1995 నవంబర్ 25న న్యూఢిల్లీలో నిర్వహించిన చర్చాగోష్టి కార్యక్రమంలో “పుస్తకాలు- మనిషి”అనే అంశం మీద ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రసంగించారు. గాంధేయవాది నుంచి నెహ్రూవాది ఆ తర్వాత కమ్యూనిస్టుగా తాను ఎలా మారారో ఆ ప్రసంగంలో వివరించారు.
సోదరసోదరీమణులారా, ఈ విషయంపై చాలా మంది ప్రముఖులు ఇంతకు ముందే మీతో మాట్లాడారు. అయినప్పటికీ, నేను కూడా మాట్లాడాలని కోరుతూ నాకోసం సమయం కేటాయించిన మీ గౌరవానికి ధన్యవాదాలు. నేను మాట్లాడాలనే మీ కోరికను ఎంత వరకు నెరవేర్చగలనో నాకు తెలియదు.
‘పుస్తకాలు- మనిషి’ అనేది ప్రస్తుతం ఒక పెద్ద అంశం. నేను పుస్తక ప్రియుడిని. చాలా పుస్తకాలను చదివాను. కొన్ని పుస్తకాలు కూడా రాశాను. సాధారణంగా “మనిషి- పుస్తకాలు” అనే అంశంపై మాట్లాడటం చాలా కష్టం.
“ఏ పుస్తకం నిన్ను ఎక్కువగా ఆకట్టుకుంది? ఏ పుస్తకం నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది?”అని చాలామంది నన్ను అడుగుతుంటారు. అప్పుడు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేనని బదిలిచ్చేవాడిని. నేను ఎన్నో పుస్తకాలను చదివాను. వీటిలో చాలా పుస్తకాలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో తోడ్పడ్డాయి. ఏదో ఒకదాని పేరును నేను చెప్పలేను.
ప్రస్తుతం ‘పుస్తకాలు- మనిషి’ అనే అంశం మీద ప్రసంగిస్తున్నాను కాబట్టి చెపుతున్నాను. నా బాల్యం మొదట్లో– సుమారు తొమ్మిది, పదేళ్ల వయసులో నాకు రెండు పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. ఆ పుస్తకాల గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. అవేంటంటే ఒకటి రుగ్వేదం, రెండవది మహభారతం.
కానీ ఇక్కడ చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. రుగ్వేదాన్ని చదివానని నేను చెప్పలేను. ఎందుకంటే, ఆ పుస్తకంలోని ఒక్క పదానికి కూడా నాకు సరిగా అర్థం తెలియదు. అయితే, ఆరు సంవత్సరాల వయసు వరకు రుగ్వేదంలోని శ్లోకాలను కంఠస్థం చేయించారు. ఆరు సంవత్సరాల నా కాలం వృధా అయ్యింది. కంఠస్థం చేయాలని చెప్పారు– గౌరవంతో నేను అలానే చేశాను. అయినప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత అన్నీ మర్చిపోయాను. నాకిప్పుడేమీ గుర్తుకు లేదు. నా జీవితంలో ఆ సమయం వృధా అయ్యింది.
వాస్తవం ఏంటంటే, ఢిల్లీలో అప్పటి విద్యాశాఖమంత్రి నర్సింహా రావు రుగ్వేదంపై మలయాళ కామెంటరినీ ఎప్పుడైతే విడుదల చేశారో– అప్పుడు ఆ పుస్తక ప్రతిని స్వీకరించాలని నన్ను కోరారు. దీనికి అయిష్టంగానే ఒప్పుకున్నాను. ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి నాకు ఆప్తుడు. “నువ్వు వచ్చి నీకు ఇష్టమైంది మాట్లాడు”అని తను నాకు చెప్పాడు. ఇలాంటి వ్యవహారాలు నాకు ఇష్టముండదని తనకు బాగా తెలుసు. అయినా కానీ పిలిచాడు.
