హిమాలయ పర్వత శ్రేణుల మధ్య వెలసిన భారతదేశపు అత్యంత పవిత్ర తీర్థ క్షేత్రాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి తమ మొక్కుబడులను, విరాళాలను సమర్పిస్తుంటారు. అలాంటి పవిత్ర స్థలంలోనే హుండీ నిధులు, కానుకల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాయి. ఓక వైపు అయోధ్య రామాలయం నిధుల కుంభకోణం పై దర్యాప్తు జరుగుతుండగానే ఇప్పుడు బద్రీనాథ్ ఆలయం కూడా దానికి తొడయింది. రానున్న రోజులలో మరెన్ని కుంభకోణాలు వెలుగులోకి రానున్నాయో. ఈ రెండు రాష్ట్రాలు బి. జె. పి. పాలనలో ఉన్నాయి. రాముడు, దైవ భక్తి కి తామే ప్రతికలమని బాజాలు వాయించుకునే బి. జె. పి అసలు రంగు బయట పడుతున్నది. దేముడి ఆస్తినే కాపాడలేని పార్టీ దేశాన్ని కాపాడ లేదని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి.
బద్రీనాథ్ ఆలయంలో భక్తులు సమర్పించిన నగదు, కానుకల నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఇటీవల సోషల్ మీడియా, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆరోపించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆలయ పరిపాలన బాధ్యతలు నిర్వహిస్తున్న బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ స్వతంత్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలను వెలికితీస్తామని కమిటీ ప్రకటించింది. (The Indian Express) ప్రాథమిక సమాచారం ప్రకారం, హుండీలలో చేరిన నగదు లెక్కింపు, భద్రపరిచే ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని వర్గాలు ఆలయ సిబ్బందిలో కొందరి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేయగా, దీనిపై సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాలని కోరారు. (The Times of India)
భక్తుల విరాళాలు కేవలం నగదు రూపంలోనే కాకుండా బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ రూపంలో కూడా వస్తుంటాయి. ఈ నిధులు ఆలయ నిర్వహణ, యాత్రికుల సౌకర్యాల అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు వినియోగించబడతాయి. అలాంటి నిధుల భద్రతలో నిర్లక్ష్యం లేదా అక్రమాలు చోటుచేసుకుంటే అది కేవలం ఆర్థిక నేరమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై దెబ్బ కొట్టినట్టే అవుతుంది.
ఈ సంఘటన నేపథ్యంలో ఆలయ కమిటీ విరాళాల లెక్కింపు, నిల్వ, బ్యాంకు జమ ప్రక్రియలపై మరింత కఠిన నిఘా వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేయడంతో పాటు, ప్రతి లావాదేవీని డిజిటల్ రికార్డింగ్ ద్వారా నమోదు చేసే చర్యలను చేపడుతోంది. (Hindustan Times)
భారతీయ సంస్కృతిలో ఆలయాలు కేవలం ఆరాధనా కేంద్రాలు మాత్రమే కాదు. అవి సమాజ విశ్వాసం, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. అందువల్ల దేవాలయ నిధుల నిర్వహణలో అత్యున్నత స్థాయి పారదర్శకత, జవాబుదారీతనం అవసరం. బద్రీనాథ్ ఘటన పై జరుగుతున్న విచారణ నిజాలను వెలికి తీసి, దోషుల పై కఠిన చర్యలు తీసుకుంటేనే భక్తుల విశ్వాసం పునరుద్ధరించ బడుతుంది.
దేవాలయ సంపద దేవుడి సొత్తు మాత్రమే కాదు. అది కోట్లాది మంది భక్తుల శ్రమ, భక్తి, విశ్వాసాల సమాహారం. ఆ విశ్వాసాన్ని కాపాడటం ప్రతి ఆలయ పరిపాలన సంస్థ యొక్క ప్రథమ బాధ్యత.
ఆర్.లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
