2026 మే 31న జరిగిన కొలంబియా అధ్యక్ష ఎన్నికలలో ప్రధానంగా కమ్యూనిస్టు, అమెరికా ఏజెంట్లలా పనిచేసేవారి మధ్య ఉత్కంఠభరితంగా పోటీ సాగింది.
చివరికి అమెరికన్ ఏజెంట్‌కు 44%, కమ్యూనిస్టుకు 41% ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50% రాని కారణంగా మళ్లీ జూన్ 21న ఎన్నికలు జరగనున్నాయి.
30 ఏళ్ల కిందట ఒక కమ్యూనిస్టు లాయర్ సెనేటర్‌గా గెలిచారు. గెరిల్లా పోరాటం, ఎన్నికలు రెండూ కలిపి అధికారం హస్తగతం చేసుకోవాలని ఒక పథకం వేశారు.
ఆయన పేరు మాన్యుయల్ సెపెడా. కానీ రాజధాని బొగోటా నడిరోడ్డులో ప్రభుత్వ మనుషులు ఆయన్ని హత్య చేశారు. ఆ సెనేటర్ కొడుకే ఇవాన్ సెపెడా.
తండ్రి చనిపోయాక బాధపడకుండా ఆయన కల నిజం చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు.
మొదట ఎంపీగా, తర్వాత సెనేటర్‌గా గెలిచారు. తర్వాత కొలంబియాలో మొదటిసారి వచ్చిన వామపక్ష అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ప్రధాన సలహాదారుడు అయ్యారు.
ఇప్పుడు దేశ అధ్యక్ష ఎన్నికల రేసులో ముందున్నారు.
ఇంతకుముందు కొలంబియా దేశ ప్రభుత్వం ఎప్పుడూ అమెరికాతో దోస్తీ చేస్తూ సాంప్రదాయ నాయకుల్ని గెలిపించుకుంటూ వచ్చింది.
ఈసారి అధ్యక్ష ఎన్నికలలో తాను గెలిస్తే కమ్యూనిస్టు అయిన తన తండ్రి కలలు కన్న విధంగా దేశాన్ని కొత్తదారిలో తీసుకెళ్తాను అని మాట ఇచ్చారు.
63 ఏళ్ల సెపెడా ఆర్మీ చేసిన తప్పుల్ని బయటపెట్టి పేరు తెచ్చుకున్నారని అతని అనుయాయులు చెబుతున్నారు.
కొలంబియా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ “పొలాలు పేదోళ్లకు పంచుతాను. కొకైన్ ముఠాలతో మాట్లాడి ఆయుధాలు వదిలేలా చేస్తాను. పేదోళ్ల కోసం ప్రభుత్వ ఖర్చు పెంచుతాను. సెంట్రల్ బ్యాంకు వడ్డీలు పెంచకుండా ఆపుతాను” అని అంటున్నారు.
కొలంబియా దేశ చట్టం ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడు పదవి విరమణ చేయాలి. ఆయన మొదలుపెట్టిన రాజ్యాంగం మార్చే పని కొనసాగిస్తాను అని అంటున్నారు.
మార్క్సిస్ట్ విధానాలపై విమర్శలు – పెట్టుబడిదారుల భయాలు..
కానీ ఇతని వ్యతిరేకులు భయపడుతున్నారు. ఇతను పక్కా మార్క్సిస్టు. కొలంబియాను వెనిజులా, క్యూబాలా చేస్తాడు అని విమర్శిస్తున్నారు.
సెపెడా మాత్రం ‘నేను డెమోక్రసీనే నమ్ముతాను. చట్ట ప్రకారమే నడుస్తాను’ అని విమర్శలను కొట్టి పారేస్తున్నారు.
ఇటలీకి చెందిన పాత కాలం మార్క్సిస్ట్ ఆంటోనియో గ్రామ్షీ లాగ సెపెడా ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. గ్రామ్షీ చెప్పిందేమిటంటే బలవంతంతో కాదు, సాంస్కృతిక సంస్థలలో మమేకమై అధికారాన్ని చేజిక్కించుకోవాలి.
“సెపెడా మొండి కమ్యూనిస్ట్. మాలాంటి వ్యాపారస్తులకు ఆయన వ్యతిరేకి” అని పెద్ద కంపెనీ బాస్ ఎడ్వర్డ్ పాచెకో అన్నారు. “అతడు నమ్మిన సిద్ధాంతానికి గట్టిగా కట్టుబడి ఉంటాడు, మేము మనుగడ సాగించలేము” అని పాచెకో అన్నారు.
ప్రజల మద్దతు – అమెరికా ఆధిపత్యంపై తిరుగుబాటు..
