అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితచరిత్రను “బిలీవర్స్ డైలమా: వాజ్‌పేయీ అండ్ ది హిందూ రైట్స్ పాత్ టూ పవర్” అనే పేరుతో రచయిత అభిషేక్ చౌధరి పుస్తకాన్ని తెచ్చారు. ఈ పుస్తకం ఉదారవాద రాజకీయాలు, ప్రజాస్వామ్య ఆదర్శాల పట్ల అటల్ బిహారీ వాజ్‌పేయీ అభిప్రాయాలను చర్చకు పెడుతోంది. వాజపేయీ నాయకత్వం వహించిన పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తరం నాయకులు వాజపేయిని, ఆయన ఉదారవాద విధానాలను పక్కకు నెట్టేసి ముందుకెళ్తున్నారు. ఈ పరస్పరవిరుద్ధమైన సంఘర్షణ కేవలం బీజేపీ గతినే కాదు, భారతీయ రాజకీయాలను మార్చేసి హిందుత్వంవైపు వంచింది.
డా ప్రజల్ సింగ్

ఈ సమస్త లోకానికి నేను గురుమహాత్ముడను
నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది
నేను కూడా మనిషి అంశానికి చెందినవాడినే,
ఎందుకు చేయకూడదు ఏదైనా విశేషమైన పని?
తన రాజకీయ ప్రయాణంలో పదేపదే ఏ సంఘర్షణయితే కనిపిస్తుంటుందో, అదే సంఘర్షణ అటల్ బిహారీ వాజ్‌పేయీ రాసిన ఈ వాక్యాలలో తొణికిసలాడుతుంది. ఓవైపు కవి ఆదర్శవ్యక్తిత్వం, మరో వైపు అధికారం- సంస్థ కఠినమైన రాజకీయాలు. అభిషేక్ చౌధరి పుస్తకం “బిలీవర్స్ డైలమా: వాజ్‌పేయి అండ్ ది హిందూ రాయిట్స్ పాత్ టూ పవర్ 1977- 2018” దీనికి సంబంధించిన వాజ్‌పేయీ సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తుంది. ఈ పుస్తకం వాజ్‌పేయీ జీవితానికి అభిషేక్ రాసిన చివరి భాగం.
ఇందులో ప్రజాస్వామ్య ఆదర్శాల ప్రతిబింబంగా ఆయన కొన్నిసార్లు కనబడతారు. అయితే మరికొన్నిసార్లు హిందుత్వ రాజకీయ ఒత్తిడిలో ఒప్పందాలు చేస్తూ కనిపిస్తారు. దీని చారిత్రక, రాజకీయ విశ్లేషణ కోసం దీనిని “విశ్వాసి సందిగ్ధత” అని చౌధరి చెప్పారు. వాజ్‌పేయీని కేంద్రబిందువుగా పెట్టిన ఈ పుస్తకం, కేవలం ఒక నాయకుడి జీవితమే కాదు- స్వాతంత్ర్యం తర్వాత భారతీయ ప్రజాస్వామ్య మారుతున్న రాజకీయ, హిందూత్వ ఆలోచన సంక్లిష్టత, బీజేపీ- జన్‌సంఘ్ ఎగుడు దిగుళ్లతో కూడిన ప్రయాణానికి సంబంధించిన సజీవ చరిత్ర కూడా.
తన రాజకీయ దీక్షను జనసంఘ్ నుంచి వాజ్‌పేయీ స్వీకరించిన రోజులతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రమశిక్షణ నుంచి బయటకు వచ్చిన వాజ్‌పేయీ-దేశ రాజకీయాలలో తన గొంతు, తన కవిత, తన సహజత్వమైన ధోరణి ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. దానిని కొనసాగించారు. కానీ, సంఘ్‌పరివార్ కఠిన సైద్ధాంతిక సరిహద్దుల లోపల ఉండి, దేశ రాజకీయ అతిపెద్ద వేదిక మీద ఎలా ఆమోదయోగ్యంగా మారాలనే సంఘర్షణను ఆయన ఎదుర్కొనేవారు.
