దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన అంశాలలో అక్షరాస్యత, నాణ్యమైన విద్య, ఉన్నత విద్యా ప్రమాణాలు ప్రధానమైనవి.
2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో అక్షరాస్యత ఒక స్థాయిలో ఉంది.
మోదీ పుష్కర పాలనా కాలంలో అనేక దేశాల కంటే అక్షరాస్యతలో భారతదేశం వెనుకబడినది.
ఉన్నత విద్యనభ్యసించి పట్టాలు పొందిన వారిలో కూడా తగిన సరైన నైపుణ్యాలు ఉండటం లేదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెబుతున్నది. ఎందుకు? దీనికి కారణం ఏంటి? బాధ్యత ఎవరిది? విద్యార్థులది ఎంత మాత్రం కాదు.
విద్యార్థుల పాలిట శాపంగా కాషాయీకరణ..
ప్రభుత్వ విద్యా విధానంలోనే తీవ్రమైన లోపం కనిపిస్తోంది. దాన్ని సరిదిద్ది ప్రపంచ ప్రమాణాలతో సరితూగే విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
కానీ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను కాషాయీకరణ చేస్తున్నది.
విద్యార్థులలో మతోన్మాద భావాలు పెంచి పోషించేలా పాఠ్య గ్రంథాలు రూపొందిస్తున్నది.
చరిత్రను కూడా పూర్తిగా మార్చివేసి సనాతన ధర్మాల ఆధారంగా చరిత్రను తిరగరాస్తున్నది. పాఠ్యాంశాల మార్పు, వీసీల నియామకంతో సహా అన్నిటి వెనుక ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తున్నది.
వైద్య విద్యకు నిర్వహించే “నీట్” ప్రశ్న పత్రాలు లీక్ అవడం, పరీక్షలు రద్దుచేసి తిరిగి నిర్వహించడం మామూలు విషయంగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో “నీట్” రద్దు చేయాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోన్న బీజేపీ..
ఈ సంవత్సరం సీబీఎస్ఈ పరీక్ష పత్రాలలో గందరగోళం నెలకొంది. చివరకు కేంద్ర మంత్రి తప్పును ఒప్పుకున్నారు.
కేంద్రం యూజీసీని నిర్వీర్య చేస్తున్నది. ప్రతిష్టాత్మక జేఎన్యూ లాంటి సంస్థల గొంతు నొక్కుతున్నది. విద్య రాష్ట్రాల పరిధిలో ఉండగా పీఎంశ్రీ పేరుతో రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నది.
విద్య వినిమయ వస్తువుగా మారిపోయింది. విచ్చలవిడిగా ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మారి తల్లిదండ్రుల మూల్గులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం లేదు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నీరు గారుస్తున్నది.
అణగారిన వర్గాల పేద పిల్లలు గత్యంతరం లేని పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు. మిగిలిన వారెవరు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ఎంత మాత్రం సిద్ధపడని పరిస్థితులను ప్రభుత్వం సృష్టించింది.
జీడీపీలో 6% నిధులు విద్యకు కేటాయిస్తే యూనివర్సిటీ స్థాయి దాకా అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందించవచ్చు. మరొకవైపు విద్యార్థుల మీద తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది. ర్యాంకుల పేరున పిల్లల మీద విద్యాసంస్థలు చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు.
ఏడాదికి సగటున సుమారు లక్ష ఏభై వేల మంది విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. సంవత్సరాల వారి వివరాలు పట్టికలో చూడండి.



ఉన్నత విద్యకు బడుగు బలహీన వర్గాల వారిని దూరం చేయడమే లక్ష్యంగా నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది.
ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు; ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు, అణగారిన వర్గాల వారిలో ఉన్నత విద్య, విద్యార్థుల ఆత్మ బలిదానాలు తదితర వివరాలన్నీ పట్టికలో ఉన్నాయి.
వార్తా పత్రికల ప్రకటనలలో ఇచ్చినదానికంటే ప్రైవేటు ఇంజనీరింగ్, మెడికల్ ఫీజులకంటే ఆచరణలో రెట్టింపుకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఫలితంగా వందల సంఖ్యలో వైద్య విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

