న్యూఢిల్లీ : ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్టు వాదనలను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.
2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనక భారీ కుట్ర ఉన్నదన్న ఆరోపణలతో ఈ ఇద్దరు పరిశోధక విద్యార్థులు ఆరేళ్ళకు పైగా విచారణ లేకుండానే జైల్లో మగ్గుతున్నారు.
వీరి బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో జరగాల్సిన వాదనలను జస్టిస్ ప్రతిభా సింగ్, జస్టిస్ దినేష్ భట్ల నేతృత్వంలోని ధర్మాసనం ప్రాసిక్యూషన్ వారి అభ్యర్థన మేరకు విచారణ వాయిదా వేసినట్టు లైవ్ లా కథనం తెలియచేస్తోంది.
ఢిల్లీ పోలీసుల తరఫున వాదించాల్సిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అనారోగ్యంతో ఉండటం వలన ఈ వాయిదా కోరినట్టు సమాచారం.
నవంబర్ 4కి తాహిర్ హుస్సేన్ కేసు..
మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కేసు కూడా నవంబర్ 4కి వాయిదా వేసింది ధర్మాసనం.
తమ బెయిల్ దరఖాస్తు తిరస్కరణను సవాలు చేస్తూ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లు విడివిడిగా అప్పీల్ దాఖలు చేసుకున్నారు.
ఇమామ్ బెయిల్ దరఖాస్తు ఇప్పటికీ రెండు సార్లు తిరస్కరణకు గురి అయితే ఉమర్ బెయిల్ దరఖాస్తును మూడు సార్లు తిరస్కరించారు.
వారిపై ఉపా చట్టంలోని సెక్షన్ 13, 16, 17, 18లతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ కింద వీరిపై అభియోగాలు మోపబడ్డాయి.
హైకోర్టును ఆశ్రయించిన ఉమర్, షర్జీల్..
జూలై 4వ తేదీన ఉమర్, ఇమామ్ల బెయిల్ దరఖాస్తును జిల్లా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చట్టం సెక్షన్ 24 కింద హైకోర్టులో వీరిరువురూ అప్పీల్ దాఖలు చేసుకున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి ఇద్దరికీ బెయిల్ తిరస్కరిస్తున్నట్లు జిల్లా కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. తనకు మరో ప్రత్యామ్నాయం లేదని కూడా ఆయన తెలిపారు.
ఈ సంవత్సరం జనవరిలో జరిగిన వాదనల అనంతరం సుప్రీంకోర్టు వీరిద్దరికి బెయిల్ తిరస్కరించింది.
షర్జీల్, ఉమర్లతో పాటు అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొకరు విడుదలయ్యారు. ప్రత్యేక ధర్మాసనం ఈ వివాదాస్పద ఆదేశాలపై సందేహాలు వ్యక్తం చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
