పైన పేర్కొన్న ఈ సర్క్యూట్ల ఐక్యత కూడా ఒక వైరుధ్యానికి సూచన అన్నది రెండవ ముఖ్యమైన విషయం. ఇప్పుడు విడిగా ఉన్న మూలధనంలో కొంత భాగం తయారై అమ్మకానికి సిద్ధంగా ఉన్న సరుకుగా ఉంది. సరుకులు– మూలధనం సర్క్యూట్ పూర్తి చేయలేకపోతే, అప్పుడు అది ముందో లేక వెనకో ధన రూపంలోనూ, ఉత్పాద– మూలధనంగానూ ఉన్న ఇతర భాగాలను వాటి సంబంధిత సర్క్యూట్లను పూర్తి చేయకుండా అడ్డుకుంటుంది.
ఆ విధంగా, వేటి(ఐక్యత)కలయిక ఐతే పారిశ్రామిక- మూలధన సర్క్యూట్ అవుతుందో; ఆ ప్రతి సర్క్యూట్‌లోని విడి మూలధనం ప్రత్యేకించి సామాజిక మూలధన పునరుత్పత్తి ఉత్పత్తికి కొనసాగింపు అవసరం.
ఒక బలమైన ఉదాహరణ, ఒక మిల్లు యజమాని తన మిల్లులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడని అనుకుందాము. అతని కర్మాగారంలో ఒక సంవత్సరంలో 25,000 రూపాయల బట్టలు ఉత్పత్తి అయి, అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని అనుకుందాము. వీటిని ఎవరో ఒకరు కొనకపొతే ఇది కొంత భాగం ధన రూపంలోనూ, ముడి సరుకులూ, యంత్రాల రూపంలోనూ, కార్మికుల శ్రమ శక్తి రూపంలోనూ ఉన్న మిగిలిన మూలధన భాగాన్ని ప్రభావితం చేస్తుంది.
ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి రసాయనిక సారూప్యత కూడా తోడ్పడుతుంది. ఒక నిరంతర రసాయన ప్రక్రియలో, తుది ఉత్పత్తి స్థిరమైన రేటులో ఉత్పత్తి కాక విచ్ఛేదన పరికరంలోనే(రియాక్టర్ లోనే)పేరుకుపోవడం ప్రారంభమయ్యిందని అనుకుందాము, దాని ఫలితంగా పేలుడు జరగవచ్చు లేదా కొనసాగుతున్న రసాయన ప్రక్రియ ఆగిపోవడమో జరుగుతుంది.
పంపిణీ సమయం..
స్వయంగా పునరుత్పత్తి చేయడానికి పారిశ్రామిక మూలధనం, ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియల ద్వారా ప్రయాణించాలని మనం పైన చూశాము. ఇప్పుడు మనం దానిని దాని సాధారణ రూపం, ధన రూపంలో చూద్దాము. మొదటగా LP, MPలతో M మార్పిడి జరగాలి. ఇది కొనుగోలు చర్య, ఇది చలామణికి సంబంధించిన ప్రక్రియ.
ఉత్పాదక మూలధనం(భౌతిక) పదార్ధిక అంశాలు అదనపు విలువని ఉత్పాత్తి చేయడానికి వీలుగా శ్రమ ప్రక్రియలో తప్పని సరిగా ఉత్పాదకంగా వినియోగించబడాలి. ఈ చర్య ఉత్పత్తి రంగానికి చెందినది. ఆఖరికి ఉత్పత్తయిన సరుకు C’ తప్పని సరిగా అమ్ముడు పోవాలి. ఆ విధంగా మళ్లీ ధన రూపంలోకి తిరిగి పరివర్తన చెందాలి. ఈ ఆఖరి చర్య పంపిణీ (చలామణి) పరిధికి చెందినది. అందుచేత ప్రతి పారిశ్రామిక-మూలధనం కూడా కొంత కాలం ఉత్పత్తి ప్రక్రియ పరిధిలోనూ, కొంత కాలం పంపిణీ(చలామణి) ప్రక్రియ పరిధిలోనూ గడుపుతుంది. మనం ఇప్పటివరకూ సరుకుల ‘ఉత్పత్తి ప్రక్రియ సమయాన్ని’ పరిశీలించాము. ఇప్పుడు మనం ‘పంపిణీ (చలామణి) ప్రక్రియ సమయం’ వైపు దృష్టి సారిద్దాము.
నియమాల నిర్వచనం..
ఉత్పత్తి రంగం ద్వారా, పంపిణీ(చలామణి) రెండు దశలలోకి మూలధన(కదలిక) ప్రయాణం వరుస కాలవ్యవధిలో జరుగుతుంది. ఉత్పత్తి రంగంలో అది గడిపిన తాత్కాలిక కాలం అది తీసుకున్న ఉత్పత్తి సమయం, అది పంపిణీలో (చలామణిలో) వెచ్చించిన సమయం దాని పంపిణీ(చలామణి) సమయం.
