తాజా పరిణామాలతో బంతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో పడింది.
ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు విచారణను యథావిధిగా కొనసాగిస్తారా లేక రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమిస్తారా అన్నది వేచి చూడాలి.
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమించడంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న 2023 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి పంపించే విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.
ఈ పిటిషన్లను మరింత విస్తృతమైన రాజ్యాంగ ధర్మాసనానికి విచారణ నిమిత్తం పంపించాలా లేక పంపించాల్సిన అవసరం లేదా అనే అంశంపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ పిటిషన్లను మరింత లోతైన పరిశీలన నిమిత్తం రాజ్యాంగ ధర్మాసనానికి పంపించాలన్న జస్టిస్ ఎస్పీ శర్మ ప్రతిపాదనలను జస్టిస్ దత్తా తోసిపుచ్చారు.
“తోటి న్యాయమూర్తి అభిప్రాయాలను అంగీకరించడం నావల్ల కావడం లేదు” అని జస్టిస్ శర్మ స్పష్టం చేశారు.
ప్రధాన న్యాయమూర్తి తుది నిర్ణయం
ద్విసభ్య ధర్మాసనంలో ఒక విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించాలా అక్కర్లేదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రధాన న్యాయమూర్తి మాత్రమే.
ఈ కేసులను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టు 2026 జూలై 30వ తేదీన రిజర్వ్ చేసింది.
అంటే ఆ అంశంపై తుది నిర్ణయం వెలువడవలసి ఉంది.
ఈ అంశంపై ఉభయపక్షాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.
2023 నియామక చట్టం వివాదం
కక్షిదారులు 2023లో పార్లమెంటు ఆమోదించిన భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక చట్ట రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తున్నారు.
2023 వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో భారత ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యుడిగా ఉండేవారు.
2023లో మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన చట్టం తర్వాత ఈ ఎంపిక కమిటీ కేవలం త్రిసభ్య కమిటీగా మారింది.
నాలుగో సభ్యుడిగా ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తికి ఈ కమిటీలో స్థానం లేకుండా పోయింది.
అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పిటిషన్ దారుల వాదనలు
ఈ చట్ట సవరణను సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, డాక్టర్ జయ ఠాకూర్, సంజయ్ నారాయణ మేశ్రాం, న్యాయవాది గోపాల్ సింగ్‌లు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
2023 తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో భారత ఎన్నికల సంఘాన్ని నియంత్రించే పూర్తి అధికారాలు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయని, ఇది ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తికి విఘాతమని పిటిషన్ దారులు వాదిస్తున్నారు.
ఈ కేసులను రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలని కేంద్ర ప్రభుత్వమే కోరింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
