న్యూఢిల్లీ: 75 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత పదవి నుంచి తప్పుకోవడాన్ని పరిశీలించాలని నరేంద్ర మోదీకి సంకేతమిస్తూ ఒకప్పుడు వార్తల్లోకి ఎక్కిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ (అధిపతి) మోహన్ భగవత్ (75) జెన్ జీ (15 నుంచి 30 మధ్య వయస్సులో ఉన్నవారు) ఆలోచనా విధానంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
స్పష్టమైన డిమాండ్‌తో సాగిన యువజన ఉద్యమంపై ఏమి చెప్పాలనే దానిపై సంఘపరివార్ అయోమయంలో పడింది- కోపంతో ఉన్న యువకుల పక్షాన నిలబడాలా, లేదా దాపరికంతో ఉండాలా, లేదా “సుస్థిరత” పేరిట తమ సంతానం పట్ల పెద్దల “నియంత్రణ” గురించి వాదించాలా అన్న మీమాంసలో పడింది.
హైదరాబాద్‌లో విశ్వ మాంగల్య సభ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, నేటి యువత ధోరణులకు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని, “భావోద్వేగంతో” ఉన్నారని అన్నారు. వారు “ప్రశాంతంగా మనస్సు పెట్టి” ఆలోచించడం లేదని అన్నారు.
“జెన్ జీ మంచిదే, అనుకూలమైనదే కానీ స్వతహాగా భావోద్వేగాలు గలవారు. వారు ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించరు. స్పష్టంగా కనిపించే నిజాయితీ వారితో ఉన్నప్పుడు వారు దానికే ఆకర్షితులవుతారని” భగవత్ చెప్పుకొచ్చారు.
మహిళా విముక్తి ఉద్యమంపై విమర్శలు..
యువత గురించి తన పరిశీలనను సామాజిక మార్పుతో కలుపుతూ, భారత్‌లో స్వాతంత్ర్యం పొందామని, మహిళలకు హక్కులు సాధించాలనే ఉద్యమానికి యువకుల్లో ఎక్కువగా అంగీకారం లభించిందని, అవి కూడా చెడు వార్తలే అని ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ పేర్కొన్నారు.
“స్త్రీ ముక్తి ఆందోళన్ మొదలై క్రమంగా విస్తృతంగా అంగీకారం పొందడం జరిగింది- దాంతో ఒక దశ దాటిపోయింది. ఆ తర్వాత, తాము తప్పుడు పంథాలో అడుగుపెట్టామని, దేశానికి చెందిన ఒకటి రెండు తరాలను నాశనం చేశామని ఆ ఉద్యమ ప్రతిపాదకులు గ్రహించారని” భగవత్ చెప్పారు.
ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్గా భగవత్ మార్చి 21, 2009 నుంచి కొనసాగుతున్నారు.
సీజేపీ ఉద్యమ మద్దతుదారుల జాబితా..
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇచ్చిన పిలుపు మేరకు జంతర్ మంతర్ ఉద్యమానికి మద్దతు తెలిపిన వారిని “వివాదాస్పద వ్యక్తులు”గా పేర్కొంటూ, ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ జాబితాను తయారు చేసింది.
వివిధ దశల్లో మద్దతు తెలుపుతూ వివిధ రంగాల నుంచి ప్రముఖ ప్రజా వ్యక్తులు “సీజేపీ నేతృత్వాన ఉద్యమ ప్రొఫైల్‌ను విస్తరించారని” 11 మంది సభ్యుల జాబితా పేర్కొంది. వారు పాల్గొనడంతో నిరసన లక్షణం నిర్వచనం మారిపోయింది. దాంతో నిరసనలు ముగిసిన తర్వాత కూడా రాజకీయ పరిశీలకులు, మీడియా సంస్థలు, విస్తృతంగా ప్రజల దృష్టిని సుస్థిరం చేసుకుంది.
జాబితాలో ఉన్న ప్రముఖులు..
జాబితాలో మొదటి స్థానంలో “టెలివిజన్ వ్యక్తి” రఘు రామ్, ఆ తర్వాత సంయుక్త కిసాన్ మోర్చా, మూడవ స్థానంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఉన్నారు.
ఎంపీల జాబితాలో బ్రిట్టాస్ పైన ఉన్నారు. “రాజ్యాంగబద్ధమైన అధికారులకు సంబంధించి తన శాసనపరమైన చొరవ, జాతీయ సంస్థలపై ఆయన వ్యాఖ్యలను అనేక మంది ఎత్తి చూపుతూ ఇవి జాతీయ సమగ్రతను బలహీనపర్చగలవని” అన్నారు.
బ్రిట్టాస్ తర్వాత రచయిత్రి అరుంధతీ రాయ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, పారదర్శకత కార్యకర్త అంజలీ భరద్వాజ్, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్, ఆశ్చర్యకరంగా జాబితాలో 11వ స్థానంలో వాతావరణ కార్యకర్త, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఉన్నారు.
“నిరసనలో ఆయన పాల్గొనడంపై మితవాద వ్యాఖ్యాతల నుంచి అనేక విమర్శలు వచ్చాయి, సీజేపీతో ఆయన జతకట్టడాన్ని ప్రస్తుతం కొనసాగుతున్న జాతి వ్యతిరేక నమూనాలో భాగంగా అనేక మంది చూస్తున్నారని” జాబితా పేర్కొంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
