ప్రాథమిక సమస్యలలో ఒక దానిని పరిష్కరించడానికి ఈ అధ్యాయంలో తీసుకోవాలని మనం ఆశించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని తీసుకున్నది. ఆ సమస్యకు పరిష్కారం కూడా పైపైన జరిగింది. కానీ పెట్టుబడిదారీ విదానంలోని పోటీలో ధరల నిర్ణయ సమస్యకు మార్క్స్ అనుసరించిన విధానం సరైనదని ఖచ్చితంగా నిరూపించడానికి పైన చెప్పినది బహుశా సరిపోతుంది.
(i)సరఫరా, డిమాండ్లు తామే మరింత ప్రాథమిక సంబంధాల నుంచి ఉద్భవించాయనే విషయాన్ని, (ii)నిర్దిష్ట ‘సాధారణ విలువ’ లేదా విలువల పరిధికి సంబంధించి మాత్రమే ధరలు ఎందుకు ఎక్కువగా లేక తక్కువగా ఉన్నాయని మాత్రమే అవి వివరించగలవనే విషయాన్ని పూర్తిగా సరఫరా, డిమాండు విధానం చూడలేకపోయింది.
ధరలు ప్రాథమికంగా సరఫరా, డిమాండ్లపైన ఆధారపడికాక సరుకులను ఉత్పత్తి చేయడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అవసరమైన శ్రమ సమయాలలో ఇవి చివరకు గుర్తించబడే ఉత్పత్తి ధరలపై ఆధారపడి నిర్ణయించబడతాయని ఆధునిక శాస్త్రీయ విధానం గుర్తించింది. కానీ, లాభాలు– వేతనాల మధ్య నికర ఉత్పత్తి పంపిణీపై ఆధారపడే విధంగా ఇది ధర నిర్ణయాన్ని వదిలివేస్తున్నందున, పంపిణీని నిర్దిష్టంగా పేర్కొననందున, ఈ విధానం ధర నిర్ణయానికి సంబంధించిన పూర్తి స్థాయి సిద్ధాంతానికి తక్కువగానే మిగిలిపోతున్నది.
మార్క్స్ మరొక వైపున విలువ, అదనపు విలువ సిద్ధాంతంతో ప్రారంభించాడు.
విలువలో ధరల ప్రాథమిక లేదా సరళమైన నిర్ణయాన్ని తను చూశాడు; అదనపు విలువ, విలువల ఆధారంగా లాభం, ఉత్పత్తి ధరలను అభివృద్ధి చేయడానికి ఆ తరువాత తను పెట్టుబడిదారీ- అంతర్గత సంబంధాలను తీసుకువచ్చాడు. అంతేకాకుండా సరఫరా, డిమాండ్లను ముందుకు తీసుకువచ్చి, ఆ విధంగా మార్కెట్ ధరను తీసుకువచ్చి నిర్మాణాన్ని పూర్తిచేశాడు. మనం మన చర్చ ద్వారా పరివర్తన సమస్యాని పిలవబడుతున్న దానిని సరైన దృక్పథంలో ఉంచడానికి ప్రయత్నించాము.
తదుపరి మనం సంక్షోభాలను పరిశీలించే ముందు మూలధన సర్క్యూట్తోనూ పెట్టుబడిదారీ పంపిణీ(సర్క్యులేషన్)తోనూ వ్యవహరిస్తాము.
గమనికలు– ప్రస్తావనలు..
1 పై అధ్యాయం-2, pp. 14–25.
2 K. Marx, Capital, Vol. I, International Publishers, 1967, p. 307.
3 K. Marx, Capital, Vol. III, p. 153.
4 Ibid., p. 142; see also p. 175.
5 పెట్టుబడి మూడవ సంపుటిలో వివరించిన మార్క్స్ మరింత క్లిష్టమైన ధర నిర్ధారణ సిద్ధాంతం సంపుటి ఒకటిలోని అతని విలువ సిద్ధాంతానికి పూర్తిగా అననుకూలమైనదనీ, సంపుటి ఒకటిలోని విలువ సిద్ధాంతం తప్పని గుర్తించిన తరువాత మార్క్స్ ఉత్పత్తి ధర మొదలైన వాటిని సంపుటి మూడులో వ్రాశాడని అనేక సందర్భాలలో పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్తలు బలంగా ప్రకటించారు. ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు.
పెట్టుబడి సంపుటి ఒకటిని ప్రచురించడానికి ముందు పెట్టుబడి సంపుటి మూడు చిత్తు ప్రతిని(ముసాయిదాను) పూర్తి చేయడంమే కాదు, ధరల నిర్మాణం పూర్తి సిద్ధాంతాన్ని అందించే పనిలో– విలువ నియమ సాధారణ రూప అసమర్ధత గురించి సంపుటి ఒకటిలో మనకు నిర్దిష్ట సూచనలు ఉన్నాయి.
ఉదాహరణకు, పై భాగంలోని మార్క్స్ మొదటి ఉదాహరణను(కొటేషన్‌ను), సంపుటి ఒకటిలో ఆ వాక్యాలను అనుసరించి వచ్చిన మొత్తం పేరాను చదవండి.
