72వ జాతీయ చలనచిత్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం ఏక్తా నగర్‌గా పరిచయమైన గుజరాత్ రాష్ట్రంలో జరగనుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేయనున్నారు. ముంబై ప్రాధాన్యతను, దేశ రాజధాని ప్రాధాన్యతను తగ్గించి గుజరాత్‌ను ప్రోత్సహించడానికే ఇది జరుగుతున్నదని రాజ్ థాకరే విమర్శించారు.
72 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీ నుంచి గుజరాత్‌లోని కేవాడియాకు తరలిస్తున్నారు.
గుజరాత్‌కు ప్రాధాన్యతనిచ్చి ముంబై, దేశ రాజధాని ప్రాధాన్యతను క్రమంగా తగ్గించే ప్రయత్నం ప్రారంభమైనట్లు కనిపిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అవార్డుల పంపిణీని ఢిల్లీ నుంచి మార్చాలనుకుంటే అప్పుడు ముంబైకి ఎందుకు మార్చకూడదని ఆయన ప్రశ్నించారు.
గుజరాత్‌కే అన్ని ప్రాజెక్టులు ఎందుకు?
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ సినిమాలు నిర్మాణం జరుగుతున్నాయి. కాబట్టి అక్కడికి ఎందుకు మార్చకూడదని ఆయన అన్నారు.
గుజరాత్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ఇదే కాక ఇతర అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులు గుజరాత్‌కే ఎందుకు తరలిస్తున్నారని రాజ్ థాకరే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను ప్రశ్నించారు.
దేశంలోని అనేక ప్రాంతాలవారు లెక్కలేనన్ని త్యాగాల ఫలితమే నేటి భారతదేశం అని ఆయన గుర్తు చేశారు. కళాకారులందరు దీన్ని ప్రశ్నించాలని ఆయన అన్నారు. ఇది కేవలం ఒక ప్రదేశం మార్చడం కాదు. దేశ రాజధానిలో జరుగుతూ వస్తున్న సాంప్రదాయాన్ని మార్చడంగా చూడాలని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు, దేశంలోని మిగతా ప్రాంతాలకు మధ్య గోడను నిర్మిస్తున్నదని శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.
అవార్డుల వేడుకను బహిష్కరించాలి..
శివసేన(యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ కేవలం గుజరాత్‌కు మాత్రమే ప్రధాన మంత్రా అని ప్రశ్నించారు. లేకుంటే జాతీయ స్థాయి అవార్డుల పంపిణీ ఢిల్లీలో జరగాలి కానీ గుజరాత్లో నిర్వహించడమేమిటని ఆయన ప్రశ్నించారు. త్వరలో గుజరాత్ ఎన్నికలు జరగనుండగా అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గుజరాత్‌కు తరలించడం “ఇది వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమమా” అని ఆయన ప్రశ్నించారు. కళాకారులందరూ దీన్ని ప్రశ్నించాలని సంజయ్ రౌత్ పిలుపునిచ్చారు.
కళాకారులెవరూ గుజరాత్‌కు వెళ్లవద్దని, దేశం పట్ల గర్వపడే కళాకారులందరు గుజరాత్లో జరిగే అవార్డుల పంపిణీని బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
1954లో మొదటి ఫిల్మ్ అవార్డుల పంపిణీ కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. అప్పటి నుంచి వరుసగా దేశ రాజధానిలోనే ఈ అవార్డుల పంపిణీ జరుగుతున్నది. 1971లో ఒక్కసారి మాత్రమే చెన్నైలో జరిగింది. ఇప్పుడు దాన్ని గుజరాత్‌కు మార్చడం సాంప్రదాయ విరుద్ధం. కేవాడియా పేరును ఐక్యతా కేంద్రంగా “ఏక్తా నగర్”గా మార్చి 2018లో నరేంద్ర మోదీ దాన్ని ప్రారంభించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
