సిద్ధార్థ్ వరదరాజన్ (SV): కాబట్టి, ఒక విధంగా 1920- 30లలో ఆర్ఎస్ఎస్ తీసుకున్న దీర్ఘకాలిక నిర్ణయం ఏమిటంటే, మీరు చెప్పినట్లుగా, రాజకీయ అధికారం కోసం నేరుగా ఒత్తిడి చేయకుండా ఉండటానికి, సమాజాన్ని సమీకరించడం, సాధారణ హిందువులను సమీకరించడంపై దృష్టి పెట్టడం. 80ల నాటికి, పార్టీ తాను చేసిన సుదీర్ఘ కృషి ఫలాలని కోయడానికి, ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): ఖచ్చితంగా. మనం దీర్ఘకాలిక పథంని, సంఘటనలను చూడాలి. అందుకే నా పుస్తకంలో, పరిస్థితులను, చరిత్రను మన పరిస్థితులు ఎలా వేగవంతం చేశాయో, దీర్ఘకాలిక ఎజెండా ఉందా లేదానే వాటిని నిరంతరం చూడటానికి ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు, అది జరగలేదు. దీనికి విరుద్ధంగా ఇందిరా గాంధీ, అంతకు ముందు జవహర్లాల్ నెహ్రూ ఖచ్చితంగా లౌకికవాదులుగా ఉన్నప్పుడు, వారిని శిక్షించి వారి జీవితాన్ని క్లిష్టతరం చేసినప్పుడు అంతా నెమ్మదించింది. దానికి విరుద్ధంగా, వారు శిలాన్యాసం అనే ఆట ఆడుతూ, ఎన్నికల ప్రచారం ఫైజాబాద్ నుంచి ప్రారంభమవుతుందని చెబుతూ రాజీవ్ గాంధీ ఆలయ మొదటి పునాది రాయిని నిజంగానే ప్రతీకాత్మకంగా వేసిన విధానం చూడండి. అప్పుడు మీరు వారికి ప్రవేశించడానికి ఒక మార్గాన్ని తెరిచారు.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆడగల ఆట కంటే వారు చాలా నైపుణ్యంగా ఆడ కలిగిన ఆట ఇది. మీరు, ఇతర పండితులు యూరోపియన్ ఫాసిస్ట్ ఆలోచనల ప్రభావం గురించీ, యూరోపియన్ ఫాసిస్ట్ నాయకులు ఆర్ఎస్ఎస్పై, సాధారణంగా హిందూత్వ ఉద్యమంపై చూపిన ప్రభావం గురించి రాశారు. ఇప్పుడు మనకు 100 సంవత్సరాల ముందు ఉంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ను ఫాసిస్ట్ ఉద్యమంగా వర్ణించడానికి/ వర్గీకరించడానికి తగినంత (డేటా) సమాచార ఆధారాలు ఉన్నాయని మీరు చెబుతారా? నేను తప్పనిసరిగా ఏదో ఒక ముద్ర వేయకూడదని అనుకుంటున్నాను. కానీ ఈ యూరోపియన్ పూర్వీకులలో కొన్నిటితో ఆర్ఎస్ఎస్ను పోల్చి చూస్తే, ఆ పార్టీలకు ఇది ఎంత భిన్నంగా ఉంటుంది? అది ఎంత సారూప్యంగా ఉంటుంది? మీరు ఇప్పటికే ఒక తేడాను అంటే, సంస్థకు నాయకుడికి ఉన్న సంబంధం చాలా భిన్నంగా ఉంటుందని ప్రస్తావించారు. అది నాయకుడికి సంస్థ సంబంధం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ జాతీయవాదం పట్ల, రాజకీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఉన్న వైఖరి పరంగా, ఆర్ఎస్ఎస్కు, సాంప్రదాయ ఫాసిస్ట్ ఉద్యమాలకు మధ్య ఉన్న సారూప్యతలు, తేడాలు ఏమిటో మీరు చెబుతారా ?