ఉత్పత్తి– పంపిణీ సమయం(చలామణి సమయం) మొత్తం కలిసి అభివృద్ధి చెందిన (అదనపు విలువను కలుపుకొనే అనుకోండి) మూలధన పునరుత్పత్తికి తీసుకున్న సమయం లేదా సరళంగా ‘పునరుత్పత్తి సమయం’.
ఉత్పత్తి సమయంలో శ్రమ ప్రక్రియలో తీసుకున్న సమయం కూడా ఉంటుంది. కానీ సాధారణంగా దాని కంటే ఎక్కువ ఉంటుంది. ఉత్పత్తి ప్రక్రియలో అనివార్యంగా ఆపుదలలు ఉంటాయి(ఉదాహరణకు షిఫ్టుల మధ్య సమయంలో) , ఆ సమయంలో ఉత్పత్తి సాధనాల రూపంలో విడిగా ఉన్న మూలధన భాగం దానిపై ఎటువంటి పనీ చేయకుండానే ఉత్పత్తి రంగంలో ఉంటుంది. ఇంకా పెట్టుబడిదారుడు ముడి పదార్ధాల నిల్వలను సంసిద్ధంగా ఉంచుకోవచ్చు, ఉత్పత్తి క్రమం ప్రారంభం కాకముందే కొంత కాలం ముందుగానే యంత్రాలను తన చేతులలో ఉంచుకోవచ్చు. యంత్రాలను (plants), కర్మాగారాలు వంటివి నిర్మించడానికి సమయం పడుతుంది.
అప్పుడప్పుడూ ఉత్పత్తి ప్రక్రియ స్వభావంలోనే మానవ శ్రమ అవసరంలేని సందర్భాలు ఉంటాయి, ఉదాహరణకు గాలిలో ఉంచడం ద్వారా రసాయనిక ప్రక్రియలో ఎండ బెట్టడం లేదా ద్రాక్ష సారాను కుళ్ళబెట్టడం, మొదలైన వాటిలో. ఆవిధంగా, ఉత్పాదక మూలధన ఇతర మూలకాలకు వర్తింపజేసిన మానవ శ్రమకు(సజీవ శ్రమకు), ఉత్పత్తి క్రమంలో శ్రమ చేయని కాలాన్ని, ఉత్పాదక మూలధన మూలకాలను సిద్ధంగా ఉంచిన కాలాన్ని, బలవంతంగా పని లేకుండా అమలు చేసిన ఖాళీ సమయాన్ని(ఉదాహరణకు యంత్రాల వైఫల్యం, సమ్మెలు మొదలైనవి) కలిపితే వచ్చిన మొత్తం సమయాన్ని ఉత్పత్తి సమయమని అనవచ్చు. అవి చాలా అవసరమే అయినప్పటికీ, ఉత్పత్తి సాధనాలపై ఏ శ్రమా చేయని ఉత్పత్తి సమయం భాగాలు స్పష్టంగా ఏ విలువనూ సృష్టించే సమయాలు కాదు. ఇచ్చిన నిర్దిష్ట సమయంలో ఎంత ఎక్కువ ఉత్పత్తి సమయం, శ్రమ సమయం ఒక దానికి ఒకటి తోడవుతాయో అంతే ఎక్కువగా ఉత్పాదకత, ఉత్పాదక మూలధనం స్వీయ విస్తరణ ఉంటుందనేది స్పష్టమే.
పంపిణీ పరిధిలో ఒక సర్క్యూట్‌ను పూర్తిచేయడానికి మూలధనం పంపిణీకి తీసుకున్న సమయమే మూలధన పంపిణీ సమయం. అది రెండు కార్యకలాపాలను లేదా రూపంలో మార్పులను, ధనాన్ని ఉత్పాదక మూలధనంగా మార్చడం(కొనుగోళ్ళు, M-C), ఉత్పత్తి చేసిన సరుకులను ధన రూపంలోకి మార్చడం(అమ్మకాలు C’-M’) కలిగి ఉంటుంది. అందువల్ల పంపిణీ సమయం, ఈ మార్పులలో ప్రతి ఒక్కటీ ప్రభావం చూపడానికి తీసుకునే సమయంపై ఆధారపడి ఉంటుంది.
