తాజాగా ముగిసిన బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 529 కోట్లు ఖర్చు పెట్టింది. అందులో ఒక్క బెంగాల్లోనే 286 కోట్లు ఖర్చు పెట్టింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల ప్రకారం బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికల్లో బీజేపీ 529 కోట్లు ఖర్చు పెట్టింది. అందులో 286 కోట్లు కేవలం బెంగాల్లోనే ఖర్చు అయింది.
గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బీజేపీ ఖాతాలో 7689 కోట్లు నిల్వ ఉన్నాయి. మరో 1494 కోట్లు నగదు కూడా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆదాయ వివరాల్లో బీజేపీ వెల్లడించింది.
పార్టీల ఖర్చుపై లేని నియంత్రణ
బెంగాల్లో 217.16 కోట్లు ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసినట్లు, మరో 69.83 కోట్లు అభ్యర్థుల తరఫున ఖర్చు పెట్టగా, మరో 58.80 కోట్లు నేరుగా అభ్యర్థులకు ఇచ్చినట్టు పార్టీ సమర్పించిన వివరాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల వ్యయ నిబంధనల ప్రకారం అభ్యర్థులు పెట్టే ఖర్చుపై మాత్రమే నియంత్రణలు ఉన్నాయి తప్ప, పార్టీలు పెట్టే ఖర్చుపై ఎటువంటి నియంత్రణలు లేవు.
ఇదిలా ఉండగా అస్సాంలో ప్రచారానికి 96.26 కోట్లు ఖర్చు పెట్టగా, కేరళలో 82.67 కోట్లు, తమిళనాడులో 11.89 కోట్లు ఖర్చు పెట్టింది.