ఆరు సంవత్సరాల పాటు ఏడు, ఎనిమిది, తొమ్మిదేళ్ల చిన్న పిల్లలకు రుగ్వేదం మొత్తాన్ని బట్టి పట్టించారు. కానీ ఏం మిగలలేదు. నేను విసిగిపోయానని తనకు తెలుసు. అయినప్పటికీ “నువ్వు వచ్చి నీకు నచ్చింది మాట్లాడు”అని ఇంకా చెపుతూనే ఉన్నాడు. అక్కడ నేను మాట్లాడాను. నేను అనుభవించిన ఆరు సంవత్సరాల కాలం, ప్రస్తుత యువతరానికి పునరావృతం కాకూడదనేది నా ఏకైక కోరిక.
భారత దేశంలో రుగ్వేదం ఒక ప్రాచీన సాహిత్య రచన. నేను కంఠస్థం చేసే సమయంలో నాకు ఏమి తెలియదు. ఆ తర్వాత కొద్దిగా తెలుసుకున్నాను. కొద్దిగా తెలుసుకోవడమే కాకుండా, దానిని మానవ చరిత్రకు ఎలా అన్వయించాలన్నది కూడా నేర్చకున్నాను.
ఈ క్రమంలోనే మార్క్సిజం అనువర్తనాన్ని కుడా నేర్చుకున్నాను. కౌమర వయసులో ఇలాంటి పుస్తకాలను చదవడం నాకు తీవ్ర వేదనకు గురిచేసింది. కానీ ఇప్పుడు నేను రుగ్వేదాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలుగుతున్నాను. అది ప్రపంచంలోనే ఉత్తమ ప్రాచీన సాహిత్యంలో ఒకటి. అది మతపరమైన పుస్తకం కాదు. అది పద్యాల పుస్తకం.
వాస్తవమేమిటంటే, మలయాళంలో పద్య సంకలనంగా కవి వల్లతోల్(నారాయణ మినన్) రుగ్వేదాన్ని అనువాదం చేశారు. మొత్తం రుగ్వేదం అనువాదం చేయబడింది.
నేను పిల్లాడిగా ఉన్నప్పుడే దీన్ని కఠస్థంగా నేర్చుకున్నాను. వేద శ్లోకాలను బ్రాహ్మణేతరులు వినకూడదని అంటారు. కానీ వల్లతోల్ ఒక బ్రాహ్మణేతరుడు- దాన్ని చదివి, అనువాదం కూడా చేశాడు. అలా చేసినందుకు, తను చెవిటి వాడైపోయాడని కొంతమంది రచయితలు, ప్రజలు చెపుతూ ఉండేవారు. సమాజం అలా మారిపోయింది.
దీని తర్వాత మరో పుస్తకం నాకు పరిచయమైంది. అదే, మలయాళ అనువాద మహభారతం. ఈ పుస్తకాన్ని నేను చాలా ఎక్కువగా ఆనందించాను. మొత్తం మహభారతాన్ని ప్రముఖ కవి వల్లతోల్(నారాయణ మినన్) అనువాదం చేశారు. నాకు అదో అనుభవం. అప్పుడు నా వయసు తొమ్మిది లేదా పదేళ్లు. ఆ పుస్తకం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
అదే నన్ను భారతీయతను లేదా హైందవాన్ని అధ్యయనం చేసేలా చేసింది. దీంతో పాటు ఇతర విషయాలను కుడా అథ్యయనం చేశాను. ఈ సమయంలోనే అనేక మలయాళ పుస్తకాలను చదవడం మొదలుపెట్టాను.
నేను ఇంగ్లిష్ నేర్చుకోవడం ఇంకా మొదలు పెట్టలేదు. రుగ్వేదాన్ని నేను ఎప్పుడైతే కంఠస్తం చేస్తున్నానో, అప్పుడే కొన్నిసంస్కృత కావ్యాలను అధ్యయనం చేయడం మొదలు పెట్టాను. రుగ్వేదాన్ని నేర్పించిన ఉపాధ్యాయులే– సంస్కృత ఉపాధ్యాయులు కూడా. తనే నాకు నేర్పించారు. నేను ఏదో నేర్చుకున్నాను.
అయితే మలయాళ పుస్తకాలు చదవడం మొదలు పెట్టినప్పటి నుంచే నాకు అసలైన విద్య మొదలైంది. ఆ సమయంలో పద్యాలు, నవలలు, డ్రామాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అది 1921- 22 అనుకుంటా, ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఎక్కువ పుస్తకాలను చదివాను.
నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో రుగ్వేదం ఏం చేయలేకపోయింది, మహభారత చేసింది. మలయాళ అనువాద మహభారతాన్ని చదివినప్పుడు , అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
వీటితో పాటు తుంచత్తు ఎజుతచ్చన్, రామాయణ, మహభారతవంటి తదితర ప్రాచీన సాహిత్య పుస్తకాలు; అలాగే ఆధునిక పద్యాలు, నవలలు, డ్రామాలు; ఇతర మలయాళ పుస్తకాలను కూడా అధ్యయనం చేశాను. ఈ అధ్యయనం నాకు మలయాళ భాషను పరిచయం చేసింది. దీని తర్వాతనే 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను పాఠశాలలో చేరాను.
అప్పటివరకు రుగ్వేదంతో పాటు కొన్ని సంస్కృత కావ్యాలను కంఠస్థం చేయడానికి నా జీవితం మొత్తం గడిచిపోయింది. దీంతో పాఠశాలలో చేరేనాటికి నాకు 16 ఏళ్లు వచ్చాయి. అదృష్టవశాత్తు వ్యక్తిగత తరగతుల శిక్షణ వల్ల ఉన్నత, ఏడవ తరగతిలో ప్రవేశానికి అనుమతి లభించింది.
అంతవరకు నేను మలయాళంలో రాయలేక పోయాను. నేను సరిగా మలయాళం చదవగలిగాను కానీ రాయలేకపోయాను.
పాఠశాలలో చేరిన తర్వాతనే ఎక్కువగా చదవడం అలవాటైంది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ పుస్తకాలు– కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా అందుబాటులోని పుస్తకాలన్నీ చదవడం మొదలు పెట్టాను. లైబ్రెరీ పుస్తకాలను క్లాసు టీచరు మాకు ఇచ్చే వారు. నేను ప్రతిసారి ఒక పుస్తకాన్నే తీసుకు వెళ్ళే వాడిని. ఇతర మార్గాల ద్వారా కూడా పుస్తకాల కోసం ప్రయత్నించే వాడిని. నేను విపరీతమైన మలయాళ పాఠకుడిని.
పాఠశాలలో చేరిన సమయానికి నేను ఇంగ్లీష్ పుస్తకాలను, ఇంగ్లీష్ పేపర్లను చదవడం మొదలు పట్టాను. ఆ సమయంలో ది హిందూ ఇంగ్లిష్ పత్రిక ఒక్కటే అందుబాటులో ఉండేది. ఆ పత్రికను రోజు చదివే వాడిని. హైస్కూల్లో నేను థర్డ్, ఫోర్త్ ఫామ్లో ఉన్నప్పుడు– ఇంగ్లీష్ పుస్తకాలు, ఇంగ్లీష్ వార్తా పత్రికలను చదవడం ప్రారంభించాను.
దీని తర్వాత కేరళలో నా గురించి బాగా తెలిసిపోయింది. బయట కూడా తెలిసిపోయినట్టుంది. వార్తా పత్రిక చదవడంతో ఒక రాజకీయ కార్యకర్తగా నేను మారిపోయాను. నాకు జ్ఙాపకం ఉన్నంత వరకు– మాతృభూమి వారానికి మూడు సార్లు మొదలు పెట్టారు– దిన పత్రికగా మార్చడానికి చాలా కాలం ముందు వరకు దీనిని చదివేవాడిని.
దీంతో నాకు రాజకీయ ఉద్యమంతో పరిచయం ఏర్పడింది. గాంధేయవాది సిద్ధాంతాలకు అనుగుణంగా నా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉత్తర గాంధేయవాదిని. కానీ ఆ తర్వాత, నాకు నేను గాంధేయవాది నుంచి నెహ్రూవాదిగా మారిపోయాను. మరోసారి నెహ్రూ నుంచి కమ్యూనిస్టుగా సిద్ధాంతపర మార్పు చోటుచేసుకుంది. ఈ విధంగా నేను అభివృద్ధి చెందాను.
