2025 సెప్టెంబర్ 27నాటికి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూలాలు, మౌలిక ఆలోచనల గురించి, అది(క్లాసికల్) సాంప్రదాయ ఫాసిజంతోనూ, నిరంకుశత్వంతోనూ ఎలా కలిసిపోతుంది- ఎలా భిన్నంగా ఉంటుంది? ఆ సంస్థకు, భారతదేశానికి భవిష్యత్తు ఏమి సూచిస్తోందనే దాని గురించి ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ ది వైర్ పత్రిక సంపాదకులు సిద్ధార్థ్ వరదరాజన్‌తో మాట్లాడారు.
పారిస్‌లో రికార్డ్ చేయబడిన సంభాషణ పాఠాన్ని చదవడానికి వీలుగా, చిన్నచిన్న సవరణలతో ది వైర్ సంపాదకీయ ఇంటర్న్ అన్య రాజ్గర్హియా లిప్యంతరీకరించారు.
సిద్ధార్థ్ వరదరాజన్(SV): హలో, ది వైర్ కోసం ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకి స్వాగతం. 2025 సెప్టెంబర్ 27న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సంస్థ 1925 సెప్టెంబర్ 27న నాగ్‌పూర్‌లో స్థాపించబడింది. గత 100 సంవత్సరాలుగా దాని ప్రయాణం గురించి చర్చించడానికి పారిస్‌లోని రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్, భారతదేశంపైనా, దక్షిణాసియాపైనా అనేక పుస్తకాల రచయిత క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ నాతో చేరారు. ఆయన అనేక దశాబ్దాలుగా పండితుడిగా ఆర్ఎస్ఎస్, దాని రాజకీయాలు– భావజాలాన్ని గమనించిన వ్యక్తి కూడా.
మన ప్రేక్షకుల మనస్సుల్లో మెదులుతున్న ఒక ప్రశ్నతో నేను ప్రారంభించాలనుకుంటున్నాను: 100 సంవత్సరాలుగా ఉన్న ఒక సంస్థ. 1925లో దాని కార్యకలాపాలను ప్రారంభించినప్పుడు, మొదటి కొన్ని దశాబ్దాలపాటు, అది ఆ సమయంలో భారతదేశంలోని ప్రధాన రాజకీయ ప్రవాహం నుంచి; అంటే స్వాతంత్ర్య పోరాటం నుంచి(స్పృహతోటి) కావాలనే దూరంగా ఉంది. వారు ఆ ఉద్యమంలో పాల్గొనలేదు. వారు దాని నుంచి దూరంగా ఉన్నారు. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత అనేక దశాబ్దాలపాటు , ఈ సంస్థ, ఆర్ఎస్ఎస్, ఇతర రాజకీయ ప్రవాహాలచే, ఇతర రాజకీయ ధోరణులచే మరుగున పడవేయబడింది. ఈ ప్రక్రియ దాదాపు 70ల మధ్యలో మారడం జరిగింది. ఆర్ఎస్ఎస్ గత 50 సంవత్సరాలను మనం పరిగణనలోకి తీసుకుంటే, ఈ సంస్థ ప్రభావం పరంగా, భారత రాజకీయాలను వేగంగా నెట్టగల, నిర్దేశించగల సామర్థ్యం పరంగా స్పష్టంగా పెరిగింది. నేడు వాస్తవానికి ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాన్ని నియంత్రిస్తోంది. ఆర్ఎస్ఎస్ని అధ్యయనం చేసిన, భారత రాజకీయాలను అధ్యయనం చేసిన పండితుడిగా– గత 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న ఈ ప్రయాణ స్వభావాన్ని మీరు ఎలా అంచనా వేస్తున్నారు?
