ఢిల్లీ అగ్నిమాపక శాఖ తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నది. మంజూరైన ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పోస్టులలో 80% ఖాళీగా ఉన్నాయి.
మొత్తం మంజూరైన స్థానాలు 90 కాగా కేవలం 18 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీల తీవ్రత – గణాంకాలు..
ఢిల్లీ రాష్ట్రంలో 67 శాశ్వత అగ్నిమాపక కేంద్రాలు, మరొక నాలుగు పగలు మాత్రమే పనిలో ఉండే స్టేషన్లు ఉన్నాయి. మొత్తం ఫైర్ స్టేషన్లలో సాంక్షన్ అయిన పోస్టులు 3,633 కాగా, 2,603 పోస్టులు మాత్రమే భర్తీ చేయబడ్డాయి.
412 మందిని కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నారు. ఇంకా 1,030 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్నిమాపక కేంద్రాలలో అత్యంత కీలకమైన, వెన్నెముక లాంటి స్థాయి పోస్టులు 552 ఖాళీగా ఉన్నాయి. 2011-12 సంవత్సరం తర్వాత మళ్లీ ఇంతవరకు సిబ్బంది నియామకం జరగలేదు.
యంత్రాల కొరత, పెరుగుతున్న అత్యవసర కాల్స్..
మొత్తం 333 అగ్నిమాపక యంత్రాలు ఉండగా ప్రస్తుతం 253 మాత్రమే పనిలో ఉన్నాయి. మిగిలినవి మరమ్మత్తులలో ఉన్నాయి.
2025-26 సంవత్సరంలో మొత్తం 36,877 అత్యవసర టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. ఇది గత ఆరు సంవత్సరాలలో అత్యధికం.
పెరుగుతున్న జనాభా – పొంచి ఉన్న ప్రమాదం..
ఒకవైపున జనాభా విపరీతంగా పెరుగుతున్నది. రెండో వైపున పురాతన కట్టడాలు, నిర్మాణ లోపాలతో అగ్ని ప్రమాదపు అంచులనున్న భవనాల సంఖ్య గణనీయంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన రాష్ట్రాల పరిస్థితి చెప్పనలవి కాదు.
టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