ధనం తక్షణమే సరుకులుగా మార్చడానికి వీలవుతుంది. కాబట్టి, సాధారణంగా అమ్మకం ప్రభావం చూపడమే కష్టం. ఎవరైనా సులభంగా విక్రేతను కనుగొనవచ్చు. కానీ ఒకరి సరుకుల కొరకు కొనుగోలుదారులను కనుగొనడం ఎప్పుడూ సులభం లేదా సాధ్యం కాదు. మరో కారణం రీత్యా కొనుగోలు M-C కంటే అమ్మకం C’-M’ చాలా ముఖ్యం. అభివృద్ధి చెందినా M స్వీయ విస్తరణ కోసం ఒక అవసరమైన చర్య M-C, కానీ C’-M’ మాత్రమే నిజానికి ఉత్పత్తి చేసిన అదనపు విలువను ధనం రూపంలో పొందడానికి తోడ్పడుతుంది.
ఇతర విషయాలు సానుకూలంగా ఉంటే పంపిణీ సమయం తక్కువైతే మూలధన విస్తరణ త్వరగా జరుగుతుంది. మరొక విధంగా చెప్పాలంటే, ఒక నిర్దిష్ట సమయంలో పంపిణీకి ఎంత తక్కువ సమయం వెచ్చిస్తే అంత ఎక్కువగా, పెట్టిన మూలధన ప్రారంభ వ్యయం నుంచి అదనపు విలువను సృష్టించవచ్చు, పొందవచ్చు. విలువ, అదనపు విలువల ఉత్పత్తి– మూలధన స్వీయ-విస్తరణా ఉత్పత్తిరంగంలో జరగడం ఒక్కటే ఇందుకు కారణం. పంపిణీ మొదటి చర్య(M-C) అదనపు విలువ ఉత్పత్తికి అవసరమైన పరిస్థితిని అందిస్తుంది, రెండవ చర్య పంపిణీ (C’-M’) ఉత్పత్తి చేసిన అదనపు విలువను పొందుతుంది. రెండు చర్యలూ స్పష్టంగా అవసరం కానీ విలువను సృష్టించవు.
పంపిణీ ఖర్చు..
మొదట M-C, ఆ తరువాత C’-M’గా స్వరూపం రెండు మార్పులు జరగడంలో స్పష్టంగా ఖర్చులు ఉన్నాయి. ఈ రెండు మార్పులూ కొనుగోలుదార్లకూ, అమ్మకందార్లకూ మధ్య జరిగిన లావాదేవీలు, కొంత సమయం తీసుకుంటాయి. పెట్టుబడిదారుడు నేరుగా స్వయంగా కొనుగోళ్ళు, అమ్మకాలు చేయవచ్చు. ఉత్పాదక మూలధన అంశాలను కొనడం, ఉత్పత్తి చేసిన సరుకులను అమ్మడం నిర్దిష్ట కర్తవ్యంగా కార్మికులను అతను నియమించుకోవచ్చు. లేదా పెట్టుబడిదారీ అభివృద్ధితో టోకు వ్యాపారులు నిర్వహించే కార్యాచరణ ప్రత్యేక శాఖలుగా కొనుగోళ్ళు, అమ్మకాలు మారవచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఈ కార్యకలాపాలు నిర్వహించే విధానం ఏదైనా కావచ్చు. కానీ, ఖచ్చితంగా అవి యాజమాన్య హక్కుల బదిలీలను మాత్రమే కలిగి ఉంటాయి. ఉదాహరణకు A అనే వ్యక్తి B అనే వ్యక్తికి ఒక బేలు ప్రత్తిని X రూపాయలకు అమ్మాడనుకుందాము. జరిగినది అంతా ఒకబేలు ప్రత్తిపై B ఒక బేలు ప్రత్తికి యజమాని కావడం, X రూపాయలకు A యజమాని కావడం మాత్రమే జరిగింది. ఉత్పత్తి ఏదీ జరగలేదు, హక్కుల బదిలీ మాత్రమే జరిగింది.
అందుచేత, సరుకుల ఉత్పత్తి వ్యవస్థలో ఈ చర్యలు స్పష్టంగా అవసరమే. అయినప్పటికీ, కొనుగోళ్ళు అమ్మకాల ప్రక్రియలో శ్రమను వెచ్చించిన సమయమంతా ఏ విలువనూ సృష్టించదు. పెట్టుబడిదారుడు కొనుగోళ్ళు, అమ్మకాల కొరకు ఏజంటుగా నియమించిన వ్యక్తి గురించి మార్క్స్ ఈ విధంగా చెప్పాడు: ‘అతను అవసరమైన పనితీరును నిర్వహిస్తాడు ఎందుకంటే పునరుత్పత్తి ప్రక్రియలో ఉత్పాదకత లేని విధులు ఉంటాయి కనుక. తరువాతి మనిషితో పాటు ఆటను పని చేస్తాడు కానీ అంతర్గతంగా అతని శ్రమ విలువను కానీ ఉత్పత్తిని కానీ సృష్టించదు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 50వ భాగం, 49వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