6 Marx, Capital, Vol. III, p. 164.
7 P.M. Sweezy, పెట్టుబడిదారీ అభివృద్ధి సిద్ధాంతం, మంత్లీ రివ్యూ ప్రెస్, 1942 అధ్యాయం 7, అక్కడ ఉదాహరించిన ఇతర ఉదాహరణలను చూడండి.
8 ప్రాథమిక సూచన పీ శ్రాఫ్ఫా సరుకుల ద్వారా సరుకుల ఉత్పత్తి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 1960. స్పష్టమైన గనితేతర వివరణల(ప్రదర్సనల) కొరకు జాన్ రాబిన్సన్ సంకలిత ఆర్ధిక పత్రాలు, సంపుటి 3. మెక్‌మిలన్,1965;లోని ‘విలువ సిద్ధాంతం పునః పరిశీలన’; జాన్ రాబిన్సన్ ’ఆర్ధిక సిద్ధాంతం ఔచిత్యం, మంత్లీ రివ్యూ, సంపుటి 22, నం.8, జనవరి, 1971; R. మీక ‘శ్రాఫ్ఫాస్’ అర్ధశాస్త్రం, సిద్ధాంతం, చాప్మన్– హాల్, 1967లోని శాస్త్రీయ రాజకీయ ఆర్ధిక వ్యవస్థ పునరావాసం చూడండి. మంచి సర్వ్ కోసం MH డాబ్మన్ ఆడంస్మిత్ నుంచి విలువ– పంపిణీ సిద్ధాంతాలు, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్, 1973 చూడండి.
విలువ పెట్టుబడిదారీ సిద్ధాంతాల ప్రారంభ విమర్శ కోసం NI బుఖారిన్ ‘పనీ పాటా లేని వర్గం వారి అర్ధ శాస్త్రం’ మంత్లీ రివ్యూ ప్రెస్, 1973. (The basic reference is P. Sraffa, Production of Commodities by Means of Commodities, Cambridge University Press, 1960. For lucid, non-mathematical expositions, see: Joan Robinson, A Reconsideration of the Theory of Value, in Collected Economic Papers, Vol. 3, Macmillan, 1965; Joan Robinson, The Relevance of Economic Theory, Monthly Review, Vol. 22, No. 8, January 1971; and R. Meek Sraffas Rehabilitation of Classical Political Economy, in Economics and Ideology, Chapman and Hall, 1967. For a good survey, see M.H. Dobb, Theories of Value and Distribution since Adam Smith, Cambridge University Press, 1973. For an early critique of bourgeois theories of value, see N.I. Bukharin, Economic Theory of the Leisure Class, Monthly Review Press ,1973.)
9 జాన్ రాబిన్సన్ ఆర్ధిక మతవిశ్వాసాలు, మేక్మిలాన్, 1971, పరిచయం– అధ్యాయాలు 1, 3; ఇంకా జాన్ రాబిన్సన్ ‘ఆర్ధికవృద్ధి సిద్ధాంతం’ బాసిల్ బాల్క్వేల్, 1962లోని వ్యాసాలు ‘సాధారణ ధరలు’ చూడండి. (See Joan Robinson, Economic Heresies, Macmillan, 1971, Introduction and Chapters 1 and 3; also Joan Robinson, ‘Normal Prices’, in Essays in the Theory of Economic Growth, Basil Balckwell, 1962.)
10 మంచి వివరణ (ప్రదర్సన) కొరకు: J క్విర్క్, R సపోస్నిక్ల , సాధారణ సమతుల్యం, సంక్షేమ ఆర్ధికవిధానం, McGraw-Hill, 1968 చూడండి. (see J. Quirk and R. Saposnik, Introduction to General Equilibrium and Welfare Economics, McGraw-Hill, 1968.)
11 Marx, Capital, Vol. III, p. 186.
12 Quirk and Saposnik, General Equilibrium.
13 శ్రమశక్తిని కార్మికుడు అమ్మిన సరుకనే భావనతో, ఆ విధంగా అదనపు విలువ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంతో మార్క్స్ ఒక ముఖ్యమైన పురోగతిని సాధించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
14 అధో గమనికలు(ఫుట్ నాట్లు)8, 9లలో పైన ఉదాహరించిన వాటితో పాటు, EK హంట్– జెస్సీ స్చ్వార్జ్ల అర్ధశాస్త్రంపై విమర్శ, పెంగ్విన్, 1973, MH దొబ్ మునుపటి రచన, రాజకీయ అర్ధశాస్త్రం– పెట్టుబడిదారీ విధానం రౌట్లేడ్జ్, కాగన్ పాల్, 1940లను కూడా మనం ప్రస్తావించవచ్చు(we may also mention here E.K. Hunt and Jesse Schwarz (eds.), Critique of Economic Theory, Penguin, 1973, and an earlier work of M.H. Dobb, Political Economy and Capitalism, Routledge and Kegan Paul, 1940.)
15 ప్రత్యేకించి ఇంతకు ముందు ఉదాహరించిన జాన్ రాబిన్సన్ రచనను చూడండి.
16 Marx, Capital, Vol. III, p. 180.
17 Ibid., p. 181.
18 Ibid., p.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 48వ భాగం, 47వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
