♦ ఇజ్రాయెల్ ‘సౌత్ పార్స్’ దాడితో ఇంధన మార్కెట్లలో కల్లోలం
♦ గల్ఫ్ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు
ఇరాన్‌పై సాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్లో కనీసం 1,300 మంది, లెబనాన్‌లో 960 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆయా దేశాల అధికారులు వెల్లడించారు.
అలాగే 13 మంది అమెరికా సైనికులు మరణించారని, సుమారు 200 మంది గాయపడ్డారని అమెరికా సైన్యం తెలిపింది.

ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన ‘సౌత్ పార్స్’గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ ఇక దాడులు చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.
అయితే ఇరాన్ గనక మళ్లీ ఖతార్‌పై దాడికి తెగబడితే, అమెరికా కఠినంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ గ్యాస్ ఫీల్డ్ మొత్తాన్ని “భారీ స్థాయిలో పేల్చివేస్తామని” ఆయన హెచ్చరించారు.
యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లలో కల్లోలం రేగడం, మరోవైపు ఇరాన్ క్షిపణులు ఖతార్‌పై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఈ హెచ్చరికలు చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
