మళ్ళీ బాంబింగ్ ప్రారంభించడం లేదా, ఈ సంఘర్షణ నుంచి వెనక్కి తగ్గడం కంటే, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్బంధాన్ని కొనసాగించడం తక్కువ ప్రమాదమని ట్రంప్ తన సహచరులతో తెలిపారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా, ప్రధానంగా దాని చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఇరాన్‌పై దీర్ఘకాలిక నిర్బంధానికి సిద్ధం చేయాలని, తద్వారా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేసేలా ఒత్తిడి చేయడం ట్రంప్ చేసే ప్రాథమిక చర్యగా భావిస్తున్నట్టు అమెరికా అధికారులు తెలిపారు.
అయితే ఈ విధానం యుద్ధాన్ని మరింత పొడిగించవచ్చు, ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది అమెరికా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రభావం చూపవచ్చు.
ఒత్తిడి కొనసాగింపు-డిమాండ్లు..
ఏప్రిల్ 7న జరిగిన కాబూల్ విరమణ తర్వాత ప్రధానంగా బాంబింగ్ ఆగిపోయినప్పటికీ ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగించాలని, యుద్ధం మళ్ళీ ప్రారంభించడం లేదని, పూర్తిగా మధ్య నుంచి వైదొలగడం కన్నా, ఒత్తిడి కొనసాగించడం ద్వారా ఇరాన్‌తో తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయించడం తన ప్రధాన డిమాండ్ అని ఇటీవల జరిగిన సమావేశాల్లో ట్రంప్ అభిప్రాయపడ్డారు.
సముద్ర మార్గాలను తిరిగి తెరవడానికి, అణు చర్చలను తిరిగి ప్రారంభించడానికి 3 దశల ప్రణాళికను ప్రతిపాదించారు. అయినప్పటికీ ఇరాన్ నిజాయితీగా చర్చలకు రావడం లేదని ట్రంప్ సోమవారం తన సహచరులకు తెలిపారు.
ఆర్థిక ప్రభావం- శాంతి ఒప్పంద ప్రయత్నాలు..
నిర్బంధం దీర్ఘకాలంగా కొనసాగించడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని ట్రంప్ అభిప్రాయం. అయితే ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపవచ్చు, ముఖ్యంగా చమురు సరఫరాలో అంతరాయం వల్ల ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది.
అమెరికా ప్రభుత్వం ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం ప్రయత్నిస్తోందని, ఈ ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమాలపై కఠిన నిబంధనలు ఉండాలని, కనీసం 20 సంవత్సరాల పాటు అణు కార్యక్రమాలు నిలిపివేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల్లో భిన్నాభిప్రాయాలు- నిలిచిపోయిన చర్చలు..
ట్రంప్ తదుపరి చర్యలపై కొంతమంది అమెరికా అధికారులు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు. కొంతమంది ఇరాన్‌పై ఒత్తిడి పెంచాలని కోరుతుండగా, మరికొందరు ఈ పరిస్థితి అమెరికా ఆర్థిక వ్యవస్థకు హానికరమని, యుద్ధం కూడా ముగియకపోవచ్చని, అలాగే అణు ఒప్పందం కూడా కుదరకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ కూడా ఈ నిర్బంధాన్ని తట్టుకొనే సామర్థ్యం తనకు ఉందని భావిస్తోంది. ఈ పరిస్థితి మరింత పెద్ద సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా-ఇరాన్ చర్చలు పారిస్‌లో తిరిగి ప్రారంభమవుతాయని ఆశించినప్పటికీ అవి నిలిచిపోయాయి. ఇరాన్ అధికారులు తమ నాయకుడు అలీ ఖమేనీతో సంప్రదించిన తర్వాత కొత్త ప్రతిపాదనలు ఇస్తామని తెలిపారు.
మధ్యవర్తులు ఇరాన్ తాజా ప్రతిపాదనల ద్వారా పరిష్కారం దొరకదని అనుమానిస్తున్నారు. అమెరికా తన కఠిన డిమాండ్లను తగ్గించకపోతే చర్చలు ముందుకు సాగడం కష్టమని వారు అంటున్నారు.
అనువాదం: డి వెంకన్న
న్యూయర్క్ టైమ్స్ సౌజన్యంతో..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