“వాజ్‌పేయీ తన ఈ స్థితికి మాడరేషన్ వ్యూహాన్ని ఉపయోగిస్తూ ముందుకు వెళ్లేవారు. కానీ, ఇది మాడరేషన్ సిద్ధాంతవ్రత్యమా లేక ఒక ఆచరణాత్మక రాజకీయ ఎత్తుగడ? అనే ప్రశ్న మీద పుస్తకం దాదాపుగా మౌనం వహించింది. వాజ్‌పేయీ కవితాత్మక స్వరం, సహజసిద్ధమైన వ్యక్తిత్వం ఎటువంటి సందేహం లేకుండా ఆయనకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. ఆయన ఈ గుర్తింపు సంఘ్ ఆలోచనల నుంచి అసమ్మతి పరిణామమా? లేదా సంఘ్ వ్యాపించడానికి ఒక అధునాతన రూపమా?” అనే అంశాలను పుస్తకం తెలియజేస్తుంది.
పుస్తకంలో జనతా పార్టీ కాలం నాటి పరిణామాలను రచయిత విస్తారంగా చర్చించారు. కానీ విశ్లేషణాత్మక దృష్టితో చూసినట్టైతే వాజ్‌పేయి పాత్రను చాలా ఎక్కువ ఉదారవాదిగా, కలపుగోలు వ్యక్తిగా చూపించడం అతిశయోక్తిగా ఉంది.
1977 తర్వాత అధికార భాగస్వామ్యంలో అస్థిరత మొదలైన సందర్భాలలో వాజ్‌పేయీ ఖచ్చితంగా సామరస్యవాదిగా కనిపిస్తారు. కానీ “సంఘ్ సైద్ధాంతిక ఉనికి ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి అడ్డంకినా?” అనే ప్రాథమిక ప్రశ్నను ఆయన ఎన్నడు కూడా సవాల్ చేయలేకపోయారు.
మొరార్జీ దేశాయ్, చౌధరీ చరణ్ సింగ్ ఘర్షణలో ఆయన మధ్యవర్తిత్వ ప్రయత్నం ప్రశంసనీయమైనది. కానీ అదేసమయంలో ఉత్తరప్రదేశ్ ఒక రాజకీయ నాటకానికి వేదికగా మారింది. మొదటిసారి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి బహిరంగ వేదికపై, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ బాబాసాహెబ్ దేవరస్తో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ స్వాగత ప్రసంగం చేశారు. ఈ మొత్తం కార్యక్రమానికి అధ్యక్షత జయ్‌ప్రకాశ్ నారాయణ్ వహించారు.
ముందుగా తనను తాను మెరుగుపరుచుకోవాలనే జేపీ డిమాండ్‌తో సంఘ్‌పరివార్ ఘర్షణ పడుతుండేది. జన్‌సంఘ్, జనతా పార్టీ మధ్య సంబంధాల గురించిన ఈ రచన ఆసక్తికరమైన విషయాలు పాఠకుల ముందుకు తెస్తోంది. కేవలం తాత్కాలిక రాజకీయ అస్థిరత వర్ణనకు బదులుగా తీవ్ర వైరుధ్యాలను ప్రారంభిస్తుంది. అది భారత రాజకీయలలో సంఘ్‌పరివార్ పాత్రతో పాటు జోడించబడింది. ఇది భారతీయ రాజకీయాలలో ఆర్ఎస్ఎస్ స్థానాన్ని స్థాపించడానికి ఎంపిక చేసుకున్న రాజకీయ వ్యూహానికి సంబంధించిన వివరాలు అనేకం ఈ పుస్తకంలో మనకు లభిస్తాయి.
బ్యాంకులు, ప్రణాళికలు, ప్రభుత్వ వనరులను స్వయంసేవకుల నియంత్రణలోకి తెచ్చి సంఘ్ జనతా పార్టీ ప్రభుత్వం తన వ్యాప్తి వాహకంగా మార్చుతోంది. ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం లేదు, కానీ 2014లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత అప్పటివరకు ఎదురు చూస్తున్న ఫలితాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆస్వాదించాయి.
1987 అక్టోబర్‌కు సంబంధించిన ఒక సంఘటన, వాజ్‌పేయీ రాజకీయ, సైద్ధాంతిక సంఘర్షణ రెండు పార్శ్వాల రూపంలో ముందుకు వచ్చింది. మొదటిది వ్యక్తిగత నైతికత, మానవ సున్నితత్వం, రెండవది- రాజకీయ వ్యవహారశీలత.
