భారతదేశానికి చెందిన ప్రముఖ రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కేసులో ఆరుసార్లు బీజేపీ ఎంపీగా పనిచేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా విముక్తి చేసింది.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాజీ ఎంపీ, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కనీసం ఐదుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ ఆరోపణల నేపథ్యంలోనే దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు న్యూఢిల్లీలో వారాల తరబడి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
సహ నిందితుడు కూడా…
రౌస్ అవెన్యూ కోర్టుకు చెందిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ ఆగస్టు 3న ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు లైవ్‌లా నివేదించింది.
ఈ కేసులో సింగ్ ఇదివరకే బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ కేసులలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ కూడా సహ నిందితుడిగా ఉన్నారు.
రహస్యంగా విచారణ..
ఈ కోర్టు విచారణ ప్రక్రియ ప్రైవేట్‌గా అంటే సాధారణ ప్రజల వీక్షణకు దూరంగా జరిగింది. మహిళా రెజ్లర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ రెబెక్కా జాన్ వాదించగా, బ్రిజ్ భూషణ్ సింగ్ తరఫున అడ్వకేట్ రాజీవ్ మోహన్ హాజరయ్యారు.
రెజ్లర్ల ఆరోపణలు ఇవే..
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా రెజ్లర్లు తీవ్ర ఆరోపణలు చేశారు.
వృత్తిపరమైన సహాయం అందిస్తామని చెప్పి లైంగిక కోరికలు తీర్చాలని కోరడం, వేధింపులకు గురిచేయడం, అనుచితంగా ప్రవర్తించడం, ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన వారిని బెదిరించడం వంటి తీవ్రమైన అంశాలను తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనలు..
భారతదేశానికి చెందిన ప్రముఖ మహిళా, పురుష రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరుల నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, పోలీసుల నిష్క్రియాత్మకతను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు.
ఈ క్రమంలో వారు తమ అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలను కూడా తిరిగి ఇచ్చేశారు. ఆ సమయంలో పోలీసులు ఈ నిరసనలపై ఉక్కుపాదం మోపారు.
రెండు ఎఫ్ఐఆర్ల నమోదు..
2023 జూన్ 15న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకటి భారత శిక్షా స్మృతి కింద నమోదవ్వగా, చిన్న వయస్కురాలైన రెజ్లర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది.
అయితే, ఆ మైనర్ రెజ్లర్ తర్వాత బ్రిజ్ భూషణ్‌పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుంది.
సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పినా..
2023లో, మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై విచారణ జరపడానికి తగినంత సాక్ష్యాధారాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేశారు.
బ్రిజ్ భూషణ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో, నిరసన తెలిపిన రెజ్లర్లలో ఒకరైన ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ డిసెంబర్లో రెజ్లింగ్ క్రీడకు వీడ్కోలు పలికారు.
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రసంగిస్తూ మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇస్తున్న సమయంలో, లోక్‌సభలో బీజేపీ ఎంపీల మధ్య వారి వెనుక వరుసలలో బ్రిజ్ భూషణ్ కూర్చుని కనిపించారని ది వైర్ నివేదించింది.
కొనసాగుతున్న కుటుంబ రాజకీయాలు..
కైసర్‌గంజ్ నియోజకవర్గం నుండి బ్రిజ్ భూషణ్ తన సీటును కోల్పోయినప్పటికీ, భారతీయ జనతా పార్టీ ఆ సీటును ఆయన కుటుంబంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది.
ప్రస్తుతం ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ అక్కడ నుండి ఎంపీగా ఉన్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్ వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఉన్నావో అత్యాచారం కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఇటీవల ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసిన తర్వాత, గత సంవత్సరం ఆయన సెంగర్‌కు మద్దతుగా బహిరంగంగా మాట్లాడారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
