తాత్కాలిక ఉపశమనం కల్పించాలని నాయర్ తరఫున న్యాయవాది అభిక్ చిమ్నీ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ, సెప్టెంబర్ 23న వాదనలను విన్న జస్టిస్ ఎంకె థక్కర్ వారం వరకు ఉత్తర్వును రిజర్వులో పెట్టారు.
న్యూఢిల్లీ: తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్ హై కోర్టు తీర్పును రిజర్వులో పెట్టాలని నిర్ణయించడంతో అదానీ గ్రూపుపై కథనం రాసిన జర్నలిస్టు రవి నాయర్ కనీసం సెప్టెంబర్ 30వ తేదీ వరకు జైలులో ఉంటారు.
అదానీ ఎంటర్ప్రైజ్ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో నాయర్‌కు వ్యతిరేకంగా సెషన్స్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
తనకు ఎలాంటి ముందస్తు నోటీసు లేదా సమ్మన్లను జారీ చేయకుండా సెషన్స్ కోర్టు వారెంట్‌ను జారీ చేసిందని కోర్టుకు నాయర్ తెలియజేశారు.
తాత్కాలిక ఉపశమనానికి నిరాకరణ
నాయర్ సెప్టెంబర్ 17న కోర్టు ముందు హాజరై వారెంట్‌ను రద్దు చేయాలని కోరారు, అయితే ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
తన క్లయింట్‌కి తాత్కాలిక ఉపశమనం కల్పించాలని నాయర్ తరఫున న్యాయవాది అభిక్ చిమ్నీ విజ్ఞప్తి చేసినప్పటికీ సెప్టెంబర్ 23న వాదనలు విన్న జస్టిస్ థక్కర్ వారం వరకు ఉత్తర్వును రిజర్వులో పెట్టారు.
ఈ అంశాన్ని పూర్తిగా వినడం జరిగిందని, తీర్పును రాయించడం కోసం కేసును వాయిదా వేశామని, తాత్కాలిక ఉపశమనం మంజూరు అవసరం లేదని జస్టిస్ థక్కర్ పేర్కొన్నట్లు లైవ్ లా తెలియజేసింది.
వాదనలు వినిపించిన న్యాయవాది
నాయర్ విచారణకు కచ్చితంగా హాజరవుతున్నారని, మొత్తం ఎనిమిది విచారణల్లోంచి నాలుగు సార్లు హాజరయ్యారని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జులైలో పెట్టుకున్న దరఖాస్తుకు అనుమతి ఇచ్చారని విచారణ సందర్భంగా చిమ్నీ తెలియజేశారు. నాయర్ ఎక్కడికి పారిపోలేదని విన్నవించుకుంటూ కోర్టు వాదనల్లో తప్పిదాలున్నాయని కూడా చిమ్నీ అన్నారు.
జర్నలిస్టుల సంఘాల ఆందోళన
మానవ హక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నాయర్ అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది.
ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, దేశంలో నిష్పక్షపాత విచారణ హక్కుల చుట్టూ అనేక తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని పేర్కొంది.
ఈ పరిణామం చాలా కలవరపెడుతోందని ఆన్లైన్ వార్తా సంస్థల ఉమ్మడి వేదిక డిజిపబ్ చెప్పింది.
మీడియా వర్గం ఆందోళన చెందడానికి ఈ కేసు మరో కారణం కాగలదని ఒక ప్రకటనలో డిజిపబ్ తెలియజేసింది.
ఒక జర్నలిస్టుకు వ్యతిరేకంగా నేరపూరిత పరువు నష్టం దావా వేసిన అదే కార్పొరేట్ సంస్థ చివరికి ప్రధాన వార్తా సంస్థలను కూడా నియంత్రిస్తోందని వాటికి చెందిన జర్నలిస్టులు అదే తీరులో వృత్తి వ్యవస్థ నుంచి పని చేస్తున్నారని పేర్కొన్నది.
కేసు నేపథ్యం
బహుళజాతి సంస్థ అయిన అదానీ గ్రూపు దాఖలు చేసిన కేసులో గుజరాత్‌లోని మాన్సా విచారణ కోర్టు నాయర్‌కు ఏడాది పాటు కారాగార శిక్షను ఐదు వేల రూపాయల జరిమానాను విధించింది, ఆయన అరెస్టుపై నెల రోజుల స్టేను కూడా మంజూరు చేసింది.
నాయర్‌కు వ్యతిరేకంగా అదానీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ సెప్టెంబర్ 3, 2021లో నేరపూరిత పరువు నష్టం దావాను దాఖలు చేసింది.
తన ఎక్స్ ఖాతా నుంచి అక్టోబర్ 2020 నుంచి జులై 2021 వరకు సంస్థను భాగస్వామ్యం చేస్తూ నాయర్ అనేక ట్వీట్లను పోస్ట్ చేశారని ఆరోపించింది. అవి తప్పుడు, తప్పుదోవ పట్టించేవిగా, అవమానకరంగా, పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆ సంస్థ వాదిస్తోంది.
ఆల్ట్ న్యూస్ కథనం ప్రకారం
ప్రజలకు ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాసాలపై పరిశోధన ఆధారంగా మంచి ఉద్దేశంతోనే ట్వీట్లు ఉన్నాయని నాయర్ తరఫున న్యాయవాదులు వాదించినట్లు ఆల్ట్ న్యూస్ కథనం వెల్లడించింది.
తన సొంత ఆరోపణలు చేయలేదని, ఆ లింకులను మాత్రమే పంచుకున్నారని, ప్రస్తావిస్తున్న ఆ వ్యాసాల రచయితలను ఈ కోర్టు విచారణలో భాగం చేయలేదని, కాబట్టి రవి నాయర్‌ను ఆరోపణల నుంచి నిర్దోషిగా విడుదల చేయాలని న్యాయవాదులు కోరారు.
2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ జాబితాలో 180 దేశాల్లోంచి భారతదేశం 157వ ర్యాంక్‌లో ఉంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