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): నిజానికి, ఫాసిజం రెండు స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఫ్యూరర్ ప్రిన్సిప్, నాయకులు చాలా ముఖ్యమైనవారు. రెండవది, రాజకీయ అధికార సాధన ప్రధానం. అందుకే 1923లో ముంచెన్లో హిట్లర్ తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా ముస్సోలినీ రోమ్పైకి అడుగుపెట్టాడు/ దాడి చేశాడు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ఢిల్లీపై దాడి చేయలేదు. ఈ రెండు స్తంభాలు ఇక్కడ లేవు. ప్రాధాన్యత ఏమితో నేను మళ్లీ చెబుతున్నాను; సమాజాన్ని జయించడం, ప్రజల మనస్సులను గెలుచుకోవడం, అందువల్ల బలవంతంగా కాకుండా ఒప్పించడానికి ప్రయత్నించడం. మైనారిటీల పక్షాన ఉన్నందున చేరలేని వారిపై బలవంతంగా అభిప్రాయాలను రుద్దాడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఈ రెండు తేడాలు ఉన్నా , ఒక బలమైన సారూప్యత ఉంది. అందుకే ఇది ఫాసిస్ట్ ఉద్యమమని నేను చెప్పను. కానీ, ఎటువంటి భిన్నాభిప్రాయం ఉండకూడదు కాబట్టి, ఇది నిరంకుశ ఉద్యమం. మనం సమాఖ్య అంటే నా ఉద్దేశ్యంలో సజీవ/ సేంద్రీయ దేశంలో భాగం, అందుచేత మీరు విభేదించడానికి మార్గం లేదు. మీరు దేశమనే ఈ సంభావ్య సామరస్యపూర్వక సంస్థలో భాగం. దానిలో భాగం కాని వారిని మినహాయించాలి. లేకపోతే మీరు అక్కడే ఉంటారు. అందుకే కనీసం మొదట్లో అయినా కులవ్యవస్థ వారికి చాలా ముఖ్యమైనది. వారు ఇప్పుడు చెప్పకపోయినా, ఆ భావన ఇప్పటికీ ఉందని నేను భావిస్తున్నాను. మీరు ఉపాధ్యాయ సమగ్ర మానవతావాదాన్ని చూసినప్పుడు, అది వర్ణవ్యవస్థ తప్ప మరొకటి కాదని మీకు తెలుసు
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): కొత్త వలువలలో
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): కొత్త వలువలు ధరింప చేయబడింది. అది నిరంకుశత్వం. యూనిఫాం ధరించిన ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ మాదిరిగానే, అది కూడా హావభావాలతో కూడిన క్రమశిక్షణ కలిగిన సంస్థగా కూడా నిరంకుశ సంస్థ. మీరు మళ్ళీ విభేదించలేరు. మనకు అనేక రకాల నిరంకుశ ఉద్యమాలు ఉన్నాయి. ఫాసిజం ఒక రకమైనది కానీ ఇది మరొక రకం. దీనికి కొన్ని హిందూ లక్షణాలతో సంబంధం ఉంది. ఖచ్చితంగా కులవ్యవస్థ, కానీ గురు-శిష్య పరంపర కూడా. శిష్యులను పొందే గురువు ఈ శక్తికి మనం ఎప్పటికీ అభ్యంతరం చెప్పము. ఉన్నతమైన మనస్సు అని పిలవబడే వ్యక్తిత్వానికి మనం ఎల్లప్పుడూ నమస్కరిస్తాము.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): వాళ్ళు ఇప్పటికీ ఫ్యూరర్ సూత్రం లేకుండానే అలా చేస్తున్నారు.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): అవును. ఎందుకంటే అది రాజకీయాల్లో లేదు. ప్రచారకులందరూ దీనికి కొంతవరకు గురువులు. చాలా మంది మాస్టర్స్ ఉన్నారు.