Congress donations above Rs 20,000 fall 75 percent in one year (Illustration)
రూ.20 వేల కంటే ఎక్కువ మొత్తాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చందాల మొత్తం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 75% పడిపోయింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం షుమారు130 కోట్ల రూపాయలు మాత్రమే చందాల రూపంలో ఆదాయం వచ్చింది అని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సమర్పించిన ఆదాయ నివేదిక వెల్లడించింది.
గత సంవత్సరం అంటే 2024 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రూపంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చందాలు సుమారు 517 కోట్ల రూపాయలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చందాలు దాదాపుగా గత సంవత్సరం తో పోలిస్తే 75% తక్కువగా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన గత 12 సంవత్సరాల నివేదికలను పరిశీలిస్తే, చందాల రూపంలో వచ్చే ఆదాయంలో ఒక్క ఏడాదిలో ఇంతకంటే పెద్ద తగ్గుదల 2015-16లో మాత్రమే (సుమారు 86%) కనిపిస్తుంది.
2024 పార్లమెంటు ఎన్నికల కంటే ముందటి సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి సుమారు 281.48 కోట్ల రూపాయలు చందాలు వస్తే 2024 లోక్సభ ఎన్నికల సంవత్సరంలో ఆ పార్టీకి సుమారు 517 కోట్ల రూపాయల చందాల రూపంలో వచ్చింది.
దాంతో పోలిస్తే ఈ సంవత్సరం అంటే 2025 26 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చందాలు సుమారు 517 కోట్ల రూపాయలు నుండి 130 కోట్ల రూపాయలకు పడిపోయింది.
2024- 25 ఆర్థిక సంవత్సరంలో అంటే లోక్సభ ఎన్నికలు జరిగిన సంవత్సరంలో బిజెపికి 20వేల రూపాయలు ఆ పైన చందాలు గా ఇచ్చిన మొత్తం సుమారు 6000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే అదే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదాయం కంటే బిజెపికి 12 రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చింది.
2025 26 ఆర్థిక సంవత్సరంలో బిజెపి పార్టీకి ఎంత మేరకు టీ మోతాదులో అంటే 20000 రూపాయలు ఆ పైన వచ్చిన చందాల నికర విలువ వివరాలు అందుబాటులో లేదు. గడచిన ఆర్థిక సంవత్సరంలో బిజెపి పార్టీకి వచ్చిన చందాల వివరాలు ఎన్నికల సంఘం బహిరంగపరచకపోవడం దీనికి కారణం.
గత 12 ఏళ్ల గా అధికారంలో ఉన్న బిజెపి సహజంగానే ప్రతి ఏటా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మొత్తంలో చందాలు సేకరించింది.
ప్రూడెంట్ ఎలక్ట్రరల్ ట్రస్ట్ లోక్సభ ఎన్నికలు జరిగిన 2024 లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 216.34 కోట్ల రూపాయలు ఇస్తే గడచిన ఆర్థిక సంవత్సరంలో అంటే లోక్సభ ఎన్నికల ముగిసిన తర్వాత జరిగిన కాలంలో కేవలం 25 కోట్ల రూపాయల మాత్రమే చందాలుగా ఇచ్చింది.
ద వైర్ తెలుగు స్టాఫ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
