పంచభూతాల గుండె గూటిలో
ప్లాస్టిక్ భూతం శాశ్వత
నివాస మేర్పరచుకుంటూనే వుంది
మన ఇంటి వినీలాకాశంలో
స్మార్ట్ ఫోన్లతో స్నేహం చేస్తూ
కర్బన ఉద్గారాల రహదారులు
తమ ఉనికితో విస్తరిస్తూనే ఉన్నాయి
కృత్రిమ రసాయనాలు
నేల తల్లి హృదయంలో చేరి
బీటల సుడిగుండాలను
ఏర్పర్చుతూనే వున్నాయి
డీజే సౌండ్ సరిహద్దులు దాటి
ఎన్నో మానవ గుండెల్లో
అలజడుల దాడులు చేస్తూనే వున్నాయి
కాలుష్యం గ్రహణం సోకి
భూ గ్రహం సౌరమండలంలో
గతమయ్యేలా వుంది
గ్లోబల్ వార్మింగ్ ఇ-వ్యర్థాలు
ఓజోన్ చిల్లులు
ఇలాంటివి లెక్కలేనన్ని
నేటి ఆధునాతపు సాంకేతిక
పత్రికల ముఖ కథనాలు
పచ్చటి ప్రకృతి
సంగీత ధ్వనులు
చెట్లపై పరవశించే
పక్షుల గానాలు
కేవలం కవుల రాతల్లోనే
కనిపిస్తూ వినిపిస్తున్నాయి
అర్థమవుతుందా..!
మన నిర్లక్ష్యపు అణుబాంబుకు
అవని ఆరిపోయే దీపమయ్యేలా ఉంది
మనందరి బాధ్యతారాహిత్యపు
పర్యావరణ యుద్దంలో మనమే
సమిధలం.. సమాధులం..
భవిష్యత్తంతా
ఓ కల్పిత కట్టు కథలా కనబడుతూ
బ్రతుకంతా వింత వ్యాధుల
విలయ తాండవమై విలపిస్తోంది
సస్టెయినబిలిటీ
నేటి మన నినాదం
చెట్ల క్షిపణులను పెంచడమే
నేటి మన విజ్ఞానం
ఆలస్యం ఎందుకు?
ఆచరణ పాఠాలకు
పరీక్షలు పెడదాం
పర్యావరణ పరిరక్షణలో
ప్రభాత కిరణాలమవుదాం
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536