ఎన్నికల సర్వే పోల్స్ ప్రకారం, ఈ ఆదివారం మొదటి రౌండ్లోనే సెపెడా ఈజీగా గెలుస్తారు. అతని తర్వాత స్థానంలో పెద్ద నాయకురాలు పలోమా వాలెన్సియా, లాయర్ అబెలార్డో డి లా ఎస్ప్రియేల్లా ఉన్నారు. మానవ హక్కుల కోసం పనిచేశారు కాబట్టి సెపెడాకు జనాల్లో బాగా మద్దతు ఉంది.
గెలిస్తే పెట్రో పార్టీ ”హిస్టారిక్ ప్యాక్ట్”కి ఇది రెండో దఫా అవుతుంది, అది కూడా ఇంకా గట్టిగా. 5 కోట్ల 30 లక్షల జనాభా ఉన్న కొలంబియాకు ఇది పెద్ద మలుపు. ఇన్నాళ్లు ఇక్కడ అమెరికాకు దగ్గరగా ఉండే నాయకులనే గెలిపించారు. అర్జెంటీనా, వెనిజులా లాంటి అమెరికా వ్యతిరేక దేశాలకు దూరంగా ఉన్నారు.
సెపెడా ఇంకో మాట కూడా అన్నారు. ”అమెరికా బానిసత్వం ఇక చాలు”. 1990లో పాబ్లో ఎస్కోబార్ రోజుల నుంచి అమెరికా, కొలంబియా ఆర్మీకి, పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడానికి, కోర్టులు బాగు చేయడానికి, కోట్ల కొద్దీ డాలర్లు పోసింది.
మొదట్లో సెపెడా ప్రచారం స్లోగా జరిగింది. కానీ ఇప్పుడు స్పీచ్‌లలో, ఇంటర్వ్యూలలో తన ప్లాన్ క్లియర్‌గా చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది డ్రగ్స్ దందాను తగ్గించడం. ఇది ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద టెన్షన్. ”పేద పల్లెటూర్లను బాగు చేస్తే అమెరికా మీద ఆధారపడటం తగ్గుతుంది” అని సెపెడా అంటున్నారు.
”అమెరికాతో మంచి సంబంధాలు ఉండాలని ఉంది. కానీ వాళ్లు మనల్ని బానిసల్లా, వాళ్ల కాలనీలా చూడకూడదు”.
అక్టోబర్‌లో ఒక స్పీచ్‌లో గట్టిగా చెప్పారు, “మేం పెద్దమనుషుల కాళ్లు మొక్కడానికి, వాళ్లు ఉమ్మేసిన చేతులు నాకడానికి ఇక్కడ లేము” అన్నారు.
సెపెడా మాటలు చాలా మంది సామాన్య జనాలకు నచ్చుతున్నాయి. ”ప్రభుత్వం మన గురించి ఇంకా ఎక్కువ ఆలోచించాలి. మనలాంటి వాళ్లకు కూడా అవకాశం రావాలి” అనే ఆశ కనిపిస్తుంది. ఇతను ”రివల్యూషన్ తేవాలనుకుంటున్నాడు” అని రాజధానిలో ర్యాలీకి వచ్చిన 42 ఏళ్ల సైకిల్ షాప్ అతను ఎడ్విన్ రేఎస్ చెప్పారు.
”ఇన్నాళ్లు సామాన్యుడి తరఫున మాట్లాడే నిజమైన లీడర్ లేడు. పెద్దోళ్లకు మాత్రమే వాయిస్ ఉండేది. ఇప్పుడు మొదటిసారి కార్మికులు, పల్లెటూరులలో పేద జనాలకు కూడా మనకంటూ ఒకడున్నాడు అనిపిస్తోంది” అని సాధారణ ప్రజలు అనుకుంటున్నారు.
జూన్ 21న నిర్ణయాత్మక పోరు..
అధ్యక్ష ఎన్నికలు మే 31 ఆదివారం జరిగాయి. ప్రజా శ్రేయస్సు, దేశ శ్రేయస్సు కోరే కమ్యూనిస్టు అయిన సెపెడాకు 41%, అమెరికా బంటు అయిన ప్రత్యర్థికి 44% ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50 శాతం ఓట్లు రాలేదు కనుక మళ్లీ జూన్ 21వ తేదీ మరొకమారు ఎన్నిక జరుగుతుంది.
ఆ ఎన్నికలలో ప్రజలు నెగ్గుతారా? లేక అమెరికన్ సామ్రాజ్యవాదం నెగ్గుతుందా? కొలంబియా ప్రజలు స్వేచ్ఛా ప్రపంచంలో తిరగగలుగుతారా? లేక అమెరికా ఆంక్షల మధ్య నలిగిపోతారా? వేచి చూడాల్సిన అవసరం ఉన్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
