పాశ్చాత్య దేశాల రాజకీయ సంక్షోభాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పవచ్చు. అదే అపనమ్మకం. ఓటర్లలో ప్రతికూల భావన, ముందస్తు గ్రహింపులు, కోపం కనిపిస్తు న్నాయి. ఇవన్నీ కూడా నమ్మకాన్ని కోల్పోవడం వల్ల వచ్చిన పరిణామాలే. ప్రపంచంలో అమెరికా పట్ల క్షీణిస్తున్న నమ్మకం గురించి తక్కువ ఆందోళన చెందు తున్నారు. ప్యూ పరిశోధనా సంస్థ సర్వే చేసిన అత్యధిక దేశాలలో అమెరికా కంటే చైనా పైనే ఎక్కువ నమ్మకం ఉందనే విషయం రుజువు అయింది. అయినప్పటికీ, అమెరికా తనని తానే ప్రపంచంలోనే అత్యంత ప్రశంసనీయమైన ప్రాంతంగా భావిస్తూ వ్యవహరిస్తోంది.
ఈ క్షీణత అంతా డోనాల్డ్ ట్రంప్ వల్ల మాత్రమే జరగలేదు. అమెరికా క్రిందికి పడిపోవడమే కాకుండా చైనా పైకి ఎదుగుతూ వచ్చింది. అమెరికా యొక్క ఇటీవలి ప్రతిష్టాత్మక పతనం 2023లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభమైంది. అక్టోబర్ 7న హమాస్ జరిపిన మారణహోమానికి ఇజ్రాయిల్ ఇచ్చిన వినాశకరమైన స్పందనకు ఆయన మద్దతు ఇవ్వడం దీనికి తోడైంది. ఇజ్రాయిల్ మిలిటరిజం యొక్క ప్రభావం ప్రపంచం దృష్టిలో (మిగిలిన పాశ్చాత్య ప్రపంచంతో సహా) అమెరికా ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అమెరికా విదేశాంగ విధాన నిర్వాహకులు పట్టించుకోరు. కానీ అమెరికాకున్న అనాదరణకు ఇజ్రాయిల్ మాత్రమే ప్రధాన కారణం కాదు.
సుఖవంతమైన జీవితం గడిపే వారి సౌకర్యవంతమైన అభిప్రాయం ప్రకారం ప్రపంచం ట్రంప్ విలువలను అసహ్యించు కుంటుంది. మరింత ప్రశంసనీయమైన అధ్యక్షుడు ఎన్నికై నప్పుడు అమెరికా హోదా పెరుగు తుందని ఇది సూచిస్తుంది. కానీ ఈ సముదాయించే ఆలోచన ఒక పెద్ద విషయాన్ని మరచి పోతోంది. ప్రతిదీ విలువల గురించే కాదు. స్వేచ్ఛ విషయానికి వస్తే అత్యధిక దేశాలు చైనా కంటే అమెరికాకే ఎక్కువ ర్యాంక్ ఇస్తాయి. అయినప్పటికీ దానిని నమ్మవు. కాబట్టి ఇక్కడ అపనమ్మకం అనేది చేతకాని తనానికి (అసమర్థతకు) పర్యాయ. పదంగా మారింది.
ట్రంప్ కాలంలో కూడా, చైనాలోని ప్రజల కంటే తమ అభిప్రాయాలను వ్యక్తీకరించ డానికి, తమ మతాన్ని ఆచరించడానికి ప్రజలు చాలా స్వేచ్ఛగా ఉన్నారని ప్రపంచానికి తెలుసు. అయితే చైనా కంటే అమెరికన్లు మరింత సమర్థవంతంగా పరిపాలించ బడుతున్నారా? చైనా కంటే అమెరికా స్థిరంగా ఉందా? రెండింటికీ ‘అవును’ అని చెప్పడం కష్టం. ట్రంప్ యొక్క ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) ని పరిశీలిస్తే — పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి (ఇరాక్ మరియు వియత్నాంల కంటే తక్కువ నష్టాలు జరిగినప్పటికీ) స్వదేశంలో అత్యంత ఆదరణ లేని యుద్ధం ఇది. ఇది అమెరికా మిత్ర దేశాలను, భాగస్వాములను, ఇతర పాశ్చాత్య ప్రసిద్ధ నాయకులతో సహా దూరం చేసింది. ఇప్పటివరకు అమెరికా ఎంచుకున్న అత్యంత నిర్లక్ష్యపు యుద్ధంలో చేర నందుకు వారిని ఇప్పుడు అవమా నిస్తున్నారు.
