మూలధనం పునరుత్పత్తి ప్రక్రియ
ఈ శ్రేణిలో(సీరీస్) మార్క్స్ ఆర్ధిక విశ్లేషణపై మన వ్యాఖ్యానంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో పంపిణీని(circulation) గురించి మనం ఇంకా చర్చించలేదు. గుర్తు చేసుకుంటే, పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియలో విలువ, అదనపు విలువ ఉత్పత్తి ప్రక్రియగా, మార్క్స్ పెట్టుబడి మొదటి సంపుటిలో వ్యవహరిస్తాడు(డీల్ చేస్తాడు).
పెట్టుబడిదారీ దోపిడీ ప్రాథమిక స్వభావాన్ని ఈ విశ్లేషణ బయటకు తెచ్చింది. అంతేకాకుండా, పెట్టుబడిదారే కూడబెట్టే(సంచితం)క్రమం మూలధన కేంద్రీకరణ– సాంధ్రతీకరణ, సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి, నిరుద్యోగ కార్మిక సైన్య సృష్టి, ఇంకా మరెన్నో ప్రాథమిక ధోరణులను వెలికితీసింది.
ఏమైనప్పటికీ, రెండోది పెట్టుబడిదారీ పంపిణీ ప్రక్రియని కూడా కలిగి ఉన్నందున, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన అసంపూర్ణ విశ్లేషణగా ఇది తప్పనిసరిగా ఉంది. పెట్టుబడి రెండవ సంపుటిలో మార్క్స్ ఈ పెట్టుబడిదారీ పంపిణీ ప్రక్రియ విశ్లేషణనే చేశాడు. ఆఖరుకు మూడవ సంపుటిలో ‘మొత్తం పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియను’ విశ్లేషించడం ద్వారా అంటే ఉత్పత్తి– పంపిణీ ప్రక్రియనూ ఐక్యం చేసి ఈ విశ్లేషణా సౌధాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుత అధ్యాయంలో పెట్టుబడిదారీ పంపిణీ ప్రక్రియపై మార్క్స్ పరిశీలనలను సంగ్రహంగా తెలుసుకుంటారు.
మూలధన(Circuit)సర్క్యూట్..
పెట్టుబడిదారీ పంపిణీ ప్రక్రియలో కేవలం సరుకుల పంపిణీ మాత్రమే ఇమిడిలేదు. కానీ మూలధన పంపిణీ, పునరుత్పత్తి కూడా అందులో ఇమిడి ఉంది. ప్రతి విడి పెట్టుబడీ తన కదలికలలో(ప్రయాణంలో) అనేక రూపాలు దాల్చుతుంది. ఒక సమయంలో అది డబ్బుల రూపంలో ఉంటుంది. తదనంతరం ఉత్పత్తి సాధనాలలోనూ, శ్రమ శక్తిలోనూ ఇమిడి ఉంటుంది. ఆ తరువాత కొత్తగా ఉత్పత్తి చేసిన అమ్మకానికి సిద్ధంగా ఉన్న నిల్వల రూపంలో ఉంటుంది. అమ్మకం(ప్రభావం చూపినప్పుడు) జరిగినప్పుడు, అది మళ్లీ డబ్బుల రూపంలో కనపడుతుంది. ఏ సమయంలోనైనా ప్రతి విడి పెట్టుబడిలో కొంత భాగం డబ్బులు రూపంలో, కొంత భాగం ఉత్పత్తి సాధనాలూ– శ్రమ శక్తి రూపంలో, మరికొంత భాగం అమ్మకానికి సిద్ధంగా ఉన్న తయారైన సరుకుల రూపంలో ఉనికిలో ఉంటుంది. విడివిడిగా ఉన్న పెట్టుబడులన్నిటి మొత్తం పంపిణీ అయిన సామాజిక పెట్టుబడి పంపిణీ ప్రక్రియ మరింత అభివృద్ధి చెందిన రూపంలో ఈ లక్షణాలను వెల్లడిస్తుంది.
ముఖ్యంగా మూలధన రూపాలు మూడు..
(i) డబ్బు మూలధనం లేదా డబ్బు రూపంలో మూల ధనం.
(ii) ఉత్పత్తి సాధనాలు, అదనపు విలువను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో పెట్టుబడిదారుడు కొనుగోలు చేసిన శ్రమశక్తితో కూడిన ఉత్పాదక మూలధనం.