1988 జనవరిలో బీజేపీ సమావేశం కొచిన్‌లో జరిగింది. అయితే, ఈ సమావేశంలో పార్టీ రెండు భాగాలుగా విభజించబడింది. ఒకవైపు శివసేనతో చేతులు కలపాలనుకున్నవారున్నారు. మరోవైపు వీపీ సింగ్‌తో వెళ్లాలనుకునేవారు. ప్రమోద్ మహాజన్ ఆ సమయంలో పార్టీ నుంచి అందరికన్న ప్రజాభిమాన నాయకుడి రూపంలో ఉద్భవించారు. ఆయన బాల్ఠాకరేతో కూటమిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై జాతీయ కార్యవర్గంలో వాడీవేడి చర్చకు కారణమైంది. బీజేపీ- శివసేన కూటమి హిందూ ఓట్లను ఒకటి చేస్తుందని చాలా వరకు కీలక నేతలు అంగీకరించారు.
కానీ అటల్ బిహారీ ఈ సమయంలో మహారాష్ట్రలో దళితుల మీద జరుగుతోన్న అన్యాయాల పట్ల చాలా బాధగా ఉన్నారు. అప్పుడు ఆయనను ముగింపు ప్రసంగం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే, వాజ్‌పేయీ మాట్లాడనని తిరస్కరించారు. కానీ ప్రమోద్ మహాజన్ ఆగ్రహం మీద ఆయన మైక్ పట్టుకున్నారు. “నన్ను ఇక వదిలేయండి. నేను ఇప్పుడు మీతో కలిసి నడవలేను” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
మళ్లీ ఆయన గద్గతస్వరంతో, “దళితుల మీద శివసేనకు ఎంత తీవ్రమై ద్వేషం ఉందంటే, వాళ్లు మహారాష్ట్రలో ఏ దళిత వరుణ్ణి గుర్రం మీద ఎక్కనివ్వరు. మంచం మీద సరిసమానంగా కూర్చోవడానికి కూడా వాళ్లకు అనుమతి ఇవ్వబడదు. నేను రాజకీయాలలోకి ఎందుకు అడుగుపెట్టానంటే, నా జంధ్యాన్ని తెంపుకొని మతం, కులం భావాలకు అతీతంగా పైకిరావాలని.”
ఏళ్ల క్రితం తన జంధ్యం తెంచుకున్న సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇది ఏ మాత్రం ప్రతీకాత్మక చర్య కాదని ఆయన సంకేతమిచ్చారు. బదులుగా ఆ సామాజిక తిరుగుబాటు ఉద్దేశ్యం, తను ‘సహన జాతీయవాదం’ ముఖచిత్రాన్ని జనం ముందు ఉంచడం.
అయినప్పటికీ ఆయన తన జీవితం వరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ భాగస్వామిగా ఉన్నారు. అది కులం, మతం రాజకీయాలను తన మూలస్థంభంగా చేసుకుంది. ఇది వాజ్‌పేయి జీవితంలో అతిపెద్ద వైరుధ్యంగా ఉంది.
ఇటువంటి సమయంలో పార్టీ మారాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆయన తీవ్ర బాధలో ఉన్నారని ఇది సంకేతమిస్తుంది. వీపీ సింగ్‌తో పాటు కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన కేవలం అధికారిక సమీకరణ వరకు మాత్రమే పరిమితం కాలేదు. బదులుగా వాజ్‌పేయి లోపల నడుస్తోన్న ఆలోచనాత్మక కల్లోలం, అసమ్మతిల పరిణామం కూడా.
అయినప్పటికీ ఆయన పార్టీ ఫిరాయించాలనే అడుగు వేయలేదు. కానీ, “బీజేపీ రాడికల్ రాజకీయాలను తనను తాను స్వయంగా దూరం పెట్టాలని అనుకున్నారు. ఆయన చివరికి బీజేపీలోనే కొనసాగారు. కానీ రాజకీయ స్వరం ఎప్పటికీ కొద్దిగా భిన్నంగా ఉంది. కొద్దిగా మానవీయమైనది, విశాలంగా ఉంది. అది ఆయనను తన కాలంనాటి ఇతర నాయకుల నుంచి వేరు చేస్తుంది. ఆయన క్షణంపాటు తిరుగుబాటు చూపిస్తారు, కానీ దీర్ఘ కాలం వరకు సంస్థలోని ప్రధానస్రవంతిలోనే ఉంటారు.
