కొంతమంది న్యూయార్క్ ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ముందు చివరి మూడు ఏళ్లలో అంత కష్టపడి పనిచేసేవారిగా ఎందుకు మారుతారు?
2009 మరియు 2012లో చేసిన రాష్ట్ర స్థాయి సంస్కరణలను రద్దు చేయాలని న్యూయార్క్ లోని ప్రభుత్వ యూనియన్లు కోరుతున్నాయి. ఈ సంస్కరణలు “పెన్షన్ పెరుగుదల పద్ధతిని పరిమితం చేశాయి.
ఇక్కడ కార్మికులు తమ పదవీ విరమణ చెల్లింపులను పెంచుకోవడానికి తమ కెరీర్ ముగింపులో ఓవర్‌టైమ్ పనిని భారీగా పెంచుకుంటారు.
ఆల్బానీకి చెందిన ఎంపైర్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ యొక్క కొత్త నివేదిక ప్రకారం, కొంతమంది కార్మికులు వారి జీతాల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నారు.
పెన్షన్ పెంపుదల ఎలా?
2010 కి ముందు సర్వీసులో చేరిన చాలా మంది న్యూయార్క్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ ప్రయోజనాలు వారు సర్వీసులో పని చేసిన కాలం మరియు చివరి మూడు సంవత్సరాల ఆదాయాల ఆధారంగా లెక్కించ బడతాయి. ఆ ఆదాయాలలో సాధారణ వేతనం మరియు ఓవర్‌టైమ్ కూడా ఉంటాయి.
దీని అర్థం పదవీ విరమణకు ముందు చివరి మూడు సంవత్సరాలలో తమ వేతనాన్ని పెంచుకోవడానికి కార్మికులకు కొన్ని ప్రోత్సాహకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సాధ్యమైనది ఎక్కువగా ఓవర్ టైం పనిచేయడం. ఇది సీనియారిటీ ఆధారంగా స్వచ్ఛంద ఓవర్ టైమ్ గంటలకు ప్రాధాన్యత నిచ్చే యూనియన్ ఒప్పందాల ద్వారా సులభం అవుతుంది.
ఎంపైర్ సెంటర్ నివేదిక 2024లో పదవీ విరమణ చేసిన న్యూయార్క్ స్టేట్ పోలీస్ మరియు సఫోల్క్ కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను పరిశీలించింది.
వారు ఉద్యోగంలో తమ చివరి మూడు ఏళ్లలో, అంతకుముందు కంటే సుమారు 75 శాతం ఎక్కువ ఓవర్ టైమ్ పనిచేశారు. అలా పని చేసిన వారిలో నాల్గవ వంతు మందికి వారి పెన్షన్లు వారి చివరి ప్రాథమిక వేతనాల కంటే ఎక్కువ అయినాయి.
న్యూయార్క్‌లో పబ్లిక్ పెన్షన్ ప్రయోజనాలపై రాష్ట్ర లేదా స్థానిక ఆదాయపు పన్ను ఉండదు.
2010 లేదా ఆ తర్వాత నియమితులైన ఉద్యోగులకు వర్తించే సంస్కరణలు ‘పెన్షన్ పెంచుకునే పద్ధతులలో కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి.
ప్రభుత్వ యూనియన్లు ఈ పరిమితులను తొలగించాలని, కార్మికులు తమకు నచ్చినంతగా పెన్షన్ మొత్తాన్ని పెంచుకోవడానికి అనుమతించాలని కోరు కుంటున్నాయి.
న్యూయార్క్ రాష్ట్ర రాజ్యాంగం ఒకసారి అమలులోకి వచ్చిన పెన్షన్ ప్రయోజనాలను తగ్గించ డాన్ని నిషేధిస్తుంది.
ఈ నిబంధన ఎంత కఠినమైన దంటే, నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్ర శాసనసభ్యులు కూడా తమ పూర్తి పెన్షన్‌ను జైలులో ఉండి కూడా పొందుతున్నారు.
పెన్షన్ సంస్కరణలు చేపట్టినప్పుడు, పెన్షన్ తగ్గుదల కేవలం భవిష్యత్తు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ పెంచిన ప్రయోజనాలను గతకాలం నుండి వర్తించేలా (విత్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్)అమలు చేయవచ్చు. న్యూయార్క్ పబ్లిక్ పెన్షన్ సిస్టం పొరుగు రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. అందువల్లనే యూనియన్లు సంస్కరణలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 2009కి ముందు ఉన్న పెన్షన్ విధానం అమలు చేసినట్లయితే ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ఎక్కువ వస్తుంది. విపరీతంగా ధరలు, జీవన వ్యయం పెరిగి బాధలు అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో పెన్షన్ పెరుగుదల డిమాండ్ తప్పనిసరి అయింది.
వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక
మే 7-2026 సౌజన్యంతో ,
ఆర్.లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
