అవినీతి, మనీ లాండరింగ్ కేసులపై విచారణ ఎదుర్కొంటున్న బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి దేశం నుంచి పారిపోయిన తర్వాత, అతని ఆచూకీపై 24 గంటలుగా ఉన్న సందిగ్ధతకు తెరదించుతూ ఫ్లావియో బోల్సొనారో అమెరికా చేరుకున్నారు.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన బోల్సొనారోపై కేసులు ఉన్న దృష్ట్యా దేశం విడిచి వెళ్లకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిషేధం విధించారు.
ఈ న్యాయపరమైన ఆదేశం క్రిమినల్ విచారణలతో ముడిపడి ఉంది. అతన్ని పారిపోయే ప్రమాదం ఉన్న వ్యక్తిగా(ఫ్లైట్ రిస్క్) న్యాయస్థానం ప్రకటించింది.
జైలు పాలైన మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కుమారుడు, మితవాద రాజకీయ నాయకుడైన ఫ్లావియో బోల్సొనారో తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి 48 గంటల పాటు దేశంలో రహస్యంగా నాటకీయ పర్యటన చేశారు.
అర్జెంటీనా మీదుగా పయనం
అక్టోబరు 27న రాత్రి 10.50 గంటలకు రోడ్డు మార్గం ద్వారా అర్జెంటీనాలోకి ప్రవేశించారని, ఆ తర్వాత 40 నిమిషాలకు ఈక్వెడార్ నగరమైన గ్వాయాక్విల్ వెళ్లే ప్రైవేట్ జెట్ ఎక్కారని అర్జెంటీనా వలస అధికారులు తెలియజేశారు.
సెనేటర్, ఆయన కుటుంబం గల్ఫ్‌స్ట్రీమ్ G400 విమానంలో దేశం విడిచి వెళ్లినట్లు అర్జెంటీనా వార్తా వెబ్సైట్ ‘ఇన్ఫోబే’ పేర్కొంది.
ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్ ‘ఫ్లైట్ అవేర్’ ప్రకారం, అక్టోబరు 28 ఉదయం అదే విమానం ఈక్వెడార్ నుంచి బయలుదేరి కరీబియన్ సముద్రాన్ని దాటి మయామి వైపు వెళ్లింది.
ఓపా-లాకా ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో తీసిన వీడియోలు, ఫోటోల ఆధారంగా, స్థానిక కాలమానం ప్రకారం అక్టోబరు 28 ఉదయం 9 గంటల ప్రాంతంలో మయామిలో ఒక ప్రైవేట్ జెట్ నుంచి ఫ్లావియో బోల్సొనారో కుటుంబంతో దిగారు.
పాస్‌పోర్ట్ రద్దు – అమెరికా వీసా
మయామి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక తీర ప్రాంతం. లొంగిపోవడానికి ఇచ్చిన గడువును ధిక్కరించినందుకు బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు బోల్సొనారో పాస్‌పోర్ట్‌లను రద్దు చేశారు.
లూలా విజయాన్ని ఇంకా గుర్తించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనకు మిత్రుడైన బోల్సొనారోకు వీసా మంజూరు చేస్తారని ట్రంప్ అధికారులు తెలియజేశారు. దీంతో అమెరికా-బ్రెజిల్ సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది.
లూలా విమర్శలు
బోల్సొనారో చట్టపరమైన రెండు విచారణలను ఎదుర్కొంటున్నారు. ఒకటి 10 బిలియన్ డాలర్ల బ్యాంకు కుంభకోణానికి సూత్రధారిగా ఉన్నారనే ఆరోపణ. మరొకటి బోల్సొనారోతో పాటు ఒక స్నేహితుడికి సంబంధించి అనుమానాస్పద మనీ లాండరింగ్ కేసు.
ఈ పరిస్థితుల్లో బోల్సొనారో దేశం విడిచి వెళ్లడం “సిగ్గుచేటు” అని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నారు.
‘ఫైనాన్షియల్ టైమ్స్ యూరప్’ సౌజన్యంతో.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