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): నేను చరిత్రపై ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకున్నాను. కానీ ఇది నా ముందుకు ఒక సమకాలీన ప్రశ్నను తీసుకువస్తోంది. అంటే, మనం నిరంకుశత్వ రకాలను పరిశీలిస్తే, మీకు పినోచెట్, లాటిన్ అమెరికాలో గాల్టియరీ, యూరప్‌లో ముస్సోలినీ, ఫ్రాంకో, హిట్లర్ ఉన్నారు. వారందరూ నిరంకుశవాదులు. ఎవరూ భిన్నాభిప్రాయాన్ని సహించరు. వారందరూ విమర్శకుల పట్ల క్రూరంగా ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తారు. వారందరూ తప్పనిసరిగా పౌరుల పట్ల మినహాయింపు విధానంతో ఈ అణచివేత రాజ్య యంత్రాంగంతో విడదీయరాని బంధం కలిగి ఉండవలసిన అవసరం లేదు, సరేనా. ఆ విషయంలోనే, అంటే ముస్లింలను నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం, భారతదేశంలోని ముస్లింల సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక పునాదులను కూల్చడం, వివక్ష చూపడం, వేధించడం, అణగదొక్కడం వంటి వాటి విషయంలో పినోచెట్ లేదా ఫ్రాంకోల నిరంకుశత్వం కంటే హిట్లర్ నిరంకుశత్వంతో దగ్గిర పోలిక ఉండడం మనం చూస్తున్నాము. కాబట్టి ఈ సారూప్యతల విషయంలో, సారూప్యతలపై మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అది అలా ఉండవచ్చా, ఈ విషయమే సమకాలీన స్థితికి నా దృష్టిని మళ్లీ తీసుకువస్తోంది. మనం ఇప్పుడు మోడీ పాలనలో చూస్తున్నది ఇదేనా, మోడీ ఒక ప్రచారక్, ఆయన ఆర్ఎస్ఎస్ నుండి వచ్చారు. ఆయన ఇప్పుడు భారతదేశ ప్రధాన మంత్రి, ఒక విధంగా ఆర్ఎస్ఎస్కి రాజ్యాధికారం ఉందని మనం చెప్పినప్పుడు, మోడీ ఆ రాజ్యాధికారానికి ముఖం, ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా కాదు, వాస్తవానికి, ఎన్నికైన నాయకుడిగా, కానీ మీరు మోడీ చుట్టూ నిర్మించబడిన వ్యక్తిత్వ ఆరాధనను, మంత్రుల ప్రభుత్వ నిర్ణయాలు, మోడీ పాత్రను ప్రస్తావించే ఒక విధమైన మర్యాదను, మొదలైన వాటిని పరిశీలిస్తే – మనం ఇప్పుడు ఒక రకమైన ఫ్యూరర్ప్రిన్జిప్ అభివ్యక్తిని చూస్తున్నామా? 100 సంవత్సరాల తర్వాత ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఎక్కడికి చేరిందో తిరిగి అంచనా వేయవలసి వస్తోంది.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): మనం ఖచ్చితంగా తిరిగి అంచనా వేయాలి. మోడీ శకం ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది. మళ్ళీ, కొంత పాతదాని కొనసాగింపు ఉంది. కానీ స్పష్టంగా కొత్తది ఏదో ఉంది. హిట్లర్ మోడలా లేదా నెతన్యాహు మోడలా? అని, అది నెతన్యాహు మోడల్ వైపు ఎక్కువగా ఉందని నేను వాదించడానికి ఒక కారణం. హిట్లర్ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ అతను గెలిచిన తర్వాత ఎన్నికలు జరగలేదు. నెతన్యాహులాగా, ఎర్డోగన్లాగా మోడీ..
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాడు.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. “నేనే ప్రజలు”, నేనే ప్రజలయినప్పుడు, నా చట్టబద్ధత వారి చట్టబద్ధతకు అతీతమైనది. కాబట్టి న్యాయవ్యవస్థ దేనిలోనూ ఎటువంటి వాటాను కలిగి ఉండదని చెప్పడానికి డానికి చట్టబద్ధత పొందడానికి ఎన్నికల్లో గెలవాలి. అంతే కాదు, నేను ఈ భూమి పుత్రుల నుంచి పుట్టిన వ్యక్తిని అనడంలో ఇజ్రాయెల్‌తో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ జాతీయ ప్రజాదరణ కొత్త రూపం ఉంది. దీనికి చట్టబద్ధత మైనారిటీలను పణంగా పెట్టి, భూమి పుత్రులు, నిజమైన ప్రజలు, ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ఇచ్చిన మద్దతుతో వచ్చిన ఎన్నికల తీర్పు నుంచి వస్తుంది. కాబట్టి ఇది నిరంకుశంగా మారే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే నెతన్యాహు, ఎర్డోగన్‌లతో పోలిక ఎక్కువగా కనిపిస్తోంది. వీరు ఎన్నికల్లో ఓడిపోలేరు. వీరి ప్రజాదరణ క్షీణిస్తున్నప్పుడు-