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్(CJ): మంచిది, కొన్ని విధాలుగా, మీరు దీనిని విజయగాథ అని చెప్పవచ్చు. వారు 100 సంవత్సరాలలో చాలా సాధించారు, ఇది కూడా ఒక విజయం. 100 సంవత్సరాలుగా ఎన్ని సంస్థలు పెరిగాయి/ అభివృద్ధి చెందాయి? అవి 1920లలో జన్మించాయి కానీ ఐరోపాలో ఇలాంటి ఉద్యమాలు చాలా ఉన్నాయి. ఈ యూరోపియన్ ఉద్యమాలు ఏవీ మనుగడ సాగించలేదు. వాళ్ళు(ఆర్ఎస్ఎస్) మనుగడ సాగించారు కాబట్టి, మీరు మొదట ఈ సంస్థని కొనసాగించే వారి సామర్థ్యం, చొరవలను వివరించాలి. వారి కార్యనిర్వహణ పద్ధతి నాయకుడిపై ఆధారపడి ఉండదనేది అక్కడ ఉన్న వివరణలలో ఒకటి. కాబట్టి వారు ఒక మతాన్ని నమ్మేవారుగా కాకుండా ఒక జాతిగా నిర్వచించబడ్డారు. ఆ విషయం సావర్కర్ పుస్తకంలో ఉంది. హిందువులను నిర్వచించడానికి అది మొదటి ప్రమాణం, అది నేటికీ ఉంది. రెండవ ప్రమాణం భూభాగం- పుణ్యభూమి, పవిత్ర భూమి. సరే మళ్ళీ, ఇది ఆచారాల పరంగా మతంతో సంబంధం కలిగి ఉంది. కానీ, నమ్మకం పరంగా కాదని, సిద్ధాంతం పరంగా కాదని నేను చెబుతున్నాను. రహస్య ప్రాంతం/ భూభాగం, హిందూ జాతి ఆ నాణేనికి రెండు ముఖాలు. ఇది జియోనిజంతో చాలా వరకు పోలి ఉంటుంది. మనం సమానమైన, సారూప్య భావజాలాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తే, ఇది జియోనిజం. ఇది 1920లలోనే ఉంది. అది నేటి నుంచి 100 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. దాని పర్యవసానంగా ఆ జాతికి చెందని వారందరూ, మైనారిటీలు, భూమి పుత్రులతో సమానంగా ఉండలేరు.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): అంటే మతం లోపలికి చొచ్చుకు వస్తుంది. కానీ, పరోక్ష మార్గంలో వస్తుంది.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): సరిగ్గా చెప్పాలంటే, ఆ చారిత్రక ప్రజల సమూహం నుంచి రాని వారికి మతం ఒక రకమైన బహిష్కరణ మార్గం అవుతుంది. అది అలాగే ఉంది. నాకు తెలిసినంత వరకు మొదటగా, ప్రజల నిబద్ధత/ మానసిక శక్తి మారింది. హెడ్గేవార్, గోల్వాల్కర్లకు రాజకీయాల్లో పాల్గొనడంలో ఆసక్తి లేదు. హిందూ మహాసభ కూడా 20, 30, 40లలో తీవ్రంగా ప్రయత్నించింది. సంస్థతో రాజీ పడకుండా గోల్వాల్కర్ చూసుకున్నాడు- వారు బ్రిటిష్ వారిని లోబరచుకొని అణచివేతకు గురిచేసే ప్రమాదకర మార్గం తీసుకోలేదు. కాబట్టి రాజకీయాలు చేయడం ఖచ్చితంగా వారి ప్రారంభ ఎజెండాలో లేదు.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): బహుశా, గతాన్ని దృష్టిలో ఉంచుకుని. అది వ్యూహాత్మకంగా ఉండవచ్చు.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): అది వ్యూహాత్మకమైనది. కానీ అది వారి దీర్ఘకాలిక ఎజెండా ప్రతిబింబమని నేను అనుకుంటున్నాను. వారు అధికారాన్ని జయించాలని కోరుకోలేదు. వారు సమాజాన్ని జయించాలని కోరుకున్నారు. వారు మనస్సును, సమాజ మనస్తత్వాన్ని తిరిగి రూపొందించాలని కోరుకున్నారు. అయితే, అది(ఎజెండా) ఇప్పటికీ ఉంది.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): అవును.