సెంట్రల్ ఢిల్లీ పరిసరాల్లో గుమిగూడిన జర్నలిస్టులు, కార్యకర్తలు, విద్యార్థులతో పాటు ఒక ఎంపీపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
గత మూడు రోజులుగా వేలాది మందితో జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరిగాయి. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, నేహా బోరాతో సహా వామపక్ష విద్యార్థి సంఘాల నేతృత్వంలో ప్రతిపక్షాలు అక్టోబర్ 12న సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించాయి.
జంతర్ మంతర్ ప్రాంతం డీనోటిఫై
ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఇకముందు నిరసనలను పూర్తిగా నిషేధించేలా ఆ మొత్తం ప్రాంతాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రాంలీలా మైదానంతో పాటు బురారీ మైదానం, తూర్పు ఢిల్లీలోని సీబీటీ గ్రౌండ్స్‌ను నిరసన వేదికలుగా ప్రభుత్వం ఖరారు చేసింది.
సీజేపీ నాయకుల నిర్బంధం
ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ స్థలాన్ని తిరిగి పొందడానికి మంగళవారం ఉదయం ప్రయత్నించిన సీజేపీ నాయకులను పోలీసులు నిర్బంధించారు.
ఈ మార్చ్‌లో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి సరిహద్దు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నిరసనకారులు ఢిల్లీకి చేరుకున్నారు.
అనుమతి నిరాకరణ, మెట్రో స్టేషన్ల మూసివేత, యువజన, విద్యార్థి నాయకుల నిర్బంధం, రైల్వే సేవల రద్దు, భారీ భద్రతా బలగాల మోహరింపు వంటి చర్యలతో ముందుగా నిర్ణయించిన నిరసనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
