రోలర్ నామినీ జూల్స్ హర్స్ట్, మే నెలలో తాను తెలిపిన 29 బిలియన్ డాలర్ల యుద్ధ ఖర్చు అంచనాకే కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ అంచనాలో అమెరికా సైనిక స్థావరాలు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాలను చేర్చలేదని ఆయన పేర్కొన్నారు.
(న్యూయార్క్ టైమ్స్ పత్రికలో యోకో కుబోటా, లారా సెలిగ్మాన్ల కథనానికి తెలుగు అనువాదం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