ఆ తర్వాత– చరిత్ర, అర్ధశాస్త్రం, రాజనీతిశాస్ర్తంపై దృష్టిపెట్టాను. ఈ అంశాలను హై స్కూల్, కాలేజిలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా చదివేవాడిని. ముఖ్యంగా కాలేజిలో ప్రతివారంలో ఒకటి లేదా రెండు పుస్తకాలను తీసుకున్నాను– నేను ఎక్కువగా చదువేవాడిని.
గమనించాల్సిందేంటంటే– సోషలిజం, కమ్యూనిజంపై నేను చదివిన మొదటి పుస్తకం క్యాథలిక్ కాలేజి లైబ్రెరీ నుంచి తీసుకున్న ( రామ్సే) మెక్డొనాల్డ్ సోషలిజం( హెరాల్ఢ్ జే)లాస్కీ కమ్యూనిజం.
కాలేజి పాఠ్యపుస్తకాలు, లైబ్రెరీ పుస్తకాలు ఏవి అందుబాటులో ఉంటే వాటన్నింటిని చదవడం మొదలుపెట్టాను. అవి నన్ను ఒక రాజకీయ వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఒక రాజకీయ వ్యక్తిగా మొదట నేను కాంగ్రెస్వాదిని, ఒక గాంధేయవాదిని, కానీ క్రమంగా వామపక్ష కాంగ్రెస్వాదినయ్యాను.
మలయాళంలో నేను రాసిన తొలి పుస్తకం– జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర(చిన్న పుస్తకం) 1931లో ప్రచురించబడింది.
ఈ విధంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. దీని ద్వారా నా జ్ఞానాన్ని మెరుగుపర్చుకున్నాను. కాలేజీలో విద్యాభ్యాసం పూర్తైన తర్వాత– శాసనోల్లంఘన ఉద్యమంలో చేరి జైలుకు వెళ్లాను. వాస్తవంగా నా జైలు జీవితం విశ్వవిద్యాలయ జీవితం మాదిరిగా ఉండేది. ఎక్కవ చదివేవాడిని.
విషయం ఏంటంటే, మొదట నన్ను కన్నూర్ జైలుకు తీసుకువెళ్లగా, అక్కడ బెంగాలి ఉగ్రవాద ఖైదీలు పరిచయమైయ్యారు. వారిలో ఒకరు పండితుడు. బాగా చదువుకోమని నాకు సలహా ఇచ్చాడు. చదవడంపై నాకు ఆసక్తి ఉందని ఆయనకు తెలుసు. నేను ఏదో ఒకటి రాసేవాడిని కూడా. ఇవ్వన్ని ఆయనకు తెలుసు. కాబట్టి నాకు మార్గదర్శకుడు కావాలనుకున్నాడు. లేదా దేనిపై దృష్టి పెట్టాలో చెప్పాలనుకునేవాడు.
చరిత్ర, రాజనీతిశాస్ర్తం, ఆర్ధశాస్త్రానికి సంబంధించిన పుస్తకాల జాబితా తను నాకు ఇచ్చారు. ఇంకా అనేక పుస్తకాలను సూచించారు. జైలులో ఉన్నప్పుడు తెచ్చుకొని ఎక్కువగా చదివాను. ఈ విధంగా నేను ఒకరికి స్నేహితుడు కాగలిగాను, నేను రుగ్వేదం నుంచి కారల్ మార్స్క్పెట్టుబడికి మారాను.
ఇది నా చిన్నపాటి జీవిత కథ. దీనికి మించి “పుస్తకాలు- మనిషి” అంశం మీద ఇంకేం చెప్పాలో నాకు తెలియదు. ఈ రకంగా నాలో మానవ వ్యక్తిత్వం అభివృద్ధి చెందింది. ఏం అర్ధంచేసుకోలేని ఒక పుస్తకంతో సహా, అవి ఏ పుస్తకాల్లో తెలియదు– వాటిని కంఠస్తం చేయించారు. వాటితోపాటు, ఈ పుస్తకాలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ధాయి. నేను మార్స్కిస్టునయ్యాను.
ఈ వ్యాసం ముందుగా ది ప్రింట్ వెబ్సైట్లో ప్రచురించబడింది. వారి సౌజన్యంతో ది తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