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): తర్వాత వీరు ఇతర పద్ధతులపై పని చేస్తారు.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): వీరు ఇతర వనరులను కనుగొనాలి. వీరు మొదట ఎన్నికలను రిగ్ చేయాలి. వీరి ప్రజాదరణ చట్టబద్ధతను పునరుద్ధరించే యుద్ధాలు వీరు కొన్నిసార్లు చేయవలసి రావచ్చు. అందుకే వారు యుద్ధాలు కూడా చేస్తున్నారు. కానీ అవును, అది కొత్తది. అది కొత్తదే కానీ నాకు కొత్తదనం అంత ప్రత్యేకమైనది కాదని అనిపిస్తున్నది. మీరు చూస్తున్నారు, ప్రపంచంలోని వేరే చోట ఇలాంటి పరిణామాలను మనం చూస్తున్నాము.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): కానీ మోడీని ఈ ఇతర వ్యక్తులతో పోల్చడం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఈ కోణంలో తేడా ఏమిటంటే, మనం ఆర్ఎస్ఎస్ వైపు తిరిగి వస్తాము. ఈ నాయకులలో ఎవరూ పుతిన్ కాదు, ట్రంప్ కాదు, ట్రంప్ ఒక రకమైన MAGA స్థావరాన్ని సృష్టిస్తున్నప్పటికీ, వారిని ఆపడానికి ఈ నాయకులలో ఎవరికీ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ లేదు.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): అది నిజం. కానీ మోడీ, అతని వెనుక ఉన్న ఈ సంస్థ ఉన్నప్పటికీ, గుజరాత్లో అతను ఎలా ఎదిగాడో మీరు చూసినప్పుడు ఇక్కడే అతను కొత్తదాన్ని ఆవిష్కరిస్తున్నాడని అర్ధమవుతుంది. 2007 ఎన్నికల నాటికి, ఆర్ఎస్ఎస్ అతనితో సంతోషంగా లేదు. అతనికి ఆ విషయం చెప్పింది, అతని కోసం అది పోరాడలేదు. కాబట్టి ఓటర్లతో నేరుగా సంబంధం కలిగి ఉండేలా ఒక సమాంతర అధికార నిర్మాణాన్ని అతను కనిపెట్టవలసి వచ్చింది. ఇది ఒక జనాదరణ పొందిన పద్ధతి, జనాదరణ పొందినవారు సంస్థలను కోరుకోరు. వారికీ సంస్థలపై ఆధారపడటం ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే, అధికారం విషయానికొస్తే ఆర్ఎస్ఎస్ కొంతవరకు అనవసరంగా మారే విధంగా అతను చాలా కొత్తగా ఏదైనా కనిపెట్టాడా అని, లేదా అతను ఏదో ఒక రోజు రంగం నుంచి వైదొలుగుతాడు. కాబట్టి అతను వెళ్లిపోయే వరకు అది ఒక (కుండలీకరణమా) విరామమా. మనం మునుపటి పద్ధతికి తిరిగి వస్తామా, సంస్థ మళ్ళీ అధికారం చేపడుతుందా. ఇది జరిగితే, అవును, వారు పూర్తిగా కొత్తదాన్ని కనిపెట్టినట్లే. ఎందుకంటే ఒక బలవంతుడు తిరిగి పుంజుకుని తన ప్రయాణాన్ని కొనసాగించగల సంస్థ నుంచి తనను తాను విముక్తి చేసుకోవడానికి ప్రయత్నించగలడని దాని అర్థం.