సర్ పూర్తయిన లేదా ముసాయిదా జాబితాను ప్రచురించిన 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల కార్యాలయాలను హిందుస్థాన్ టైమ్స్ సంప్రదించింది.
11 రాష్ట్రాలకు చెందిన అధికారులు స్పందించగా, అందులోంచి ఆరుగురు మాత్రమే అనుమానిత విదేశీయుల వివరాలు ఇచ్చారు.
న్యూఢిల్లీ: “విదేశీ అక్రమ వలసదారుల” తొలగింపు కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ఉద్దేశాల్లో ఒకటని భారత ఎన్నికల సంఘం నొక్కి చెప్పిన ఏడాది తర్వాత, అలాగే సర్ ప్రారంభానికి కారణం అదేనని ప్రభుత్వ ప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక ప్రసంగాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో- 9.86 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆరు రాష్ట్రాల్లో కేవలం 1,600 మంది పేర్లను మాత్రమే విదేశీయులుగా గుర్తించినట్లు హిందుస్థాన్ టైమ్స్‌కు చెందిన హిమాన్షీ దహియా రాసిన ఒక నివేదిక తెలియజేస్తోంది.
“గుర్తించడం, తొలగించడం, బహిష్కరించడం” అనే తన విధానంలో భాగమే సర్ అని బీజేపీ బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తోంది.
బిహార్ సర్ ద్వారా కేవలం “చొరబాటుదారులనే” తొలగించడం జరిగిందని సరిగ్గా సంవత్సరం క్రితం, 2025లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
“వారు భారత జాతీయులైతే వారి సాక్ష్యం ఇచ్చేవారు. మీకు గానీ నాకు గానీ ఎలాంటి సమస్య ఉండదు. ఏది అడిగితే అది మన పత్రాలను అందజేస్తాము. తొలగించబడిన వారిలోంచి కేవలం మూడు విజ్ఞప్తులు మాత్రమే వచ్చాయి. ఏదైనా తప్పు ఉంటే విజ్ఞప్తులను దాఖలు చేయవచ్చో లేదో? అంటే తొలగించబడిన వారు భారత జాతీయులు కాదని దాని అర్థం. వారి పేర్లనే తొలగించారు” అని షా అన్నారు.
ఓటర్ల సంఖ్యతో, తొలగించిన వారితో పోలిస్తే.. ఈ ప్రక్రియలో ఇప్పటివరకు గుర్తించిన అనుమానిత విదేశీ జాతీయుల సంఖ్య చాలా తక్కువ.
సర్ ఇప్పుడు 13 కోట్ల పేర్లను తొలగించింది. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను ప్రతిపక్ష పార్టీలు, యువకులు డిమాండ్ చేస్తున్నారు.
సర్ పూర్తయిన లేదా ముసాయిదా జాబితాను ప్రచురించిన 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల కార్యాలయాలను హెచ్‌టీ సంప్రదించింది.
11 రాష్ట్రాల నుంచి అధికారులు ఈ పత్రికకు స్పందించారు. కేవలం ఆరుగురు మాత్రమే అనుమానిత విదేశీయుల వివరాలను దహియాకు ఇచ్చారు.
నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ డేటాను నిర్వహించడం లేదని చెప్పాయి. వాటిలో ఒడిశా కూడా ఉంది. “జాబితాలో అనుమానిత విదేశీ జాతీయులను కనుగొన్నాం కానీ ఎలాంటి లెక్కలను ఉంచలేదు” అని ఒడిశా రాష్ట్ర అధికారులు చెప్పినట్లు తెలిసింది.
“ఈ డేటాను విడిగా సేకరించాలని రాష్ట్రాలను అడగలేదు” అని సీనియర్ ఎన్నికల కమిషన్ అధికారి అన్నట్లు కథనం తెలియజేసింది.
“ఈ విషయంపై ఉమ్మడిగా లేదా రాష్ట్రాలవారీగా డేటా మా వద్ద లేదు. అలాంటి కేసులు ఏమైనా వస్తే వాటిని ఏఎస్డిడిఓలో ‘ఇతరులు’ అనే కేటగిరీలో ఉంచారు. అయితే ఈ వివరాలను అందించాలని ఈసీఐ అడగలేదు” అని ఆ అధికారి చెప్పారు.
కర్ణాటకలోని ఉత్తర బెంగళూరులో 545 నేపాలీ పౌరులతో సహా తొలగించడానికి 716 విదేశీ జాతీయులను గుర్తించినట్లు సీఈఓ కార్యాలయం తెలిపింది.
రాష్ట్రంలో గణన ఫారాలు అందజేయక ముందు ఉన్న 5.54 కోట్ల మంది ఓటర్లలోంచి ఇప్పుడు 99.77 లక్షల మంది ఓటర్ల పేర్లు తగ్గిపోయాయి.
తన కార్యాలయం “విదేశీయులను గుర్తించిందని”, “వారి సంఖ్య కచ్చితంగా 1,000కి తక్కువే ఉందని” కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి వి అన్బుక్ కుమార్ చెప్పారు.
“విదేశీ జాతీయులను” నమోదు చేసిన రాష్ట్రాల వివరాలను అందించడానికి హెచ్‌టీ కథనం ముందుకు వచ్చింది.
“ఈ డేటాను మేము ఎలా సమకూర్చాలి? ఇది సాధ్యపడే పనేనా?” అని ఉత్తరాఖండ్ సీఈఓ బీవీఆర్సీ పురుషోత్తం ప్రశ్నించారు. “ఇది ఎన్నికల అధికారుల పరిధి దాటిన విషయం” అని అన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
