సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఏకే పట్నాయక్, మదన్ బీ లోకుర్తో సహా జడ్జీలు దేశవ్యాప్తంగా బాధిత పౌరులు, పౌర సమాజ గ్రూపులు, నిపుణుల సాక్ష్యాలను వింటారు.
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్)ను స్వతంత్రంగా పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఏకే పట్నాయక్, మదన్ బీ లోకుర్తో పాటు ఐదుగురు మాజీ న్యాయమూర్తులను ఒక దగ్గరకు లాయర్స్ అసోసియేషన్ ఫర్ కాన్స్టిట్యూషన్(ఎల్ఏఎఫ్సీ) చేర్చింది.
బీహార్‌లో 2025 వేసవి కాలంలో మొదలుపెట్టి, అప్పటి నుంచి 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తి చేసిన సర్ ప్రక్రియ, దాని ఫలితాలపై పౌరులు ఆందోళనలు లేవనెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిందని న్యాయవాదుల సంఘం పేర్కొంది.
జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బదర్ దుర్వేజ్ అహ్మద్, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రేఖ శర్మ, పాట్నా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అంజన ప్రకాశ్ ఈ స్వతంత్ర విచారణ కమీషన్లో భాగమవుతారు.
జడ్జీలు స్వతంత్ర విచారణ కమీషన్‌గా పనిచేసి డిసెంబర్ నాటికి ఒక నివేదికను సమర్పిస్తారని ఎల్ఏఎఫ్సీ తెలియజేసింది.
అర్హులైన ఓటర్లపై సర్ ప్రభావం, అనుసరించిన పద్ధతి, రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా దాని చెల్లుబాటును పరిశీలించడానికి ఐదుగురు జడ్జీల ప్యానల్ స్వయంప్రతిపత్తితో విచారణ జరుపుతుంది.
ఓటర్ల భారీ తొలగింపు.. చెలరేగిన నిరసనలు..
10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముసాయిదా జాబితాలో చేరడంలో విఫలమైన సుమారు 5.8 కోట్లతో సహా దాదాపు 13 కోట్ల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి సర్ తొలగించింది.
దేశవ్యాప్తంగా తొలగించబడ్డ ఓటర్ల తుది జాబితాను ఇంకా ప్రచురించలేదు.
రాష్ట్రాల వ్యాప్తంగా ఓటరు జాబితాలను కుదించడంతో ఈ దేశవ్యాప్త ప్రక్రియపై విస్తృతంగా ప్రజా నిరసనలు చెలరేగాయి.
గత ఏడాది నుంచి చేపట్టిన ఈ ప్రక్రియపై భారత ఎన్నికల సంఘంలో(ఈసీఐ) అంతర్గతంగా సమ్మతి లేని విషయాన్ని ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రిక బట్టబయలు చేసింది.
ఓటరు జాబితా నుంచి సామూహికంగా తొలగింపులు జరిగినట్లయితే తాము జోక్యం చేసుకోగలమని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది.
పశ్చిమ బెంగాల్‌లోని రేజినగర్, నందిగ్రామ్‌లో ఉప ఎన్నికలకు ముందుగానే ముసాయిదా జాబితాలో చేర్చకపోవడాన్ని వ్యతిరేకిస్తూ 18 వేల మంది ఓటర్లు చేసుకున్న విజ్ఞప్తి పెండింగ్‌లో ఉన్నదానిపై విచారణ చేపట్టడానికి ఇటీవల నిరాకరించింది.
“ఇవి కేవలం ఉప-ఎన్నికలు మాత్రమే, అంతే” అని ప్రధాన న్యాయమూర్తి అన్నట్లు బార్ అండ్ బెంచ్ తెలియజేసింది.
ఢిల్లీ, ముంబై, లక్నో, ఇతర ప్రాంతాల్లో అక్టోబర్ 2న నిరసనకారుల కీలక డిమాండ్ అయిన ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు సంబంధించి పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం చేపట్టనున్నది.
కమీషన్ విచారణ పరిధి
అనర్హులైన వారిని సరిగ్గా తొలగించేటప్పుడు అర్హత ఉన్న ప్రతి పౌరుడిని ఓటర్ల జాబితాలో సర్ అట్టెపెట్టిందా లేదా అన్నది మూల్యాంకనం చేయడంతో పాటుగా కమీషన్‌కు విచారణ పరిధి ఉంటుంది.
దేశవ్యాప్తంగా బహిరంగ విచారణల కోసం పూర్తి స్థాయి కమీషన్, దాని ప్రాంతీయ శాఖలు దేశవ్యాప్తంగా పర్యటిస్తాయి.
బాధిత పౌరులు, పౌర సమాజ గ్రూపులు, నిపుణుల సాక్ష్యాలను జడ్జీలు వింటారని ఎల్ఏఎఫ్సీ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా చేర్పులు, తొలగింపులపై అంకిత భావం గల పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేసింది.
న్యాయ జట్టుతో పనిచేసే ఈ విభాగం కమీషన్ ముందు తన పరిశోధన ఫలితాలను పెడుతుంది.
సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజు రామచంద్రన్, రెబెకా మామ్మెన్ జాన్, వృందా గ్రోవర్, ప్రశాంతో చంద్ర సేన్, చందర్ ఉదయ్ సింగ్, వరిషా ఫరాసత్, ప్రశాంత్ భూషణ్‌తో పాటు ఇతర న్యాయవాదులు కమీషన్‌కు న్యాయ సలహాదారులుగా ఉంటారు.
సీఈసీ కుమార్‌కు, సర్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు శుక్రవారం రాత్రి భారీ పోలీసు ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 3న కూడా ఈ నిరసనలు కొనసాగించనున్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