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): కానీ బీజేపీ తదుపరి అధ్యక్షుడు ఎవరు, మోడీ వారసుడు ఎవరు అనే ప్రశ్న వంటి చాలా అంశాలలో ఆర్ఎస్ఎస్ సంతోషంగా ఉండకపోవచ్చు, ఆర్ఎస్ఎస్కీ మోడీ నేతృత్వంలోని బీజేపీకీ మధ్య ఉద్రిక్తతను మనం చూస్తున్నాము. అయితే, ఆర్ఎస్ఎస్కు ఇంత మంచి ఎప్పుడూ జరగలేదన్నది కూడా నిజం కాదా? వారు ఏ విధమైన చొరబాట్లు చేసుకోవడానికి మోదీ అనుమతించారో మనం గమనిస్తున్నాం. అధికార పరంగా, రాష్ట్రంలోని వివిధ సంస్థలు, ఉదాహరణకు విద్యాసంస్థలు, నా ఉద్దేశ్యం, విశ్వవిద్యాలయాలు ఆర్ఎస్ఎస్ నిర్మాణానికి దగ్గరగా ఉండటం మాత్రమే అర్హతగా కనిపించే వ్యక్తులతో నిండి ఉన్నాయి. మీరు మళ్ళీ, ఆర్ఎస్ఎస్ ఆడుతున్న దీర్ఘకాలిక ఆటను పరిశీలిస్తే, వారికి, ఇది చాలా విలువైన ఆస్తి.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): ఖచ్చితంగా, మీరు చెప్పింది నిజమే. ఒకే ఒక ప్రమాదం ఏమిటంటే, అది చాలా పెద్ద ప్రమాదం, మీరు ఒక వ్యక్తిపై ఎక్కువగా ఆధారపడితే, ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. ఆ వ్యక్తి తన ప్రజాదరణలో కొంత భాగాన్ని కోల్పోవచ్చు. ఆపైన అతను సంస్థకు చెడ్డ పేరు తెస్తాడు. అతను సంస్థను మరింత దుర్బలంగా చేస్తాడు. నిజానికి, అతను(మోడీ) బీజేపీని చాలా దుర్బలంగా మారుస్తున్నాడు. ఇందిర కాంగ్రెస్‌కు చేసినట్లే అతను బీజేపీకి చేస్తున్నాడు. ఇది ఒకప్పుడు రాష్ట్ర నాయకులతో కూడిన పిరమిడ్‌గా ఉండేది, అందువల్ల బలమైన సంస్థ ఉంది. 70లలో ఎటువంటి ఆధారం లేని(సైకో) దురభిమానులను, వందిమాగధులను రాష్ట్ర నాయకులుగా ఇందిర నియమించిన విషయం మీకు గుర్తుండవచ్చు. కాంగ్రెస్ దాని నుండి కోలుకోలేదు. నేడు బీజేపీ కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఎంచుకోబడటానికి ముందు గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరో ఎవరికి తెలుసు, అందువల్ల పార్టీ ఎక్కడ ఉంది. ఇదే ఆర్ఎస్ఎస్కు ఆందోళన కలిగించే విషయం.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): మీరు చెప్పేది సంగ్రహంగా చెప్పాలంటే, మనం 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి – మీకు 1925లో జన్మించిన ఒక సంస్థ ఉంది. అది చాలా కాలంగా రాజకీయ ఆట ఆడుతోంది. 2025 నాటికి, 100 సంవత్సరాల తర్వాత, నిజంగా దాని శక్తి, ప్రభావం విషయంలో పరాకాష్టలో ఉంటుంది. కానీ ఆ శక్తిని, ప్రభావాన్ని సంగ్రహించే లేదా ప్రాతినిధ్యం వహించే వ్యక్తితో ఒక విధంగా సంస్థకు స్పష్టమైన విభేదాలు ఉన్నాయి. అతని చర్యల ద్వారా, వ్యక్తిత్వ ఆరాధన ద్వారా, ప్రజలు అతనితో అనుబంధించే అన్ని ఇతర విషయాల ద్వారా, అతను వాస్తవానికి ఈ సంస్థ ప్రభావాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి 100వ సంవత్సరంలో, నేను ఈ ఇంటర్వ్యూను ముగించాలనుకుంటున్న ప్రశ్న ఏమిటంటే, బహుశా మీరు మీ అంతర్దృష్టితో చూస్తే మీ ఊహకే తెలుస్తుంది. రాజ్యాధికారంలో ఆర్ఎస్ఎస్ లేనట్లయితే మనుగడ సాగించి వృద్ధి చెందుతుందా? మరో మాటలో చెప్పాలంటే, మోడీ పోయినట్లయితే, అతని స్థానంలో మరొకరు ఉన్నప్పటికీ, ఒకవేళ బీజేపీ స్వయంగా ఎన్నికల్లో ఓడిపోతుందని అనుకుందాం. రాజ్యంలోని వివిధ అంగాలు, సంస్థలు మొదలైన వాటిలోకి చొచ్చుకుపోవడం ద్వారా ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలను కొనసాగించడానికి, అభివృద్ధి చెందడానికి తగినంత ఊపును కలిగి ఉందా లేదా ఈ సంస్థకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందా?