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): అది(ఎజెండా) ఇంకా అలాగే ఉంది. అది కొంచెం మారింది. మనం ఆ విషయానికి మళ్లీ వద్దాం. కానీ అది ఇప్పటికీ ప్రధానమైన ఆటే, ప్రధాన లక్ష్యం. అధికారం పోయే అవకాశం ఉంది కాబట్టి, మీరు ముందుగా సమాజాన్ని జయించాలి. మీరు సమాజాన్ని గుప్పిట్లో పెట్టుకున్న తర్వాత, అధికారం దాదాపు స్వయంచాలకంగా వస్తుంది. కాబట్టి, మీరు ముందుగా అధికారాన్ని జయించరు. కాబట్టి ఇది దీర్ఘకాలిక ఎజెండా. అంతేకాకుండా 20, 30, 40లలో శాఖల అభివృద్ధిపై దృష్టి సారించడం నుంచి వారిని నిరోధించడానికి మీకు ఎటువంటి మార్గం లేదు. వారు దానికోసం మాత్రమే దేశవ్యాప్తంగా నాగ్‌పూర్ నుంచి ప్రచారక్‌లను పంపుతారు.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): భావజాలాన్ని, (నమ్మక వ్యవస్థను) నమ్మకాన్ని ప్రోత్సహించడం.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): క్రమశిక్షణ, సంస్థ. సంస్థ కీలకం. మీరు సరైన యూనిఫామ్‌తో, సరైన పద్ధతులతో, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం శాఖలో ఉండాలి. గోల్వాల్కర్ చెప్పేది అదే – మేము కోణీయతలతో పోరాడతాము. కోణీయత లేదు అంటే మీరందరూ సంస్థతో అనుగుణంగా ఉన్నారు. కాబట్టి 40ల వరకు, మహాత్మా గాంధీ హత్య వరకు అదే కార్యనిర్వహణ పద్ధతి, ఎందుకంటే మహాత్మా గాంధీని చంపినప్పుడు గాడ్సే అప్పటికీ ఆర్ఎస్ఎస్లో భాగమై ఉన్నాడు.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): కానీ మొత్తం సభ్యత్వ వివరాలను ఒక విధంగా రహస్యంగా ఉంచారు. లేదా అనుబంధాన్ని రహస్యంగా ఉంచారు.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): ఖచ్చితంగా. వారు ప్రమాణం చేయాలి, అది రహస్యం. కాబట్టి అది ఇకపై ఆర్ఎస్ఎస్లో భాగం కాదని మీరు చెప్పవచ్చు. కానీ నేను గోపాల్ గాడ్సేను ఇంటర్వ్యూ చేశాను.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): అతని సోదరుడు. అతను దానిని ధృవీకరించాడన్నది నిజమేనా?
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): అవును. మేము ఎప్పుడూ సంస్థని వదిలి వెళ్ళలేదని ఆయన అన్నాడు. మేము ఎప్పుడూ సంస్థని వదిలి వెళ్ళలేదు. ఆయన దానిని అలా రాశాడు కూడా. కాబట్టి వారిని నిషేధించారు. ఆ కారణంగా ఆర్ఎస్ఎస్ నిషేధించబడింది. 20,000 మంది స్వయంసేవకులను జైలులో పెట్టారు. తరువాత గోల్వాల్కర్, ఇతరుల మధ్య ఒక చర్చ జరిగింది. చివరికి మనం ప్రజారంగంలోకి ప్రవేశించాలని, మొదటగా, మనల్ని రక్షించే పార్టీని కలిగి ఉండాలని నిర్ణయించారని కొంతమంది పాతకాలపు వ్యక్తులు నాతో చెప్పారు – నానాజీ దేశ్‌ముఖ్ లేదా వసంతరావు ఓక్, కేఆర్ మల్కాని కూడా నాతో చెప్పారు. అది ఇతర రాజకీయ శక్తులను లాబీయింగ్ చేస్తుంది. కాబట్టి వారు జనసంఘ్‌ను సృష్టిస్తారు. కానీ వారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరి ఇతర హిందూ మహాసభ వ్యక్తులతో కలిసి జనసంఘ్‌ను సృష్టించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, సంఘటన్ మంత్రిగా ఉండటంతో, ఆర్ఎస్ఎస్ క్రమంగా జనసంఘ్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ పార్టీ 70ల వరకు చాలా చిన్నదిగా ఉంది. 1967లో వారికీ అదృష్టం కలిసివచ్చింది. గోసంరక్షణ ఉద్యమం కొంత ఫలాలను ఇచ్చింది. కానీ, వారు చెల్లుబాటు అయ్యే ఓట్లలో 9% వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్నారు. కాబట్టి వారు ప్రజా రంగంలో ఉన్నారు కానీ మీరు చెప్పినట్లుగా ఎవరి దృష్టిని ఆకర్షించలేరు.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలచే మరుగున పడవేయబడ్డారు.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): అవును. అప్పటివరకు.
