హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలకు ‘మార్గనిర్దేశం’ చేసే అమెరికా ప్రయత్నాలను ట్రంప్ నిలిపివేశారు. పాకిస్థాన్, ఇతర దేశాల విజ్ఞప్తి ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ చెప్పారు.
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఏర్పడిన సంక్షోభం బుధవారం(మే 6) నాటికి 68వ రోజుకు చేరుకుంది.
ఇరాన్ యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి సమయం ఇచ్చే ఉద్దేశ్యంతో, హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను బయటకు తీసుకొచ్చేందుకు మార్గనిర్దేశం(గైడ్) చేయాలన్న అమెరికా ప్రయత్నాలను తాను నిలిపివేస్తున్నట్లు మంగళవారం(మే 5) సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు.
అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా బలగాల దిగ్బంధనం అలాగే కొనసాగుతుందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు టెహ్రాన్‌తో ఒక ఒప్పందం ఖరారవుతుందో లేదో చూడటానికి, సోమవారం(మే 4) ప్రారంభమైన ఈ తాజా(నౌకల తరలింపు) ప్రయత్నాన్ని కొద్ది కాలం పాటు నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించారు.
“పాకిస్థాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు, అలాగే ఇరాన్‌పై సైనిక చర్యలో మనం సాధించిన అద్భుతమైన సైనిక విజయం, దానికి అదనంగా ఇరాన్ ప్రతినిధులతో పూర్తి మరియు తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి సాధించామన్న వాస్తవం ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు” ట్రంప్ చెప్పారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
