నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా 19 సంవత్సరాల క్రితం నమోదైన హత్య కేసుకు సంబంధించి మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోల్‌కతా: బెంగాల్‌లోని నందిగ్రామ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన అరెస్టయ్యారు.
టీఎంసీ మాజీ అధినేత్రి మమతా బెనర్జీ తన పార్టీ పేరు, గుర్తును తిరుగుబాటు వర్గానికి కోల్పోయిన నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి సంచిత ప్రధాన్ డే ఈరోజు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
అత్యంత కీలకమైన నందిగ్రామ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి తాను మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీ నేత, ముఖ్యమంత్రి సువేందు అధికారి రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
పోలీసుల అదుపులో కాంగ్రెస్ అభ్యర్థి..
ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న పోలీసులు, 2007 నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమం సమయంలో నమోదైన పాత హత్య కేసులో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం.
నందిగ్రామ్ ప్రాంతం మమతా బెనర్జీకే కాకుండా ఒకప్పుడు ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన సువేందు అధికారి రాజకీయ జీవితాలను కూడా బలంగా ప్రభావితం చేసింది.
అరెస్ట్ అయిన కాంగ్రెస్ అభ్యర్థిని శనివారం నాడు హల్దియా కోర్టులో హాజరుపరచవచ్చని ఆనందబజార్ పత్రిక కథనం పేర్కొంది.
నామినేషన్ల దాఖలుకు శనివారం ఆఖరి రోజు.
“బీజేపీ ఏక పార్టీ పాలనను స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. ఈ దేశంలో ఇక ప్రతిపక్ష రాజకీయాలు మిగలవా” అని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్ వ్యాఖ్యానించినట్లు ఆనందబజార్ పత్రిక ఉటంకించింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