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): (కమ్యూనిస్టు) పార్టీ ఓట్లలో ఎక్కువ వాటాను కలిగి ఉంది. యాదృచ్ఛికంగా వారి చరిత్రకూడా 1925 నాటిది.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): అవును. 1925, నాగ్‌పూర్ రెండు అద్భుతమైన తేదీలు, ప్రదేశాలు, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కొత్త దళిత భావజాలాన్ని ఉపయోగించడం ప్రారంభించిన సమయం కూడా అదే అని మీకు తెలుసు. కాబట్టి 70ల నాటి ప్రతిపక్ష పార్టీలలో వాటిని మరింత విజయవంతం చేసింది ఏమిటి? 71 ఎన్నికలలో అంతగా జరగలేదు. కానీ 70ల ప్రారంభంలో- 70ల మధ్యలో గుజరాత్లో జరిగిన రాష్ట్ర ఎన్నికలలో కూడా అత్యవసర పరిస్థితికి ముందు కూడా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెసేతరవాదంలో మునిగిపోవడం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాన్ని బలోపేతం చేయడం వల్ల వారు కొంత చొరబడగలిగారు. వారు సీట్ల సర్దుబాట్లు చేసుకోగలిగారు. అయితే, అది 60లలో ప్రారంభమైంది. 1963 ఉప ఎన్నికల్లో ప్రారంభమైంది. కానీ 1971లో మహా కూటమిలో ఇది మరింత నిత్యకృత్యంగా మారింది. చాలా మంది జనసంఘ్‌తో జేపీ ఉద్యమంతో చేతులు కలుపుతున్నారు. అవినీతిపై పోరాటం, ఇందిరా గాంధీపై పోరాటం పేరుతో మీరు సైద్ధాంతికంగా విభేదిస్తున్నప్పటికీ మొదటి లక్ష్యం కాంగ్రెస్ అని మీరు అంగీకరిస్తున్నప్పుడు జేపీ ఉద్యమం నా దృష్టిలో నంబర్ వన్ మలుపు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ స్వయంగా, బీకేడీ, బీఎల్డీ, కొంతమంది సోషలిస్ట్ నాయకులు కూడా అత్యవసర పరిస్థితిలో కలిసి జైలులో ఉండటం వలన వీరందరితో జేడీ ఉద్యమం ప్రారంభమవుతుంది. ఇది ప్రెషర్ కుక్కర్. 18 నెలలు కలిసి జైలులో ఉన్నారు. చివరికి, వారు ఉమ్మడి పార్టీలో(జనతా పార్టీలో) విలీనం కావడానికి ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి, ఇది చాలా ముఖ్యమైన మలుపు, దాని తర్వాత మరొక మలుపు వస్తుంది. అంతేకాకుండా మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో నేను ముగించాలనుకుంటున్నాను ఎందుకంటే ద్వంద్వ సభ్యత్వ వివాదం చివరకు-
సిద్ధార్థ్ వరదరాజన్ (SV): జనతా పార్టీని విచ్ఛిన్నం చేస్తుంది.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ (CJ): జనతా పార్టీని. చాలా త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది. 1979, ఇది రెండేళ్ల కథ. గోవధకు వ్యతిరేకంగా చట్టం, మతమార్పిడులు అసాధ్యం చేసే చట్టం కోసం అడుగుతున్నందున మీరు జనతా పార్టీకి విధేయులా లేక ఆర్ఎస్ఎస్కా, ద్వంద్వ సభ్యత్వ వివాదంలో ఎవరికి విధేయులుగా నిలుస్తారని ప్రశ్నించిన వారిలో ఒకరు నేను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన సోషలిస్ట్ మధు లిమాయే. వారు ఇప్పటికే చరిత్ర పాఠ్యపుస్తకాలను తిరిగి వ్రాయాలనుకున్నారు. కాబట్టి ఈ ఉద్రిక్తత ఉంది, చివరికి 1979లో వారు జనతా పార్టీని వీడి వెళ్ళిపోయారు. మార్చి 80లో వారు బీజేపీని స్థాపించారు. సంకీర్ణ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా మీరు పురోగతి సాధించలేరని దేవరస్ భావించిన సమయం ఇది. సంకీర్ణాలు పరిష్కారం కాదు. ఈ ఇతర ప్రతిపక్ష పార్టీలు నమ్మదగినవి కావు. మనం హిందూ ఓటు బ్యాంకును నిర్మించుకోవాలి. ఇప్పుడు మనం రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పబోతున్నాం. హిందువులకు వారి హక్కుల గురించి రాజకీయంగా అవగాహన కల్పించబోతున్నాం, మనకు భాగస్వాములు అవసరం ఉండదు. ఇది అయోధ్య ఉద్యమానికి ప్రారంభం, ఆ సమయంలోనే అయోధ్య ఉద్యమం నిర్వచించబడుతుంది. 1984 ప్రదర్శనలలో దేవుడు విముక్తి పొందాలని వారు చెప్పినప్పుడు ఇది మొదటిసారిగా వీధిలో స్ఫటికీకరించ బడుతుంది (క్రిస్టలైజ్డ్) అని దేవరస్ చేసిన ఈ అద్భుతమైన ప్రసంగం మీకు తెలిసే ఉంది. 1984లో ఇందిరా గాంధీ హత్య కారణంగా వారు ఎటువంటి మార్పునూ తీసుకురాలేక పోయారు. కానీ 1989లో వారు అదే ఎజెండాకు తిరిగి వచ్చారు. పైగా అది ఒక మలుపు.
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనువాదం: ప్రత్యూష
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
