పునఃస్చరణ– సింహావలోకనం..
గత అధ్యాయంలో సాపేక్ష అదనపు విలువ(ఆర్ఎస్వీ) అనే భావనను, పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో ఉత్పన్నమవుతున్న సాపేక్ష అదనపు విలువ(ఆర్ఎస్వీ) అవసరాన్ని పెట్టుబడిదారుల మధ్య ఉన్న తీవ్రమైన పోటీ, పోరాటం, కార్మికవర్గ పోరాటం వలన పనిదిన నిడివిపై విధించబడిన పరిమితులు రెండింటి వలన ఉత్పన్నమవుతున్న సాపేక్ష అదనపు విలువ(ఆర్ఎస్వీ) అవసరాన్ని తెలుసుకున్నాము.
సాపేక్ష అదనపు విలువ(ఆర్ఎస్వీ) ప్రధాన ఉత్పత్తి సాధనాలను; సాధారణ సహకారం, పని విభజన, తయారీ, యంత్రాలు, ఆధునిక పరిశ్రమలను పరిశీలించాము. కొన్ని అర్హతలు అవసరం. సంపూర్ణ, సాపేక్ష అదనపు విలువలను విశ్లేషణాత్మకంగా వరుసగా మనం పరిశీలిస్తూనే, కఠినమైన కాలక్రమానుసారాన్ని సూచించడాన్ని మనం ఇక్కడ ఉద్దేశించలేదు. మొదటి ఆధునిక పెట్టుబడిదారీ దేశం బ్రిటన్ విషయంలో ఈ క్రమం తార్కిక, చారిత్రక ప్రామాణికతను ఖచ్చితంగా కలిగి ఉంది. కానీ పెట్టుబడిదారీ శక్తులు అంతర్జాతీయంగా మారిన వెంటనే సంపూర్ణ అదనపు విలువ ఆధిపత్యం నుంచి సాపేక్ష అదనపు విలువకు(ఆర్ఎస్వీ) స్వయం చాలక పరివర్తన అవసరం లేదు.
సామ్రాజ్యవాద శకంలో, ఆధిపత్యానికి గురైన దేశంలో పెట్టుబడిదారీ అభివృద్ధి లక్షణంతో సన్నిహితంగా ఈ అంశం ముడిపడి ఉంది. సాపేక్ష అదనపు విలువ(ఆర్ఎస్వీ) ఉత్పత్తి ద్వారా అయినా కాకపోయినా అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటి మాదిరిగానే, పెట్టుబడిదారీ శక్తులు ఆధిపత్యానికి గురైన దేశంలో ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేస్తాయి.
అదే విధంగా సాపేక్ష అదనపు విలువ(ఆర్ఎస్వీ) ఉత్పత్తి సాధనాల వర్గీకరణలో మార్క్స్ అనుసరించేటప్పుడు, చేతితో ఉత్పత్తి చేసే పద్ధతి నుంచి ఆధునిక ఉత్పత్తి పద్ధతులకు మారడంలో మేము కఠినమైన కాలక్రమాన్ని సూచించాలని కూడా అనుకోవడం లేదు. మార్క్స్ స్వయంగా తనే కలగూరగంప పరివర్తన రూపాలను గుర్తించాడు. కానీ బ్రిటన్ విషయంలో సరైన కర్మాగార వ్యవస్థలోకి మారడాన్ని ఈ ధోరణి దాచిపెట్టదని ఎత్తి చూపాడు.
చమురు– పెట్రో కెమికల్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్సు– యంత్రాల వాడకం(ఆటో మేషన్) వగైరాలను గురించి మాట్లాడడాన్ని అట్లా ఉంచి, విద్యుత్, జల– అణు శక్తుల వినియోగంతో సహా శాస్త్ర సాంకేతిక రంగాలలో అపారమైన పురోగతి ఉంది. కానీ మార్క్స్ లేవనెత్తిన ప్రాథమిక అంశాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
అదనపు విలువ(సాపేక్ష, సంపూర్ణ అదనపు విలువ) కొరకు మూలధన దాహం; యంత్రాలు, సాంకేతిక ప్రగతి వినియోగం శ్రమించే కార్మికుల కష్టాన్ని తగ్గించడానికి కాదు. కానీ, శ్రమను తీవ్రతరం చేస్తుంది(మెక్సికో, తైవాన్, దక్షిణ కొరియా వంటి మూడవ ప్రపంచ దేశాలలో బహుళజాతి సంస్థలు స్థాపించిన రన్ అవే ఎలక్ట్రానిక్ ప్లాంట్లు, స్వెట్ షాప్స్ ద్వారా); అమెరికా నాయకత్వంలో భద్రతా చర్యల క్రమబద్ధమైన నిర్లక్ష్యం, కార్మికుల ప్రాణాలు, గాయాల పరంగా ప్రపంచమంతటా ప్రతి సంవత్సరం జరుగుతున్న భారీ ప్రమాదాలు, పర్యావరణ విధ్వంసం, టోకుగా ప్రపంచ దోపిడీ అంతా మార్క్స్ అద్భుతంగా ఊహించిన ప్రక్రియయే.
అదే సమయంలో అసమానంగానే అయినప్పటికీ, సాధారణ విద్య వ్యాప్తి, మరలా అసమానంగానే అయినప్పటికీ భౌతిక, సాంస్కృతిక జీవన ప్రమాణాల పురోగతి; మరీ ముఖ్యమైనది. మానవునికీ ప్రకృతికీ మధ్య సామరస్యపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించే, మార్క్స్ వ్రాసిన మానవాభివృద్ధికి భరోసా ఇచ్చే సామర్ధ్యం గల శక్తివంతమైన కార్మికవర్గ, సోషలిస్టు ఉద్యమాల అభివృద్ధి జరిగింది.
