విద్యుత్ సంస్కరణలలో భాగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాయి. మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లాలో ప్రజల వ్యతిరేకించినా బలవంతంగా స్మార్ట్ విద్యుత్ మీటర్లు బిగించారు. అనంతరం భారీ మొత్తంలో వచ్చిన బిల్లులతో ప్రజలు బిత్తర పోయారు. ఈ సమస్యపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న నాధుడే లేడు. పైగా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా, అహంకార పూరితంగా ప్రవర్తించారు. దాంతో కోపోద్రిక్తులైన ప్రజలు 35,000 మంది CITU, AIKS, DYFI, AIDWA, SFI సంఘాల నేతృత్వంలో 2026 సెప్టెంబర్ 10న మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహను తాలూకాలోని చరోటి వద్ద ముంబై-ఢిల్లీ జాతీయ రహదారిని మూడు గంటల పాటు దిగ్బంధించారు. వేలాది మంది రోడ్డుపై బైఠాయించారు.
బలవంతంగా అమర్చిన స్మార్ట్ మీటర్లు, విపరీతమైన విద్యుత్ బిల్లులు మరియు విద్యుత్ శాఖ అధికారుల అహంకారపూరిత, అసంవేదనాయుత ప్రవర్తనతో విసిగిపోయిన 35,000 మందికి పైగా ప్రజలు, ‘రెడ్ ఫ్లాగ్’ (Red Flag) నాయకత్వంలో థానే-పాల్ఘర్ జిల్లాలకు చెందిన AIKS, CITU, AIDWA, DYFI మరియు SFI సంఘాలు ఈ భారీ నిరసన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొన్నాయి.
భారీ వర్షం కురుస్తు న్నప్పటికీ ఒక్కరు కూడా కదల లేదు. కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి ఇది నిదర్శనం. దాంతో ప్రభుత్వం దిగిరాక తప్ప లేదు. విద్యుత్ శాఖ అధికారులు చర్చలు జరిపారు. 15 రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల విద్యుత్ బిల్లులను తగ్గిస్తామని అధికారులు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. మరు రోజు, సెప్టెంబర్ 11 నుండి మొదలు పెట్టీ 15 రోజుల్లో బిల్లులు తగ్గించేందుకు అంగీకరించారు. ఇది ప్రజా పోరాటం సాధించిన ఒక అద్భుత విజయం.
గతంలో ఇతర ప్రాంతాలలో కూడా స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. పాల్ఘర్ లో భారీ విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, సాధించిన విజయం ఇతర ప్రాంత ప్రజలకు ఆదర్శం.
పోరాడి విజయం సాధించి ప్రజలకు జే జే లు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
