విద్యా సంస్కరణలపై తమ ప్రణాళికను విడుదల చేసే సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రణాళికలో భాగంగా తన మద్దతుదారులతో కలిసి దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్టు; ఒక్కో సమస్యపై ఒక్కొక్క ఆందోళన నిర్వహించనున్నట్టు పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ పేర్కొన్నారు.
2026 జూన్ 11న గురువారంనాడు మహారాష్ట్రలోని పూణేలో సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీలో నిరసన కార్యక్రమం జరిగింది.
దేశవ్యాపితంగా ప్రభుత్వ పరీక్షల నిర్వహణకు సిఫార్సులు చేస్తూ ఒక ప్రణాళికను విడుదల చేసే సందర్భంగా అభిజిత్ మాట్లాడారు.
పార్టీ కార్యాచరణ..
“తన తప్పును ప్రభుత్వం ఒప్పుకొని కనీసం రాజీనామా కూడా చేయకపోతే, వారికి మనం విద్యాశాఖ బాధ్యతను ఎలా అప్పగిస్తాము?”అని అభిజిత్ దీప్కే ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. తన తప్పును అంగీకరించడంతోనే బాధ్యతాయుత పాలన మొదలు కావాలని అన్నారు.
తాను దేశవ్యాప్తంగా పర్యటిస్తూ యువకులకు దేశ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తానని దీప్కే తెలియజేశారు. ఒక్కోసారి ఒక సమస్యను మాత్రమే తీసుకొని విద్యార్థులలో అవగాహన కల్పిస్తానన్నారు.

“ఇప్పటికీ మా పార్టీ ప్రారంభించి 15 రోజులు మాత్రమే అయింది. మా కార్యాచరణ నిర్ణయించుకోవడానికి కొంత సమయం కావాలి. ప్రభుత్వానికి 12 సంవత్సరాల కాలం ఇచ్చిన ప్రజలు మాకు కనీసం 12 వారాల వ్యవధిని ఇవ్వండి” అని దీప్కే కోరారు.
వాంగ్చుక్ మద్దతు..
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, పూణేలోని సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ వద్ద తాము తలపెట్టిన నిరసనకు వాంగ్చుక్, మరికొంతమంది ప్రొఫెసర్లు మద్దతు తెలిపినట్టుగా దిప్కే తెలియజేశారు.
“మా నిరసనకు పోలీసు అనుమతి కూడా ఉన్నది. ఢిల్లీ తర్వాత పూణేని ఏంచుకోవడానికి కారణం పూణేకి “ఈస్ట్ ఆఫ్ ఆక్స్ఫర్డ్” అని పేరుంది. ఎస్పీపీయూకు ప్రఖ్యాత విద్యాసంస్థలలో 2020 సంవత్సరానికి 12వ స్థానం దక్కింది. కానీ ప్రస్తుతం అది 91వ స్థానానికి పడిపోయింది” అని దీప్కే వాపోయారు.
“ఈ ఉద్యమం అకస్మాత్తుగా ప్రారంభమైంది. నేను ట్వీట్ చేసిన రోజు ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను. నేను అక్కడ సంతోషంగా ఉన్నాను. కానీ సీజేపీకి వచ్చిన అనూహ్య స్పందన నన్ను ఇలా ఆలోచించేలా చేసింది”అని తమ ఉద్యమ ప్రస్థావన గురించి దీప్కే వివరించారు.
సీజేపీని అనుసరించే వారిని నిర్మించి, నిర్వహించి, బదలాయించేవారుగా వ్యాఖ్యానించడంపై దీప్కే స్పందించారు.
“బీజేపీ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సీజేపీ అనుయాయులలో సగం మంది పాకిస్తానీ వారని ఆరోపించారు. కానీ వాస్తవంగా సీజేపీని అనుసరించే వాళ్ళు 94.5 శాతం మంది భారతీయులే”అని తెలియజేస్తూ, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి ప్రకటించినట్లుగా దీప్కే చెప్పారు.
“వారిని పాకిస్తాన్కు చెందిన వాళ్ళుగా ఎందుకు పిలుస్తున్నారు? సీబీఎస్ఈ విద్యార్థులు పాకిస్తానీవారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు పాకిస్తాన్ వారా? నేను దేశద్రోహినా? మరి భారతీయులు ఎవరు? కేవలం బీజేపీ ఐటి సెల్ మాత్రమే భారతదేశానిదా?” అని దీప్కే ఘాటుగా కేంద్ర ప్రభుత్వాన్ని, కిరణ్ రిజిజును ఉద్దేశ్యించి ప్రశ్నించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
