The goal is huge and complex, the journey long, our strength small, yet there is no choice (Illustration)
మిత్రులారా!
దేశంలో అన్ని వర్గాల ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా తీవ్రమైన దాడి చేస్తుంది. అధికారులు, నిరుద్యోగం, అవినీతి,అక్రమాలు పెరిగిపోయాయి.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను కాలరాస్తున్నారు.మతోన్మాద ఫాసిస్టు తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి.
సంధానకర్తగా ULDF
ఈ పరిస్థితులలో ప్రజల కోసం, దేశం కోసం పనిచేసే, అన్ని కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర, అభ్యుదయ, లౌకిక, బహుజన శక్తులు విడివిడిగా ఉండడం వల్ల బలహీనపడిపోతున్నారు. అందుకని వీరందరిని ఐక్యం చేయడం కోసం దీర్ఘకాలికంగా ఓపికతో పట్టుదలగా ULDF పనిచేస్తుంది.
మా లక్ష్యం చాలా పెద్దది. సంక్లిష్టమైనది. కఠినతరమైంది. మా గమ్యం సుదీర్ఘమైంది. మా శక్తి చిన్నది. అయినా దేశం కోసం ప్రజల కోసం ఒక మహత్తర కార్యాన్ని ప్రారంభించాం. ఇది చివరి వరకు కొనసాగుతుంది. దీనికి మరో మార్గం లేదు.
మా లక్ష్యసాధనలో భాగంగా మొదట తెలంగాణ రాష్ట్రంలోని వామపక్ష కమ్యూనిస్టు పార్టీల నాయకులందరితో 2026 సెప్టెంబర్ 20 వ తేదీన హైదరాబాదులో పెద్ద సదస్సు జరిపాము. దానికి సుమారు నాలుగు వందలకు పైగా హాజరయ్యారు.
కలిస్తే గెలుస్తారు
దేశ వ్యాప్తంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య ఉద్యమాలు నిరంతరం కొనసాగాలి. తద్వారా పార్టీలు, శక్తులు ఒకరిని ఒకరు అన్ని విధాలుగా అర్థం చేసుకోవడానికి తోడుపడుతుంది.వారి మధ్య మరింత మైత్రి ఏర్పడుతుంది.చివరికి కమ్యూనిస్టు వామపక్ష పార్టీలు ఐక్యం కావాలి, పునరేకికరణ జరగాలి.అంతిమంగా దోపిడి పాలకవర్గాల స్థానంలో ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు వామపక్ష బహుజన శక్తుల మధ్య దృఢమైన మైత్రి ఏర్పడి కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
1967 నుండి జరిగిన ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే పాలక పార్టీలకు ప్రత్యామ్నాయం కనబడిన ప్రతీసారి ప్రజలు అధికారం లో ఉన్న పార్టీలను ఓడించారు.1977 ఎన్నికల్లో జనతాపార్టీని, 1983 లో ఆంధ్రప్రదేశ్ లో టిడిపిని,1993 యుపిలో బిఎస్ పి ని,2013 ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ ని, ఇటీవల 2026లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడు లో విజయ్ పార్టీని ప్రజలు గెలిపించారు.కావల్సింది ప్రత్యామ్నాయ శక్తిగా కనపడడం.
కమ్యూనిస్టు లందరూ ఒక్కటై లేదా కనీసం ఒక అవగాహనకు వచ్చి మేమే ప్రత్యామ్నాయం అని ప్రకటించి లౌకిక , ప్రజాతంత్ర ,సామాజిక శక్తులను కలుపుకొని ప్రత్యామ్నాయ శక్తిగా కనబడితే 2029 ఎన్నికల్లో గొప్ప ప్రభావం చూపగలరు.
ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని కేంద్ర నాయకులను కలవడం మంచిదని ఆయా కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులు అభిప్రాయపడ్డారు.
