parties opposing SIR should boycott the elections
సార్వత్రిక ఓటుహక్కు భావన ను నిలువు లోతున పూడ్చి పెట్టారు. ఈ ప్రక్రియ లో ముస్లింలను ఓటర్ల జాబితా నుండి తొలగించడం అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన అంశం గానే ఉంది.
2026లో నాలుగు రాష్ట్రాల శాసనసభలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తమవుతున్న సందేశం ఒక్కటే. సార్వత్రిక ఓటు హక్కు శాశ్వతంగా భూస్థాపితం అయ్యింది. బెంగాల్ లో 27 లక్షల మంది ఓటర్లను తొలగించినా మనకి చీమకుట్టినట్టు లేకపోతే మనల్ని మనం ప్రజాస్వామిక దేశంగా పిలుచుకునే హక్కు కోల్పోయాము అని పరకాల ప్రభాకర్ ఆవేదన చెందారు.
ఈ 27 లక్షలమంది నీ ఓటు వేయనిస్తే బెంగాల్ ఎన్నికల ఫలితాలు మారేవా కాదా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. ఇపుడు దేశంలో రెండు తరగతులకు చెందిన ప్రజలున్నారు. ఒకరు శాశ్వతంగా ఓటు వేసే తరగతి. ఓటుహక్కు నిరాకరించబడిన తరగతి. ఇదే మనకు ఆందోళన కలిగించాల్సిన అంశం. సహజ హక్కుగా ఓటు అన్న స్థానం నుండి ప్రత్యేక వెసులుబాటు ఓటు హక్కు అన్న స్థితికి చేరుకున్నాము. ప్రభుత్వ ఎన్నికల సంఘం రూపొందించే నియమ నిబంధనల మేరకు కొందరికి మాత్రమే దక్కే వరంగా మారిందా ?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం హడావిడి గా అంతులేని వేగంతో ఓటర్ల జాబితా సవరణను చేపట్టింది. 91 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించింది. అందుబాటులో ఉన్న విశ్లేషణలను గమనిస్తే ఈ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం భారతీయ జనతా పార్టీకి నష్టదాయకం. తమ ఓటు హక్కు పునరుద్ధరించాలని ఓటర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించినపుడు మీరందరూ ఎన్నికల్లో పాల్గొనకపోతే ఇపుడు కొంపలు మునుగుతాయా అన్న ప్రశ్న ఎదురైంది! అంతా సరిగ్గా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయవచ్చులే అన్న ఊరట మాత్రం దక్కింది.
దీని పర్యవసానం ఏమిటి ? భారతదేశంలో వయోజనులు అయిన ప్రతి పౌరుడూ ఓటు హక్కు పొందలేరు. ఈ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకించిన పార్టీలతో సహా అన్ని పార్టీలు ఈ 27 లక్షలమంది ఓటర్లకు ఓటుహక్కు లేకుండానే ఎన్నికలకి వెళ్ళటానికి సిద్ధం అయ్యాయి. తద్వారా సార్వత్రిక ఓటుహక్కు భారతదేశంలో పుట్టిన వారికి అందరికీ ఉండే హక్కు కాదన్న సూత్రాన్ని అందరూ అంగీకరించారు అని అర్థమవుతోంది.
ఈ ఓటు హక్కు లేని వారి గురించి ఏ రాజకీయ పార్టీ పట్టించుకునే స్థితిలో లేదన్నది ఈ ఎన్నికల్లో కళ్ళముందు కనిపిస్తున్న నిజం. ఇటువంటి పరిస్థితుల్లో భవానిపూర్ నియోజకవర్గంలో 47 వేల ఓట్లు రద్దు చేసిన తర్వాత మమతా బెనర్జీ 15వేల ఓట్ల తేడాతో ఓడి పోయారని వాపోవడంలో అర్థం ఏముంటుంది ? కనీసం తన సొంత నియోజకవర్గంలో 47 వేలమంది ఓటర్లను తొలగించిన తర్వాత మమతా బెనర్జీ ఆ నియోజకవర్గంలోనూ ఆ మాటకొస్తే అసలు ఈ ఎన్నికల్లోనే పోటీ చేయను అని నిర్ణయించుకుంటే కనీసం ఆమెకు నైతిక విజయం దక్కేది. కానీ ఇపుడు కాదు.
మరికొందరు రాష్ట్రంలో 27 లక్షల మంది ని ఓటర్ల జాబితా నుండి తొలగించిన తర్వాత కూడా తృణమూల్ కంటే బిజెపికి కేవలం 13 లక్షల ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయని అంటున్నారు. ఒకవేళ ఆప్టర్ల జాబితా నుండి తొలగించబడిన వాళ్లంతా ఓటు వేస్తే పరిస్థితులు తరుమారేవా అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా ఇపుడు విలువ లేదు. ఎందుకంటే అటు ప్రతిపక్ష బీజేపీ కానీ మొన్నటివరకూ పాలకపక్షంగా ఉన్న తృణమూల్ కానీ ఈ ఓటర్లు ఓటు వేయకున్నా పర్లేదు అనే భావంతోనే ఎన్నికల గోదాలో దిగాయి. అర్థం ఏమిటి ? బతికుండగానే ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన ఓటర్ల తో సంబంధం లేకుండానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.