(ii) వాటి అమ్మకం ద్వారా మూలధనాన్ని డబ్బు రూపంలోకి మార్చడం సాధ్యమయ్యే ఉత్పత్తి చేసిన సరుకులను కలిగి ఉన్న, సరుకుల – మూల ధనం. సంకేత రూపంలో మూలధన పంపిణీ(సర్క్యూట్‌ని) ఈ దిగువ విధంగా మనం చూపవచ్చు.
M–C P C’ M’ LP MP…
M అంటే డబ్బులు, LP అంటే శ్రమ శక్తి, MP అంటే ఉత్పత్తి సాధనాలు, P అంటే ఉత్పత్తి ప్రక్రియ, C’ అంటే అమ్మడానికి ఉత్పత్తి చేసిన సరుకు, M’= M+VM, VM అదనపు విలువ. దీనిని పెట్టుబడి సాధారణ సర్క్యూట్లో పెట్టుబడి పంపిణీ పరిధిలో, డబ్బు- మూలధనం, సరుకుల మూలధన రూపాలను తీసుకోవడం, సరుకులను డబ్బులకు మార్చుకోవడం, డబ్బులను సరుకులుగా మార్చుకోవడం చూడవచ్చు. ఉత్పత్తి లేదా శ్రమ ప్రక్రియలో మూలధనం ఉత్పాదక మూలధన రూపం తీసుకుంటుంది.
మార్క్స్ మాటలలో: పంపిణీ వివిధ దశలలో మూలధన విలువ తీసుకున్న రెండు రూపాలు డబ్బు– మూలధనం, సరుకుల – మూలధనం. ఉత్పాదక దశకు సంబంధించిన రూపం ఉత్పాదక– మూలధనం. తన మొత్తం సర్క్యూట్లో ఈ రూపాలను మూలధనం తీసుకుంటున్నది. అంతేకాకుండా, ఆ తరువాత వాటిని విస్మరిస్తున్నది. వీటిలో ప్రతిదీ ఆ ప్రత్యేక రూప ధర్మాన్ని నిర్వహిస్తున్నది. అది పారిశ్రామిక– మూలధనం. పరిశ్రమ అంటే ఇక్కడ అర్ధం పెట్టుబడిదారీ ప్రాతిపదికన నడుస్తున్న పరిశ్రమ ప్రతి శాఖనూ.
ఆవిధంగా, తన స్వీయ విలువను విస్తరించుకోవడం ప్రాథమిక లక్ష్యానికి తోడ్పడడానికి సంబంధిత పనితీరును నిర్వహించే క్రమంలో డబ్బు– మూలధనం, ఉత్పాదక– మూలధనం, సరుకుల– మూలధనంల పారిశ్రామిక– మూలధనం తీసుకున్న రూపాలు. పారిశ్రామిక– మూలధనం సర్క్యూట్‌ను ఆ రూపాల ప్రతి కోణం నుంచి పరిశీలించవచ్చు.
ధన రూపంలోని మూలధన సర్క్యూట్..
డబ్బు- మూలధన సర్క్యూట్ డబ్బుతో ప్రారంభమై డబ్బుతో ముగుస్తుంది. ఇది M–C.. P.. C’–M’గా ప్రాతినిధ్యం వహించబడుతున్నది. ఈ సర్క్యూట్ పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రాథమిక లక్ష్యం, డబ్బు చేసుకోవడాన్ని(సొమ్ము చేసుకోవడాన్ని) తీవ్రంగా ముందుకు తెస్తుంది. ఉత్పత్తి దశకు ఇక్కడ రెండవ ప్రాముఖ్యతే ఉన్నది. వాస్తవానికి ఉత్పత్తి దశను, సొమ్ముచేసుకోవడానికి అనివార్యమైన లింకుగా, ఒక అవసరమైన చెడుగా పెట్టుబడిదారుడు పరిగణిస్తాడు. డబ్బు – మూలధనం సర్క్యూట్ వాస్తవానికి పారిశ్రామిక– మూలధనం సర్క్యూట్ రూపం. రెండింటి మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే, రెండోది ఇంతకు పూర్వం ఉన్న ప్రక్రియ స్థిరమైన పునరావృతం.
ఉత్పాదక – మూలధన సర్క్యూట్..
ఈ సర్క్యూట్‌కు సాధారణ సూత్రం P.. C’– M’– C.. Pని ఉంది. ఇక్కడ మనం ఉత్పత్తి ప్రక్రియతో ప్రారంభిస్తాము. అప్పుడు ఉత్పత్తి చేసిన సరుకును విలువనూ, దానిలో స్వాభావికంగా ఉన్న అదనపు విలువనూ పొందుతూ అమ్ముతారు. అంతేకాకుండా, M’ నుంచి వస్తున్న డబ్బు ఉత్పత్తి ప్రక్రియ తిరిగి మూలవస్తువుగా మార్చబడుతుంది.