జయప్రదమైన ఢిల్లీ టూర్
యు.యల్.డి.ఎఫ్ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో బొజ్జ బిక్షమయ్య, ప్రొఫెసర్ లు వెంకట దాస్, రమేష్, మోహినుద్దీన్ మరియు లెక్చరర్ బండారు లక్ష్మయ్య లము నవంబరు ఒకటి న ఢిల్లీ వెళ్లాం. అఖిల భారత కార్యదర్శిలు సిపిఐ కామ్రేడ్ రాజా,సిపిఐఎం, కామ్రేడ్ ఎం ఏ బేబీ, ఏ.ఐ.ఎఫ్. బి కామ్రేడ్ జి.దేవరాజన్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కామ్రేడ్ యతీంద్ర కుమార్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఉమాకాంత్, విమల్ త్రివేది, శాంతన్ గార్లను మా బృందం కలిసి కమ్యూనిస్టు వామపక్ష ప్రజాతంత్ర పార్టీల ఐక్యత అవసరాన్ని నొక్కి చెబుతూ లేఖలు అందజేశాం.
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP) కామ్రేడ్ మనోజ్ బట్టాచార్య, ఎస్ యు సి ఐ (సి) కంప్లీట్ ప్రేమ్ చరణ్, ఎం సి పి ఐ (యు) కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్, సిపిఐ ఎం యల్ రెడ్ స్టార్ కామ్రేడ్ తూహిన్ గారలు ఢిల్లీలో అందుబాటులో లేరు. కాబట్టి వారితో ఫోన్ ద్వారా మాట్లాడి వాట్సాప్ లో లేఖలు పంపించాం.
ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ అవసరాన్ని ప్రతి ఒక్కరు నొక్కి చెప్పారు. అలాగే ఆయా కమ్యూనిస్టు పార్టీల మధ్య మైత్రి పునరేకీ కరణ, విలీనం అవసరమని కూడా చెప్పారు. ఢిల్లీలో జరిగే సదస్సుకు తాము హాజరవుటమే కాకుండా తమ పార్టీల నుండి ముఖ్యమైన కొంత మంది నాయకులు హాజరయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలు.
సంతృప్తినిచ్చిన ఢిల్లీ ప్రెస్ మీట్
04/11/2026 న “ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా” న్యూఢిల్లీలో యు.ఎల్.డి. ఎఫ్ ప్రెస్ మీట్ నిర్వహించాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సుమారు 20 మంది హాజరయ్యారు. ప్రశ్నలు జవాబులతో ప్రెస్ మీట్ సుమారు గంటన్నర నడిచింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర హిందీ పత్రికలలో ఢిల్లీ మరియు తెలుగు ఎడిషన్ లో ప్రెస్ కవరేజ్ వచ్చింది.
ఢిల్లీలో నవంబర్ 28 వ తేదీ కాన్సిట్యూషన్ క్లబ్ లోజరిగే సదస్సును జయప్రదం చేద్దాం
ఈ సదస్సులో ఈ క్రింది కమ్యూనిస్ట్ వామపక్ష పార్టీల నాయకులు పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేధావి ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ కూడా పాల్గొంటున్నాడు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వామపక్ష ప్రజాతంత్ర వ్యక్తులు శక్తులు కూడా పాల్గొంటున్నాయి.
- Com. D. Raja – Gen.Sec – CPI
- Com. M.A.Baby – Gen Sec- CPI(M)
- Com. Dipankar Bhattacharya. Gen Sec CPI(ML)Liberation
- Com. Manoj Bhattacharya Gen Sec RSP
- Com.G.Devarajan Central Gen Sec All India Forward Bloc
- Com. Provash Ghosh Gen Sec – SUCI(C)
- Com Maddikayala Ashok Omkar Gen Sec -MCPI(U)
- Com.Yatendra Kumar Gen Sec- CPI(ML) New Democracy
- Com.Pradip Singha Thakur Gen Sec – CPI(ML) Mas Line
- Com. P.J.James Gen Sec- CPI(ML) Red Star
విజ్ఞప్తి
మన రాష్ట్రం నుండి వీలైనంత ఎక్కువ మంది ఢిల్లీకి రావడానికి వెంటనే రిజర్వేషన్లు చేయించుకోవాలి. అలాగే ఆర్థికంగా సహకరణ అందించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఫోన్ పే 8978385151
జస్టిస్ చంద్రకుమార్
కన్వీనర్ యు ఎల్ డి ఎఫ్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