మూడో గల్ఫ్ యుద్ధం చైనా, అమెరికాల మధ్య శక్తి సంక్షోభం లో ఉన్న వ్యత్యాసాన్ని కూడా బయటపెట్టింది. పునరుత్పాదక శక్తి నుండి బొగ్గు వరకు అన్ని రూపాల శక్తిలో చైనా పెడుతున్న పెద్ద పెట్టుబడులు, అమెరికా యొక్క శిలాజ ఇంధనాల వైపు ఉన్న మొగ్గుతో విభేది స్తున్నాయి. ట్రంప్ మళ్లీ రావడం దీనికి కారణం. ఆయన గ్రీన్ ఎనర్జీ కోసం బైడెన్ ఇచ్చిన ప్రోత్సాహ కాలను రద్దు చేయడమే కాకుండా, ప్రత్యామ్నాయ ఇంధన ప్రాజెక్టుల నుండి వైదొలగ డానికి కంపెనీలకు చెల్లింపులు చేస్తున్నారు. చైనా పెద్ద ఎత్తున నిల్వ చేయక పోయి ఉంటే, గడిచిన కొన్ని నెలల్లో ప్రపంచ చమురు ధరలు ఇంకా చాలా పైకి వెళ్లేవి. చైనా 2020 అమెరికా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించే బదులు, అమెరికా వినియోగదారులను పెట్రోల్ గ్యాలన్ $6 చెల్లించకుండా కాపాడి నందుకు ట్రంప్ చైనాకు కృతజ్ఞతలు చెప్పాలి.
‘ఎపిక్ ఫ్యూరీ’ ప్రపంచ వేడి పెరగడానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలతో సమానంగా జరిగింది, ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో. ఇండియా, ఇరాన్ వంటి దేశాలు వేసవి మరణాల భారీ పెరుగుదలకు అలవాటు పడ్డాయి. రికార్డు స్థాయిలో నమోదైన అత్యంత వేడి జూన్ తర్వాత, ఎయిర్ కండిషనింగ్ లేకపోవడం ఎంత బాధా కరమో ఐరోపా ఇప్పుడు అనుభవిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ అనేది సంపన్నుల ఆందోళన నుండి సాధారణ ప్రజల స్పృహలోకి మారుతోంది.
అమెరికా పాత 20వ శతాబ్దపు అలవాట్లను మళ్లీ కొనసాగిస్తూ ఈ విషయంలో చెడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు, చైనా గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) దృష్టిలో పరిష్కారాల ప్రదాతగా కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ యొక్క టెస్లా విషయం లో లాగా అమెరికా సాంకేతికత లో ముందంజలో ఉన్న చోట కూడా, దాని ప్రతిష్ట అత్యంత దారుణంగా ఉంది. మస్క్ యొక్క సైబర్ ట్రక్ లేదా “స్వస్తికార్” ను ప్రదర్శించిన లండన్ నిరసన ప్రకటనను ఎవరు మరచి పోగలరు? దానిపై ఉన్న పదాలు “3 సెకన్లలో 0 నుండి 1939 కి వెళ్తుంది.” నమ్మకం త్వరగా పోతుంది. దాన్ని పునర్నిర్మించ డానికి యుగాలు పడుతుంది. ఇప్పటికీ చైనా కంటే అమెరికాను ఆమోదించే ఆరు దేశాలలో నాలుగు దేశాలు చైనా పొరుగునే ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా, ఇండియా, ఫిలిప్పీన్స్. కానీ అమెరికాను నమ్మని దేశాలు సమీపంలో, దూరంగా ఉన్నాయి. కేవలం సురక్షితం కాని పొరుగు దేశాలైన కెనడా మెక్సికో మాత్రమే కాదు. చైనా యొక్క ఎగుమతి యంత్రం అందరి అవకాశాలను దెబ్బ తీస్తుందనే నిజాన్ని పక్కన పెడితే ఇది పరిస్థితి. మినహాయింపులు పోలాండ్ (ముఖ్యంగా రష్యా పొరుగున ఉండటం వల్ల) ఇజ్రాయిల్. ఆస్ట్రేలియా, యుకే (UK) కూడా అమెరికా కంటే చైనానే ఎక్కువ నమ్ము తున్నాయి.
ట్రంప్ నిష్క్రమణ ఖచ్చితంగా సహాయపడుతుంది. జార్జ్ డబ్ల్యూ బుష్ నుండి బరాక్ ఒబామా కాలానికి అమెరికా అంతర్జాతీయ స్థాయి గణ నీయంగా పెరిగింది. కానీ 1990లలో అమెరికా అనుభ వించిన ప్రతిష్టాత్మక ఎత్తులను ఒబామా కూడా తిరిగి పొంద లేకపోయారు. ఒబామా తర్వాతి అమెరికా అధ్యక్షుడు ఆ కాలాన్ని తిరిగి తేవడం ఇంకా కష్టం. యుఎస్-చైనా పోటీని రోజు రోజుకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తోంది. చైనా మోడల్స్ చాలావరకు చవకైనవి, ఓపెన్ సోర్స్, వాటి సామర్థ్యాలు తరచుగా తక్కువగా ఉన్నప్పటికీ. అమెరికా మోడల్స్ ఖరీదైనవి, మూసివేయ బడినవి (క్లోజ్డ్). కొన్ని తరాలలో మొదటి సారిగా, అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి హామీ లేదు. అది ఇక ప్రశంసలపై ఆధారపడలేదు.
ఎడ్వర్డ్ లూస్!
ఫైనాన్షియల్ టైమ్స్ సౌజన్యంతో
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