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): నిజానికి, ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు ప్రశ్నలు ఉన్నాయి. మోడీ తర్వాత తదుపరి బీజేపీ నాయకుడు ఎవరని వారు నిర్ణయించుకునే విధంగా వారు తమ అధికారాన్ని తిరిగి నిరూపించుకోగలరా? అనేది మొదటి ప్రశ్న ఎందుకంటే ఉన్నత పదవి కోసం పోరాడే వ్యక్తులు ఉంటారు. వారికి వనరులు ఉన్నాయి. వారు ఇప్పటికే రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ మళ్ళీ కింగ్‌మేకర్ కాగలదా? అది మళ్ళీ కింగ్ మేకర్ కాలేకపోతే లేదా బీజేపీ గతంలో ఉన్న అధికారాన్ని కోల్పోతే, గెలవలేని స్థితిలోఉంటే, బీజేపీయేతర ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ ఏమి చేయగలదు? ఇక్కడ, నేను చెప్పేది ఏమిటంటే, ఇది సమాజంలోకి ఎంతగా చొచ్చుకు పోయిందంటే, మనం అనేక రంగాలలో తిరిగిరాని స్థితికి చేరుకున్నాము. ప్రభుత్వంలో పనిచేస్తూనే దాని రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండా, తన స్వంత అజెండాలు, లక్ష్యాలను సాధించడం కోసం పనిచేస్తున్న వ్యవస్థ అని నేను దీనిని పిలుస్తాను. సమాజంలో చాలా లోతుగా చొచ్చుకు పోయిన వ్యవస్థ.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): మీరు (ధ్రువణత) రెండు విభిన్న అభిప్రాయాలు లేదా నమ్మకాల సమూహాలుగా విభజించడం గురించి, విభజన, వివిధ రంగాలలో దాని భావజాలం చొచ్చుకుపోవడం గురించి మాట్లాడుతున్నారు.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): అవును. ఇప్పుడు చాలా (ఎర్రటి గీతలు) ప్రమాద సంకేతాలు. గోసంరక్షణ, మతమార్పిడి నిరోధక చట్టాలు, వాటి గురించి వారు చేసిన వాటిని మీరు ఎలా రద్దు చేస్తారు?
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): ఈ దేవాలయాలు, మొదలైన వాటిని అన్నింటినీ రాజకీయం చేయడం. ప్రతీకారేచ్ఛ.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): అవును. వారు సమాజంలోకి, సంస్థలలోకి, ప్రజల మనస్సులోకి చాలా లోతుగా చొచ్చుకుపోయారు. వారు రాజకీయ అధికారాన్ని కోల్పోయినా, వారు బహుశా కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పైగా పాకిస్తాన్లో జరుగుతున్న దాని నుంచి మనం నేర్చుకున్న పాఠాలలో ఇది ఒకటి. జియా తర్వాత, దానిని రద్దు చేయడానికి మార్గం లేదు. దైవదూషణ చట్టాన్ని ఎవరు రద్దు చేయగలరు? ఎవరూ అలా చేయడానికి ధైర్యం చేయరు. వారు చేసిన పనిని ఎవరు రద్దు చేస్తారు? నేను మళ్ళీ చెబుతున్నాను, గోరక్షణకు సంబంధించి, నిజంగా ఆచరణీయమైన పని జరిగే చోట అప్రమత్తులుగా ఉండే వ్యక్తులు అక్కడ ఉన్నారు. పాకిస్తాన్లో మనం చూసేది ఇదే. మీరు ఎలా ప్రయత్నిస్తారు? మీరు ఎలా ప్రయత్నించడానికి ధైర్యం చేస్తారు? ఇది చట్టబద్ధమైనది కాదు. ఇది ధర్మబద్ధమైనది కావచ్చు. కానీ ధర్మానికీ, చట్టబద్ధతకూ మధ్య వ్యత్యాసం ఉంది. కాబట్టి మనం పేర్కొన్న అన్ని కారణాల వల్ల వారు అధికారాన్ని నిలుపుకోకపోయినా, యుద్ధం జరిగేది అక్కడే కావచ్చు. యుద్ధం రాజకీయ రంగంలో మాత్రమే కాదు. అది సామాజిక రంగంలో ఉంది. కాంగ్రెస్ నాయకులు చాలా తక్కువగా అర్థం చేసుకున్న విషయం ఇది. కానీ దీనికి చాలా ఓర్పు అవసరం ఎందుకంటే ఈ సంస్థతో, ఈ సంస్థకు చెందిన యూనియన్లు, అన్ని రకాల సంఘాలతో పోటీ పడగల సంస్థ మీకు ఉండాలి. కాబట్టి ఇది చాలా పెద్ద సవాలుతో కూడుకున్నది.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): ఆ విషయం గురించి, ప్రొఫెసర్ జాఫ్రెలాట్, మనం దీన్ని ఇక్కడితో ముగిద్దాం . ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్పై మీ లోతైన విశ్లేషణ పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): ధన్యవాదాలు, సిద్ధార్థ్.
అనువాదం: ప్రత్యూష
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. తెలుగులోని మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