మార్క్స్ విశ్లేషణ నుంచి కనుగొనబడిన సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి ప్రత్యేక గతితర్కానికి అర్ధం దానంతట అదిగా దృష్టికి కనపడేది కానీ, లేదా విశ్వవ్యాపితంగా చెల్లుబాటు అయ్యే పథకం కానీ కాదని ప్రత్యేకంగా నొక్కి చెప్పవలసిన పనిలేదు. దీనికి భిన్నంగా, కార్మిక ఉత్పాదకత అభివృద్ధి ప్రత్యేకమైన పద్దతులు, శాస్త్ర సాంకేతిక పురోగమనం నిర్దిష్ట తరుణంతో అంటే, ఒక నిర్దిష్ట చారిత్రక స్థితిలో వర్గపోరాటం గతి తార్కిక స్థితి, అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థతో సామాజిక నిర్మాణ సంబంధం వగైరాలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయో మన చర్చలు చూపాయి.
వివరణలు– సూచనలు..
1 కారల్ మార్క్స్ , పెట్టుబడి , సంపుటి 1, ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1967, పేజీ 374( K. Marx, Capital, Vol. I, International Publishers, 1967, p. 374. )
2 Ibid., p. 378.
3 Ibid., p. 382.
4 Ibid., p. 384.
5 Ibid., p. 385.
6 Ibid., p. 390.
7 Ibid., p. 392.
8 Ibid.
9 Ibid., p. 407.
10 Ibid., p. 417.
11 Ibid., p. 423.
12 అధికార సంబంధాలు, పదవీ క్రమం, పెట్టుబడిదారీ కర్మాగారంలో ప్రబలంగా ఉన్న ఆధిపత్యం పెట్టుబడిదారీ కపటత్వం కళ్ళకు కట్టినట్లు కనుపించే ప్రత్యేక ఉదాహరణ. మార్క్స్‌ను ఉదహరిస్తే: To quote Marx: ‘పని చేసే కార్మికులపై, మూలధనం సూత్రీకరించే నియంతృత్వం ఇతర విషయాలలో పెట్టుబడిదారులు ఆమోదించిన భాద్యత విభజన వెంబడించిరాని, మరి ఇంకా ఆమోదించిన ప్రతినిధి వ్యవస్థను వెంబడించరాని, చాలా పెద్ద స్థాయిలో సహకారంతో అవసరమైన శ్రమ ప్రక్రియలో, సాధారణ ఉపాధిలో, శ్రమ సాధనాలలో ప్రత్యేకించి యంత్రాల నియంత్రణ పెట్టుబడిదారీ వ్యంగ్య చిత్రం ఈ కర్మాగార నియమం.’ ‘Ibid., p. 424.
13 Ibid., p. 432.
14 Ibid., p. 440.
15 Ibid., p. 445.
16 Ibid., pp. 450–51.
17 Ibid., p. 451.
18 బ్రిటిష్ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రత్యేక సందర్భంలో పెట్టుబడిదారుల మధ్య తీవ్ర పోటీలో వలస, ఇతర బాహ్య మార్కెట్ల అభివృద్ధిలో కర్మాగార చట్టం(కార్మికవర్గం దేనికోసమైతే పోరాడిందో) ఇతర కారకాలు, యంత్రాలతో జరిగే ఉత్పత్తితో తమ ఘర్షణలో తయారీ రంగం, చేతి వృత్తులు, (దేశీయ) గృహ పరిశ్రమ అని పిలవబడేవి క్షీణించాయని మార్క్స్ నిరూపించాడు.
19 Marx, Capital, Vol. I, p. 380.
20 Ibid., p. 441.
21 Ibid., p. 462.
22 Ibid., p. 486.
23 Ibid., p. 488.
24 Ibid.
25 Ibid., pp. 488–90, వక్కాణింపులు చేర్చబడ్డాయి. (emphasis added.)
26 Ibid., p. 505.
27 Ibid., p. 507.
28 Ibid., p. 506.
29 Ibid., p. 473.
30 ‘ఉదాహరణకు అమెరికా లాగా ఆధునిక పారిశ్రామిక పునాదిపై అభివృద్ధికి ఒక దేశం ఎంతగా ప్రయత్నిస్తుందో అంతే వేగంగా విధ్వంసక ప్రక్రియ కూడా ఉంటుంది.’ Ibid., p. 506.
31 ఇక్కడ ఎత్తి చూపిన విషయం ఉత్పత్తి విధానం, సామాజిక నిర్మాణాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రముఖంగా చూపుతుంది. ఉత్పత్తి విధాన స్థాయిలో ఎవరైనా సైద్ధాంతికంగా దాని ప్రత్యేక ధోరణులను(ఉదాహరణకు పనివిభజన సంబంధంలో) పేర్కొనవచ్చు. కానీ చారిత్రకంగా చూసినప్పుడు, ఈ ధోరణులూ వాటి వ్యతిరేక ధోరణులూ నిర్దిష్ట సామాజిక నిర్మాణం లోపలనే జరుగుతాయి. అందువల్ల సమయం నిర్ణయించే అంశాలలో ఒకటిగా ప్రవేశిస్తుంది. మార్క్స్ కాలం నుంచి పెట్టుబడిదారీ పని విభజనలోని పరిణామాలను విశ్లేషించడానికి H.బ్రేవర్మన్ శ్రమ– గుత్త పెట్టుబడి, మంత్లీ రివ్యూ ప్రెస్ 1974 చూడండి. (H. Braverman, Labour and Monopoly Capital, Monthly Review Press, 1974.)
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 29వ భాగం, 28వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
