భారతదేశ ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ అధిక సుంకాలపై భారత ఎగుమతి సంస్థల సమాఖ్య తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. దీని కారణంగా ధర పోటీతత్వం క్షీణించిందని తెలియజేసింది. దీంతో తిరుపూర్, నోయిడా, సూరత్‌లోని వస్త్ర తయారీదారులు ఉత్పత్తిని నిలిపివేశారని పేర్కొన్నది.
న్యూఢిల్లీ: భారతదేశ ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకం ఆగస్టు 27 బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అదనంగా 25 శాతం సుంకం విధించాలనే అమెరికా నిర్ణయం వల్ల, ఖర్చు- పోటీతత్వం తగ్గింది. దీంతో తిరుపూర్, నోయిడా, సూరత్‌లోని వస్త్ర తయారీదారులు ఉత్పత్తిని నిలిపివేశారు.
భారతీయ వస్తువులపై అమెరికా విధించిన అధిక సుంకాలపై ఆగస్టు 26న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఈఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఈ భారీ సుంకాల కారణంగా ధర పోటీతత్వం క్షీణిస్తున్నందున- తిరుపూర్, నోయిడా, సూరత్‌లోని వస్త్ర తయారీదారులు ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిపింది.
‘ప్రభుత్వ సహాయ తక్షణ అవసరం’ ఉందని ఆ సంస్థ నొక్కి చెప్పింది. అమెరికా విధించిన సుంకాల వల్ల ఆసియాలో భారతదేశం అత్యధిక సుంకాలను ఎదుర్కొంటుంది.
ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై అమెరికా సుంకాలు 50%కి పెరిగాయి. ఈ అడుగు వల్ల తన అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌కు భారతీయ వస్తువుల ప్రవాహాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఎఫ్ఐఈఓ అధ్యక్షుడు ఎస్సీ రాల్హాన్ అన్నారు.
దీనిని ఒక ఎదురుదెబ్బగా రాల్హాన్ అభివర్ణించారు. అంతేకాకుండా, అమెరికాకు చేసే భారతదేశ ఎగుమతులపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు.
30- 35% ధరల అంతరాలు చైనా, వియత్నాం, కంబోడియా, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇతర ఆగ్నేయ- దక్షిణాసియా దేశాల పోటీదారులకు హాని కలిగిస్తాయని ఆయన అన్నారు.
తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసిన ఎఫ్ఐఈఓ..
‘భారతీయ వస్తువులపై అమెరికా ప్రభుత్వం అదనంగా 25% సుంకం విధించడంపై ఎఫ్ఐఈఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది 2025 ఆగస్టు 27 నుంచి అమలులోకి వచ్చే అనేక ఎగుమతి వర్గాలపై మొత్తం సుంకాన్ని 50%కి పెంచుతుంది’ అని ఆయన అన్నారు.
‘తిరుపూర్, నోయిడా, సూరత్‌లలో వస్త్ర తయారీదారులు ఖర్చు పోటీతత్వం తగ్గింది. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు’ అని ఆయన అన్నారు.
వియత్నాం, బంగ్లాదేశ్ నుంచి తక్కువ ధర పోటీదారుల కంటే ఈ రంగం వెనుకబడి ఉందని రాల్హాన్ అన్నారు.
‘సీఫుడ్, ముఖ్యంగా రొయ్యల కోసం- భారత సముద్ర ఆహార ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ దాదాపు 40% వాటా కలిగి ఉంది. దీని వల్ల సుంకాల పెరుగుదల నిల్వ చేసిన పదార్థాలకు నష్టం కలిగించే ప్రమాదం ఉంది. దీంతో పాటు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. మొత్తం మీద భారతీయ రైతులకు ఇబ్బందులను కలిగిస్తుంది’ అని ఎఫ్ఐఈఓ ప్రకటన పేర్కొంది.
