♦ లెబనాన్‌లో పది లక్షల మందికి పైగా నిరాశ్రయులు
♦ కాల్పుల విరమణను తోసిపుచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి
“ఇజ్రాయెల్ భూభాగం వైపు హిజ్బుల్లా రాకెట్ల ప్రయోగానికి” స్పందనగా దక్షిణ లెబనాన్‌పై “దాడుల పరంపరను” మొదలుపెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా సంక్షోభంలో కూరుకుపోతూనే ఉంది. దీనివల్ల వివిధ దేశాల్లో 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలపై, ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.
ఇరాన్ భద్రతా అధికారి అలీ లారిజానీని ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత, ఇరాన్ తన దాడులను ముమ్మరం చేస్తూ ఇజ్రాయెల్‌పై మరిన్ని స్ట్రైక్స్ చేసింది.
మార్చి 18న టెల్ అవీవ్‌పై ఇరాన్ జరిపిన దాడిలో పగిలిన ముక్కలు తీవ్రంగా గుచ్చుకోవడం వల్ల ఇజ్రాయెల్‌లో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అల్ జజీరా కథనం పేర్కొన్నది.
ఇదిలా ఉండగా, “ఇజ్రాయెల్ భూభాగం వైపు హిజ్బుల్లా రాకెట్ల ప్రయోగానికి” ప్రతిస్పందనగా దక్షిణ లెబనాన్‌పై “దాడుల పరంపరను” ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
