♦ గాజా మారణహోమం కేసులో ఇజ్రాయెల్‌కు మద్దతును ఉపసంహరించుకున్న జర్మనీ
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాంబుల వర్షాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ దిశ నుంచి మరిన్ని క్షిపణులు దూసుకువస్తాయన్న ముందస్తు అంచనాతో ఉత్తర ఇజ్రాయెల్ వ్యాప్తంగా వందలాది ఎయిర్ సైరెన్లు మోగుతున్నాయి.

ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ల దాడి, దానికి ప్రతిగా ఇరాన్ భద్రతా దళాల ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో సంఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.
ఈ రగులుకున్న సంఘర్షణ మార్చి 20న 21వ రోజుకు చేరుకుంది.
సౌత్ పార్స్ గ్యాస్ నిక్షేపాలపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారంగా ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ గ్యాస్ కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. ఆ దేశపు ద్రవీకృత సహజ వాయువు ఎగుమతుల సామర్థ్యానికి ఈ దాడి భారీ గండి కొట్టవచ్చని నిపుణులు అనుకుంటున్నారు.
మరో ముఖ్యమైన పరిణామంలో, గాజా మారణహోమం కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్‌కు ఇస్తున్న మద్దతును జర్మనీ ఉపసంహరించుకుంది.
2023లో దక్షిణాఫ్రికా తొలిసారిగా ఈ విచారణను ముందుకు తెచ్చినప్పుడు జర్మనీ తీసుకున్న వైఖరితో పోలిస్తే, ప్రస్తుత నిర్ణయం ఆ దేశ పంథాలో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