ప్రధానంగా యూరోపియన్, ఆగ్నేయ, మెక్సికన్ ఉత్పత్తిదారులతో పోలిస్తే, ఇతర శ్రమ-ఇంటెన్సివ్ ఎగుమతి రంగాలైన తోలు, సిరామిక్స్, రసాయనాలు, హస్తకళలు, తివాచీలు మొదలైన వాటిలో ఈ పరిశ్రమ పోటీతత్వంలో తీవ్ర క్షీణతను ఎదుర్కొంటుందని రాల్హాన్ పునరుద్ఘాటించారు. ఆలస్యం, ఆర్డర్ రద్దు, తగ్గుతున్న ఖర్చు ప్రయోజనాలు ఈ రంగాలపై ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుత పరిణామాల రీత్యా ఎఫ్ఐఈఓ చీఫ్ ‘వర్కింగ్ క్యాపిటల్, దాని ప్రవాహాన్ని నిర్వహించడానికి వడ్డీ రాయితీ పథకాలు, ఎగుమతి క్రెడిట్ మద్దతును పెంచడంతో సహా తక్షణ ప్రభుత్వ సహాయం’ కోసం పిలుపునిచ్చారు.
వస్త్రాలు, రత్నాలు, ఆభరణాల నుంచి సముద్ర ఆహారం, ముఖ్యంగా రొయ్యలు- కార్పెట్లు, ఫర్నిచర్ వరకు తక్కువ మార్జిన్, శ్రమతో కూడిన వస్తువుల ఎగుమతులు యూఎస్ మార్కెట్లో లాభదాయకంగా మారవచ్చు. ఎందుకంటే సుంకాలు విధించే అధిక ధరలు అనివార్యంగా యూఎస్ మార్కెట్లో విధించబడతాయి. ఇది భారతదేశంలో తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఇప్పటికే తీవ్రమైన నిరుద్యోగ సంక్షోభం, గత రెండు సంవత్సరాలుగా నైపుణ్యం కలిగిన కార్మికుల తొలగింపు, అన్ని రంగాలలో స్తబ్దుగా ఉన్న వేతనాలతో సతమతమవుతోంది.
2025- 26లో భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతుల విలువ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 40-45% తగ్గవచ్చని నిపుణులు అంచనా వేశారు. విలువ పరంగా అమెరికాకు ఎగుమతుల్లో మూడింట రెండు వంతుల ఎగుమతులు 50% సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల కొన్ని వర్గాలలో వాస్తవ సుంకం రేట్లు 60% కంటే ఎక్కువగా ఉన్నాయి.
థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ)అంచనా ప్రకారం దీని వల్ల అమెరికాకు ఉత్పత్తుల ఎగుమతులు ఈ సంవత్సరం 87 బిలియన్ల డాలర్ల నుంచి, 2024- 25లో దాదాపు 49.6 బిలియన్ డాలర్లకు తగ్గుతాయి.
కొత్త పథకం కింద అల్లిన, నేసిన బట్టలు రెండూ అత్యధిక సుంకాల రేట్లను ఆకర్షిస్తాయని, ఇతర వస్త్రాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని వైర్ ఇంతకు ముందే అంచనా వేసింది.
“మూడు దేశాల మధ్య జరిగే పోరాటంలో, ఒక దేశం కేవలం సంధానకర్తగా మాత్రమే ఉన్న సమయంలో, లక్ష్యాన్ని సాధించడానికి మూడవ దేశంపై ఒత్తిడి తీసుకురావడం ఎలా న్యాయమైనది?” అని పన్ను నిపుణుడు వేద్ జైన్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.
ఇతర సీనియర్ దౌత్యవేత్తలు మోడీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్రంప్ పునర్వ్యవస్థీకరణను నిర్వహించిన తీరును ప్రశ్నించారు. దీనివల్ల ప్రభుత్వం అధిక సుంకాలకు పూర్తిగా సిద్ధంగా లేదు. భారతదేశానికి సమాధానం అవసరమని మాజీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ కట్జు అన్నారు.
అనువాదం: కృష్ణనాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