సుప్రీంకోర్టు గాని ఎన్నికల కమిషన్ గాని ఆదుకోవడానికి సిద్ధంగా లేని ఓటర్లను ఆదుకోవడానికి ఏ రాజకీయ పార్టీ సిద్ధం కాలేదు. ప్రజాస్వామిక వ్యవస్థలోనే అతిపెద్ద ఘాతూకం ఇది. ఈ ఘాటుగా దాడిలో గాయపడిన వారికి అండగా నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు ఎన్నికల ప్రక్రియలు పాల్గొనేది లేదు అని ప్రవహించకపోవడం బిజెపియేతర ప్రతిపక్ష పార్టీలందరూ చేసినటువంటి పొరపాటు. ఎస్ ఐ ఆర్ లో భాగంగా తొలగించబడిన ఓటర్లందరికి హోటల్ జాబితాలో అవకాశం కల్పించాలని కోరుతూ మమత బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇది వాస్తవం. కానీ బ్రతికున్న వారు ఓటింగ్ లో పాల్గొనటానికి అవకాశం లేదంటూ తీసుకున్న నిర్ణయం తిరగదు అంతవరకు ఎన్నికలలో పాల్గొనటంలో అర్థం లేదని ప్రకటించేంత సాహసం చేయలేకపోయారు.
ఓటర్లు తమను సమర్ధించాలని రాజకీయ పార్టీలు కోరుకోవాటానికి ముందు ఆ రాజకీయ పార్టీలు ఆ ఓదెల తరఫున నిలబడతామని నిరూపించుకోవాలి. భరోసా కల్పించాలి. దురదృష్టవశాత్తూ ఈ విషయంలో రాజకీయ పార్టీలు విఫలం అయ్యాయి.
అస్సాంలో కూడా ఇటువంటి పరిణామం జరిగింది. ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు ఓటమిపై వారి ప్రభావం లేకుండా ఉండే విధంగా హోటల్లో జాబితా సవరణ జరిగింది.
బిజెపి వ్యతిరేక ఓటర్లను ఓ మూలక నేటి బిజెపి దాని అనుకూల భాగస్వాముల కు ఓటు వేసే వారిని నియోజకవర్గము మొత్తం విస్తరించేలా చేయటం అస్సాంలో జరిగిన ముఖ్యమైన కసరత్తు. స్థూలంగా బిజెపి యాత్ర పార్టీలు ఆయా నియోజకవర్గాలలో 72 8 శాతం ఓట్లు సంపాదించినప్పటికీ అసెంబ్లీలో పొందిక మారే అవకాశం లేని పద్ధతుల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, సరిహద్దులు మార్చటం జరిగింది.
ముస్లింలను ఎన్నికల పరంగా కొన్ని వీధులకు వాడలకు పరిమితం చేసే వ్యూహమే ఇది.
ఈ విధంగా భారతీయులు రెండు తరగతులుగా విభజించబడుతున్నారు. ఒక తరగతి ఓటు హక్కు కలిగిన వారు. మరో తరగతి ఓటు హక్కు కోల్పోయిన వారు. వీరిద్దరి మధ్య ఎటువంటి సౌహార్ద్ర సంబంధాలు ఉండే అవకాశం లేదు. ఓటు హక్కు కోల్పోయిన తరగతికి చెందిన వ్యక్తులు ఏదో ఒకటి చేసి ఓటు హక్కు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఓటు హక్కు కోల్పోయే వారిలో ఎక్కువ మంది ముస్లింలే అన్న విషయాన్ని ధారణ అయితే ఈ అంశం పట్ల పెద్దగా వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం లేదు..
మొత్తంగా ముస్లింలను ఓటు హక్కుకు దూరం చేసే అవకాశం లేని సందర్భాలలో వారు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపలేని విధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. వారి ప్రభావం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటులో వారికి ఎటువంటి ప్రమాణము ప్రాథమిక లేని విధంగా ఎన్నికల క్రమం మారుతుంది.
2026 అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ అస్సాం లలో జరిగిన ప్రయోగం ఒక విషయాన్ని నిర్ధారిస్తోంది. భారతదేశపు భూభాగ పరిధిలోపలే ముస్లిం ల ప్రయోజనాలకు హిందువుల ప్రయోజనాలకు పరస్పర విరుద్ధమైన పద్ధతిలో భారత దేశాన్ని పొన్నం నిర్మించడం అన్న వినాయక దామోదర్ సావర్కర్, మాధవ్ సదాశివ గోల్వాల్కర్ ల ప్రాజెక్టుకు ఆచరణాత్మక రూపం ఇచ్చే ప్రయత్నమే ఇది. ఈ దేశంలో ముస్లింలు భౌతికంగా జీవనం కొనసాగించవచ్చు. కానీ వారికి ఉన్న రాజకీయ ప్రాతినిధ్యం ప్రాధాన్యత శాశ్వతంగా భూస్థాపితం అవుతుంది. ముస్లిం ప్రజానీకానికి ఎటువంటి ప్రజాతంత్ర జీవనం లేని పరిస్థితులు ఏర్పడతాయి.
అపూర్వానంద్
అనువాదం కొండూరి వీరయ్య
అపూర్వ నంద్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధిస్తారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
