గౌతమబుద్ధ నగర్ దాద్రీ ప్రాంత బిసాహడా గ్రామవాసి 52 ఏళ్ల మహమ్మద్ అఖ్లాక్ను 2015 సెప్టెంబరు 28న ఓ మూక హత్య చేసింది. ఇంట్లో గోమాంసం ఉంచాడనే సందేహంతో తనను కిరాతకంగా ప్రాణాలు పోయేంత వరకు ఆ మూక చితకబాదింది. ఈ సంఘటనతో సంబంధమున్న పదిమంది నిందితులకు వ్యతిరేకంగా హత్యతో పాటు అన్ని ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
న్యూఢిల్లీ: నోయిడాకు చెందిన దాద్రీవాసి మహమ్మద్ అఖ్లాక్ లించింగ్ వల్ల మృతి చెందిన దశాబ్దం తరువాత; లించింగ్‌తో సంబంధమున్న పదిమంది నిందితులకు వ్యతిరేకంగా హత్యతో పాటు అన్ని ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
2015 సెప్టెంబరు 28న తన ఇంట్లో గోమాంసం ఉందనే సందేహంతో గౌతమబుద్ధ నగర్ దాద్రీ పరిధిలోని బిసాహడా గ్రామవాసి 52 ఏళ్ల మహమ్మద్ అఖ్లాక్ను ఓ మూక చితకబాది హత్య చేసింది.
అఖ్లాక్ హత్యతో సంబంధమున్న మొత్తం 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. కేసుకు సంబంధించిన 181 కమ్మల దస్తావేజు(నాలుగు కమ్మల ఛార్జ్‌షీట్, 177 కమ్మల కేసు డైరీ) ప్రకారం, 2016 సెప్టెంబరులో మైనర్ నిందితుడిని విడుదల చేశారు.
ఇదే కేసుకు సంబంధించిన మరో నిందుతుడు రవి, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2016 అక్టోబరులో చనిపోయాడు. తన శవాన్ని జాతీయ జెండాలో చుట్టి తీసుకువెళ్లడంతో వివాదం చెలరేగింది.
రిపోర్ట్ ప్రకారం, గౌతమబుద్ధ నగర్‌కు చెందిన ఉన్నత సెసన్స్ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తు ప్రకారం- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్టికల్ 321 ప్రకారం కేసు వెనక్కి తీసుకోవాలని కోరారు. నిందితులలో స్థానిక బీజేపీ నేత సంజయ్ రాణా కొడుకు విశాల్ రాణా కూడా ఉన్నాడు.
ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ ప్రకరణల కింద నిందితుల మీద కేసులను నమోదు చేశారు. వీటి స్థానాన్ని ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత తీసుకుంది. అందులో 302(హత్య), 307(హత్యాప్రయత్నం), 323(స్వచ్ఛందంగా గాయపరచడం), 504(కావాలని అవమానించడం), 506(నేరపూరిత బెదరింపు) ఉన్నాయి.
ఆగస్టు 26న రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన లేఖా నిర్దేశం తర్వాత, అక్టోబరు 15న కేసు వెనక్కి తీసుకునే డిమాండ్‌ను గౌతమబుద్ధ నగర్ అసిస్టెంట్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది భాగ్ సింగ్ చేశారని రిపోర్టులో తెలియజేశారు.
గుడి లౌడ్‌స్పీకర్ ద్వారా సందేశం..
ప్రాసిక్యూషన్‌ను వెనక్కు తీసుకునే లిఖితపూర్వక అనుమతిని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఇచ్చేశారని దరఖాస్తులో పేర్కొన్నారు. అంతేకాకుండా, అఖ్లాక్ ఇంట్లో లభించిన మాంసాన్ని ఒక ప్రభుత్వ ప్రయోగశాల గోమాంసంగా గుర్తించినట్టుగా తన వైఖరిని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దరఖాస్తుకు జాయింట్ డైరెక్టర్(ప్రాసిక్యూషన్) బృజేశ్ కుమార్ మిశ్రా ఒక లేఖను కూడా జోడించారు. అందులో కేసును వెనక్కి తీసుకునేలా సింగ్‌కు నిర్దేశించబడింది.
అవుట్‌లుక్ నివేదిక ప్రకారం, కేసు ఇప్పటీకి కోర్టులో పెండింగ్‌లోనే ఉంది. అక్కడ నుంచి ఆరోపణలను తొలిగించేకంటే ముందు కోర్టు అంగీకారం ఖచ్చితంగా ఉండాలి.
బిసాహడా గ్రామ 52 ఏళ్ల అఖ్లాక్ను, తన కొడుకు దానిష్‌ను తమ ఇంటి నుంచి మూక బయటకు గుంజి, వారి మీద అమానవీయంగా 2015 సెప్టెంబరు 28న దాడికి దిగారు. దాడికి దిగిన సమయంలో “ఒక ఆవును చంపి తన ఫ్రిజ్‌లో గోమాంసాన్ని ఉంచాడు” అని ఒక గుడి లౌడ్‌స్పీకర్ ద్వారా ప్రకటించబడింది. మూకహింసను తట్టుకోలేకా అఖ్లాక్ ఘటనా స్థలంలోనే ప్రాణాలను వదిలాడు. మరోవైపు తన కొడుకు తీవ్ర గాయాలపాలయ్యాడు.
దేశవ్యాప్తంగా అఖ్లాక్ మూక హింసా, అసహనంతో పాటు గోమాంసం తినే దాని మీద చర్చకు దారి తీసింది. ఇది రాజకీయ, సామాజిక వర్గాలలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. చాలామంది పౌర సమూహాలు “నాట్ ఇన్ మై నేమ్”అనే మార్చ్‌ను నిర్వహించారు. ఇది లౌకిక, ప్రజాస్వామ్య విలువలు బలహీనపడే సంకేతమని రాజకీయ కార్యకర్తలు, మేధావులు నొక్కి చెప్పారు. చివరికి, మోదీ దశాబ్దం తర్వాత ఉత్తర భారతదేశంలో ఇదే విధమైన దాడులకు ఈ ఘటన ఒక భయానక ఉదాహరణగా నిలిచింది. మరోవైపు స్వయంప్రకటిత “గోరక్షకులు” గోరక్షణ పేరు మీద గోహత్య/ పశువుల రవాణా ఆరోపణలతో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