ఉత్పాదక– మూలధన సర్క్యూట్ దానిలో రెండు అవకాశాలను కలిగి ఉంది. Cలో అంతర్లీనంగా ఉన్న M’ నుంచి పొందిన అదనపు విలువ ఉత్పాదకత లేకుండా వినియోగించబడవచ్చు. అభివృద్ధి చెందిన విలువ M మాత్రమే ఉత్పాదక మూలధనం అంశాలలోకి మార్చబడుతుంది:
ఇటువంటి సందర్భంలో మనకు మునుపటి మాదిరిగానే సాధారణ పునరుత్పత్తి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా అదనపు విలువలో ఒక భాగం లేదా మొత్తాన్ని ఉత్పాదక పెట్టుబడి అంశాలుగా మార్చవచ్చు.
M’’, M’తో సమానం లేదా తక్కువ కానీ Mకన్నా ఎక్కువ. ఈ విస్తరించిన పునరుత్పత్తి, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన లక్షణం. మొత్తంగా, సామాజిక మూలధనం పునరుత్పత్తి ప్రక్రియను చూసినప్పుడు, సాధారణ ఉత్పత్తిలోనూ, విస్తరించిన పునరుత్పట్టిలోనూ నిర్దిష్టమైన వైరుధ్యాలు ఉన్నాయి.
ఉత్పాదక మూలధన సర్క్యూట్లో ప్రాధాన్యత ఉత్పత్తి దశలో ఉంది. అంతేకాకుండా, ఆ విధంగా పదార్ధ పునరుత్పత్తిపై ఉంది. ఇది ధన రూప మూలధన సర్కూట్కు భిన్నమైనది, ఇది ఖచ్చితంగా పెట్టుబడిదారీ విలువ స్వీయ– విస్తరణ లక్షణమని స్పష్టమౌతున్నది.
సరుకుల రూపంలోని మూలధన సర్క్యూట్..
ఈ సర్క్యూట్ అమ్మకానికి సిద్ధంగా ఉన్న సరుకులతో ప్రారంభమై దానితోనే ముగుస్తుంది. అంటే దానిని ఇలా వ్రాయవచ్చు C’–M’– C.. P.. C’. మనం C’ను ఉత్పాదక మూలధనం C’ అంశాల, C అదనపు విలువ అసలు విలువగా వ్రాయవలసి వస్తే దానిని ఈ విధంగా వ్రాయవచ్చు:
M–C { LP MP m–c C’ C —c M’… P… C’{ ఇక్కడ Cకి సమానమైన ధనం Mని పెట్టుబడిదారుడు అనుత్పాదకంగా వినియోగిస్తాడు.
ఇప్పటి వరకు చర్చించినదాంట్లో అర్ధం చేసుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే, పునరుత్పత్తి సమయంలో మూలధనం వివిధ రూపాలను పొందుతుందని. వేటి సన్నకారు ఉత్పత్తి లాభాల రేటును నిర్ణయిస్తుందో ఆ ఉత్పత్తి సాధనాల భౌతిక రూపంగా మూలధనాన్ని భావించే పెట్టుబడిదారుల అవగాహనలోని అసంబద్ధతను తెలుసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే మూలధనాన్ని ఆర్ధిక నిధిగా భావించే ధోరణి ఒక పక్కన ఉంది.
ప్రతి విడివిడి మూలధనమూ అమ్మకానికి సిద్ధంగా ఉన్న సరుకుల రూపాన్ని , ఉత్పత్తి క్రమంలోని మూలాల రూపంలో అంటే ఉత్పత్తి క్రమంలో శ్రమశక్తి, ఉత్పత్తిసాధనాల రూపాలను దానం తీసుకుంటుంది. అలాగే, ఏ సమయంలోనైనా, ఈ రూపాలన్నిటిలోనూ ప్రారంభంలో అభివృద్ధి చెందిన మూలధన విలువ వివిధ భాగాలు ఉనికిలో ఉన్నాయి. ‘పారిశ్రామిక మూలధన వాస్తవ సర్క్యూట్ తన కొనసాగింపులో దాని మూడు సర్క్యూట్ల ఐక్యత కూడా’.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 49వ భాగం, 48వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