మోదీత్వ ఆధిపత్యం..
భారత రాజకీయాల్లో నేటికీ వేడిగా ఉన్న ఈ కాలం, అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితంలో అత్యంత కష్టతరమైన క్షణాలలో ఒకటిగా గుర్తించబడింది. అక్కడ ఆయన ప్రజాదరణ కూడా చివరి దశలో ఉంది. 2002 జూలై 19న గుజరాత్ అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేయడంతో ఈ దశ ప్రారంభమైంది. సెప్టెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలని మోడీ ఆశించారు. అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో గుజరాత్‌ను సందర్శించి, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకా సాధారణ స్థితికి రాలేదని ప్రకటించారు. లింగ్డో ప్రకటన మోడీ రాజకీయ ఆకాంక్షలకు ఆటంకం కలిగించింది. ఫలితంగా, మోడీ దూకుడుగా వ్యవహరించారు, తన ప్రచార ర్యాలీలలో కమిషనర్ పేరును వ్యంగ్యంగా ప్రస్తావించారు.

దీనిని గమనించిన వాజ్‌పేయి, ముఖ్యమంత్రిని మందలిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేటప్పుడు, అనుచితమైన భాషను లేదా అసభ్యకరమైన హావభావాలను ఎవరూ ఉపయోగించకూడదని ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ బహుశా వాజ్‌పేయికి అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడే అద్వానీ కూడా ఆయన వైఖరి, ఆదర్శవాదం పట్ల అసంతృప్తిగా ఉన్నారు.
ఈ సందర్భంలో జరిగిన మంత్రివర్గ సమావేశాలలో వాజ్‌పేయి ఒంటరిగా ఉన్నట్లు భావించారు. ఇది మోడీకి ప్రోత్సాహాన్నిచ్చింది. ఆయన “గౌరవ్ యాత్ర”ను ప్రారంభించి తనను తాను ఆకర్షణీయమైన వక్తగా నిరూపించుకున్నారు. ఫలితంగా, మోడీ వాజ్‌పేయి కంటే మరింత ప్రజాదరణను పొందారు.
గుజరాత్లో 2002 సెప్టెంబర్ 24న గాంధీనగర్‌లోని అక్షరధామ్ ఆలయంపై జరిగిన ఉగ్రవాద దాడి రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. అంతేకాకుండా, మోడీ రాజకీయ జీవితం వృద్ధి చెందడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. ఈ సంఘటన ఉగ్రవాదుల కంటే నరేంద్ర మోడీకే ఎక్కువ ప్రయోజనం చేకూర్చిందని, ఉగ్రవాదాన్ని అణిచివేస్తానని గుజరాత్లో ఇచ్చిన హామీకి ఇది మద్దతును కూడగట్టిందని రచయిత అభిప్రాయం.
భవిష్యత్ వారసత్వ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్ర త్వరగా ప్రతీకాత్మకంగా మారింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకవైపు వాజ్‌పేయి ప్రజాదరణ క్షీణిస్తోంది, మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. అంతేకాకుండా రాజకీయ వేదికలపై ఆయన ఉనికి క్రమంగా తగ్గింది.

ఈ పుస్తకంలో ప్రధాన విషయం ఏమిటంటే; వాజ్‌పేయి తన వ్యక్తిగత నమ్మకాలు, ఉదారవాద రాజకీయాలు, ప్రజాస్వామ్య ఆదర్శాలలో స్థిరంగా కనిపించాలని కోరుకున్నారు. అయినప్పటికీ తన పార్టీ, ఆ తర్వాత వచ్చిన వారు పదే పదే అతని మాటలు వాగాడంబరం మారే స్థాయికి నెట్టారు. ఈ వివాదం బీజేపీ దిశను మార్చడమే కాకుండా భారత రాజకీయాలను హిందూత్వ వైపు వంచింది.
(వ్యాసరచయిత ప్రాంజల్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
