ఉపాధికి ప్రాధాన్యతనిచ్చే వ్యూహాన్ని అమలు చేయడానికి రూపొందించిన 15వ పంచవర్ష ప్రణాళిక(2026–2030)ను చైనా కార్యనిర్వాహక మండలి సమావేశం ఆమోదించింది.
అనంతరం మానవ వనరులు, సామాజిక భద్రత మంత్రిత్వ శాఖ, పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు, అలాగే నిపుణులు దేశంలోని ఉపాధి పరిస్థితులు, పారిశ్రామిక అభివృద్ధిపై తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.
పట్టభద్రుల ఉద్యోగ అవసరాలపై దృష్టి సారిస్తూ- మానవ వనరులు, సామాజిక భద్రతా శాఖలు అధిక నాణ్యత కలిగిన ఉపాధి విధానాలు, సేవలను కొనసాగిస్తూ, ఉపాధి అవకాశాలను విస్తరించి మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తాయని తెలిపారు.
15వ పంచవర్ష ప్రణాళిక కాలమంతా ఉపాధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చే వ్యూహాన్ని అనుసరించడం అవసరం.
అధిక నాణ్యతతో కూడిన సంపూర్ణ ఉపాధి లక్ష్యాన్ని జాతీయ ఆర్థిక- సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేయాలి.
ప్రణాళిక నిర్దేశించుకున్న ముఖ్య లక్షణాలు..
పరిశ్రమలు, ఉపాధి మధ్య సమన్వయాన్ని పెంచాలి. పారిశ్రామిక వ్యవస్థను మెరుగుపరచి ఆధునీకరించేందుకు మరింత కృషి చేయాలి.
అధిక సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగల ముఖ్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రభుత్వ అధికారులు పరిశ్రమల క్రమబద్ధమైన పునర్వ్యవస్థీకరణకు మార్గనిర్దేశం చేయాలి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, హరిత ఆర్థిక వ్యవస్థ, సిల్వర్ ఎకానమీ వ్యవస్థ వృద్ధికి కొత్త అవకాశాలను కల్పించాలి.
ఉపాధి సమస్యలకు మూల పరిష్కారం అభివృద్ధిలోనే ఉంది.
రాష్ట్ర మండలి సమావేశంలో పేర్కొన్న అవసరాల ప్రకారం, స్థానిక ప్రభుత్వాలు ఉపాధిని నిరంతరం కొనసాగించే పరిశ్రమలను అభివృద్ధి చేయాలి.
ప్రస్తుత పరిశ్రమలను ఆధునీకరించి మరిన్ని ఉద్యోగాలను సృష్టించాలి. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలను మెరుగ్గా రక్షించి ఉపాధి నాణ్యతను పెంచాలి.
ఉద్యోగార్థులు, యజమానుల అవసరాల మధ్య ఉన్న నిర్మాణాత్మక అసమతుల్యతను పరిష్కరించడానికి వృత్తి నైపుణ్య శిక్షణ ఒక ముఖ్యమైన చర్య.
మెరుగుపరచాల్సిన కార్యక్రమాలు..
కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరచడం సంప్రదాయ పరిశ్రమల అభివృద్ధి, కొత్తగా ఎదుగుతున్న పరిశ్రమల ప్రోత్సాహం, భవిష్యత్ పరిశ్రమల నిర్మాణ లక్ష్యాల సాధనకు కీలకం.
అందువల్ల మరింత మంది కార్మికులు వృత్తిపరమైన నైపుణ్యాలను సంపాదించి, ఉద్యోగాలు పొందుతూ, ఆదాయాన్ని పెంచుకునేలా శిక్షణా కార్యక్రమాల నాణ్యతను నిరంతరం మెరుగుపరచాలి.
కొత్త నాణ్యత ఉత్పాదక శక్తులు, దేశ కొత్త పారిశ్రామికీకరణ పరస్పరం దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి.
ఇవి ఒకదానికొకటి పురోగతికి తోడ్పడతాయి. శాస్త్రీయ, సాంకేతిక ఆవిష్కరణలు రెండింటిని సమన్వయం చేయడానికి కీలక సాధనంగా పనిచేస్తాయి.
కొత్త పారిశ్రామికీకరణలో అధునాతన సాంకేతికత, మెరుగైన ఆర్థిక ఫలితాలు, తక్కువ వనరుల వినియోగం, కనిష్ట పర్యావరణ కాలుష్యం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది కొత్త నాణ్యత ఉత్పాదక శక్తుల అభివృద్ధికి అనుగుణంగా ఉంటుంది. శాస్త్రీయ, సాంకేతిక ఆవిష్కరణలు రెండింటి మధ్య మెరుగైన అనుసంధానానికి స్పష్టమైన మార్గాలను అందిస్తాయి.
అభివృద్ధిలో స్థిరమైన పురోగతి..
భవిష్యత్ పరిశ్రమల అభివృద్ధికి చేసే ప్రయత్నాలు కొత్త ఉత్పాదక శక్తుల అభివృద్ధిని, అలాగే ఆధునిక పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధిని ముందుకు నడిపిస్తాయి. భవిష్యత్ పరిశ్రమల అభివృద్ధి దేశ అధిక నాణ్యతాభివృద్ధికి తోడ్పడటంతో పాటు, అన్ని రంగాలలో ఆధునిక సామ్యవాద చైనాను నిర్మించడానికి అవసరమైన పారిశ్రామిక పునాదిని బలోపేతం చేస్తుంది.
చైనా పరిశ్రమల అభివృద్ధిలో స్థిరమైన పురోగతిని సాధించింది. కొన్ని కీలక రంగాలలో ముందస్తు ప్రయోజనాలను పొందింది.
అయినప్పటికీ, స్వతంత్ర ఆవిష్కరణ సామర్థ్యం తక్కువగా ఉండటం, కీలక, మూల సాంకేతికతల విషయంలో ఇతరులపై ఆధారపడటం, మరింత మెరుగైన ఆవిష్కరణ,
పర్యావరణ వ్యవస్థ, అలాగే తొలగించాల్సిన సంస్థాగత- విధానపరమైన అడ్డంకులు వంటి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి.
చైనా డైలీ పత్రిక సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
అనువాదం: డి. వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
